భార్యకు ప్రేమతో.. కేవలం 24 గంటల్లోనే! | Businessman will gift a dream home for wife built in one day | Sakshi
Sakshi News home page

భార్యకు ప్రేమతో.. కేవలం 24 గంటల్లోనