dream home
-
సొంతింటి కల నిజం చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో..!
ఇప్పుడున్న టాలీవుడ్ ఫ్యాన్స్‌కు ఈ పరిచయం అక్కర్లేని పేరు కిరణ్ అబ్బవరం. రాజావారు రాణిగారు చిత్రంలో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో. ఆ తర్వాత ఎస్ఆర్ కల్యాణమండపం మూవీతో ఫేమ్ తెచ్చుకున్నారు. అనంతరం సెబాస్టియన్ పి.సి.524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం రూల్స్ రంజన్ అంటూ సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. (ఇది చదవండి: జవాన్ టీం బంపరాఫర్.. ఆ మూడు రోజులు టికెట్ ఫ్రీ!) ఇకపోతే సొంతింటి కల అనేది సామాన్యులకైనా.. సెలబ్రిటీలకైనా ఒకటే. ప్రతి ఒక్కరి జీవితంలో అది ఒక మైల్స్టోన్. అయితే తాజాగా మన హీరో కిరణ అబ్బవరం సొంతింటి కలను నిజం చేసుకున్నారు. కానీ కిరణ్ తన సొంత ఊర్లోనే ఈ ఇంటిని నిర్మించినట్లు తెలుస్తోంది. కడప జిల్లా రాయచోటికి చెందిన కిరణ్ గృహా ప్రవేశానికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు ఆయనకు అభినందనలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram) -
హమ్మయ్యా.. అమ్మ కల నెరవేరింది
ఇంటిపట్టున ఉండి పిల్లాడి ఆలనాపాలన చూడాలనేది ఆమె కల. అయితే ఆమెది రెక్కాడితేగానీ డొక్కాడని జీవితం. పొద్దున పని కోసం బయటికి వెళితే ఏ రాత్రో ఇంటికి వచ్చేది. సెలవంటూ లేని పని. పరీక్ష ఫీజు కట్టలేని సందర్భంలో పిల్లాడిని పట్టుకొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో కష్టాలు పడి పిల్లాడిని చదివించింది. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన ఆ అబ్బాయి అయూష్ గోయల్ ఎకౌంటెంట్ అయ్యాడు. ఆ తరువాత ట్విట్టర్ కాపీరైటర్‌గా మంచి ఆదాయన్ని అర్జిస్తున్నాడు. అమ్మను పని మానిపించాడు. తాము ఉండే ఇరుకు గది నుంచి 2–బెడ్రూమ్ అపార్ట్‌మెంట్‌కు మారాడు. ‘ఇప్పుడు మా అమ్మ ఫుల్–టైమ్ మదర్’ అని తల్లి ఫొటోలను జత చేస్తూ ఆయూష్ గోయల్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఎంతోమందిని కదిలించింది. -
రూ.300 కోట్లతో హీరో ధనుష్ డ్రీమ్ హోమ్!
స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కేవలం తమిళనాటనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి పాపులారిటీ ఉంది. తెలుగులో తనకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మొట్టమొదటిసారిగా డైరెక్ట్ తెలుగు ఫిలిం చేస్తున్నాడీ హీరో. టాప్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సార్ సినిమా చేస్తున్నాడు. అటు తమిళ, హిందీలోనూ పలు ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి. ఇటీవలే భార్య ఐశ్వర్య రజనీకాంత్‌కు విడాకులు ఇచ్చి వార్తల్లో నిలిచాడు ధనుష్. అప్పటినుంచి అతడు హోటల్లోనే బస చేస్తున్నట్లు వార్తలు రాగా తాజాగా మరో ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. చెన్నైలో ధనుష్ విలాసవంతమైన ఇంటి నిర్మాణం చేపడుతున్నాడట! దీనికోసం అతడు ఏకంగా రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నాడట! ఇదే నిజమైతే 300 కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు సొంతం చేసుకున్న ఏకైక సౌత్ హీరోగా ధనుష్ రికార్డు సృష్టించడం ఖాయం. కాగా ధనుష్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. ఇక తెలుగులో శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరితో చేస్తున్న రెండు సినిమాలకు కలిపి మొత్తంగా రూ.100 కోట్లు వెనకేసినట్లు తెలుస్తోంది. ఈ డబ్బునంతా కూడా తన లగ్జరీ ఇంటి కోసమే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం! -
ముంబైలో కొత్త ఇల్లు కొన్న పూజా హెగ్డే
Pooja Hegde : సొంత ఇల్లు కట్టుకోవాలనే కల అందరికీ ఉంటుంది. ఆ కలను జీవితంలో తొందరగానే నిజం చేసుకున్నారు హీరోయిన్ పూజా హెగ్డే. ముంబైలో ఆమె ఓ ఇల్లు కొన్నారు. ఆ ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా డిజైన్ చేయించుకుంటున్నారు. ఇంటీరియర్ డిజైన్, కలర్ వంటి విషయాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘‘నా కలలను నిర్మించుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు పూజ. చదవండి: జార్జ్ ఎవరెస్ట్‌ను ఎక్కిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇక సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ‘భాయిజాన్’, రణ్వీర్ సింగ్‌తో ‘సర్కస్’ చిత్రాలు చేస్తున్నారు పూజ. సౌత్‌లో మహేశ్ బాబు, ప్రభాస్, పవన్ కల్యాణ్, విజయ్ చిత్రాలకు ఇచ్చిన కమిట్మెంట్తో పూజా హెగ్డే డైరీ నిండుగా ఉంది. అందుకే పూరి జగన్నాథ్ భార్య అంటే ఇష్టం: ప్రభాస్ View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
భార్యకు ప్రేమతో.. కేవలం 24 గంటల్లోనే!
బెంగళూరు: భార్య మీద ప్రేమతో ఆమెకు అపురూప కానుక ఇవ్వాలని భావించాడు ఓ వ్యాపారి. అందుకోసం భార్య పుట్టినరోజున ఆమెకు ఓ కొత్త ఇల్లు కట్టివ్వాలని, కేవలం ఒకరోజు లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఆమె కళ్లల్లో ఆనందం చూడాలని ఆశ పడుతున్నాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. కొడగుకు చెందిన వ్యాపారి త్యాగ్ ఉతప్ప కాఫీ పంటల పెంపకం కూడా చేస్తుంటారు. జూలై 16న ఉతప్ప భార్య పుట్టినరోజు కావడంతో ఆమెకు ఓ తక్కువ వ్యవధిలో ఓ ఇంటిని నిర్మించి సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు. ఇందుకోసం దాదాపు రూ.70-80 లక్షల మేర ఖర్చు చేయనున్నారు. అయితే 24 గంటల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేయించి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకోవాలన్న తాపత్రయం ఆయనలో ఉంది. దీంతో ఆ స్పెషల్ డ్రీమ్ హోమ్ కోసం బెంగళూరుకు చెందిన రెబల్ డిస్రప్టీవ్ బిల్డింగ్ టెక్నాలజీస్ అనే కంపెనీతో మాట్లాడుకున్నారు. ఇంటిని రికార్డు సమయంలో పూర్తి చేయించి ఆమె పుట్టినరోజు కానుక ఇచ్చి జీవితాంతం గుర్తుండిపోయేలా చేయడంలో ఎంతో సంతృప్తి ఉందని వ్యాపారి త్యాగ్ ఉతప్ప అన్నారు. 2,400 గజాల స్థలంలో నిర్మించనున్న ఈ ఇంట్లో మూడు బెడ్రూమ్లు ఏర్పాటుచేస్తారు. బెంగళూరు, టిఅగ్రహారలో స్టోన్‌హిల్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో ఈ ఇంటి నిర్మాణానికి అంతా సిద్ధం చేశారు. ఈ నిర్మాణానికి సిద్ధంగా ఉండే (ప్రీకాస్ట్) అచ్చులను వినియోగిస్తారు. 'సరిగ్గా జూలై 15న ఏ సమయానికి నిర్మాణం చేపడతామో 16న అదే సమయంలోపే డ్రీమ్ హోమ్ నిర్మాణం పూర్తి చేయాలని వ్యాపారి చెప్పారు. ఇప్పటికే అచ్చులతో పాటు రంగులు, లైట్లు, టైల్స్, అలంకరణ సామాగ్రి, ఇతరత్రా ముడి సరుకులను ఏర్పాటు చేశాం. కేవలం 24 గంటల్లోనే ఇంటిని నిర్మిస్తాం. ఖర్చుకు మాత్రం ఓనర్ వెనుకాడలేదని' కాంట్రాక్ట్ కంపెనీ చీఫ్ ప్యాడీ మీనన్ తెలిపారు. -
అమ్మకానికి హీరో డ్రీమ్ హోమ్
హాలీవుడ్ హీరో మైఖెల్ ఫాక్స్, ఆయన భార్య ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. హాలీడే ట్రిప్ కోసం, రిలాక్స్ అవడానికి అప్పుడప్పుడు ఆ ఇంటిలో ఫాక్స్ తన భార్య ట్రేసి పొల్లన్ తో కలిసి సమయాన్ని గడిపేవాడు. ఆ ఇంటిని 1997లో నిర్మించారు. డ్రీమ్ హౌస్ ట్రేసి పుట్టింటికి దగ్గర్లో ఉండటంతో ఆమెతో పాటు మైఖెల్ కు కూడా ఆ ఇల్లు ప్లస్ పాయింట్ లాగ అనిపించేది. ఎంతో కలిసొచ్చిన ఆ ఎస్టేట్ ను వదులుకోవడానికి ఇష్టం లేకున్నా ఆర్థిక అవసరాల దృష్ట్యా డ్రీమ్ హోమ్‌ను అమ్మకానికి పెట్టేశారు. కొన్ని రోజులుగా మైఖెల్ ఆ ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడని, కొందరు అవన్నీ పుకార్లని భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మైఖెల్ తన డ్రీమ్ హౌస్ ను దాదాపు రూ.28.2కోట్ల(4.25 అమెరికన్ డాలర్స్)కు అమ్ముతున్నట్లు వెల్లడించడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. షరోన్ లో ఉన్న ఈ ఎస్టేట్ లో ఐదు విశాలమైన పడక గదులున్నాయని, ఇంటి చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని ట్రెసి పొల్లన్, మైఖెల్ వివరించారు. ఆ ఎస్టేట్ అంటే వారికి ఎంత ఇష్టమో చాలాసార్లు ప్రస్తావించారు, పరిస్థితులు అనుకూలించని కారణంగా ఎస్టేట్ ను వదులుకోవాల్సి వచ్చిందని మైఖెల్ తెలిపాడు.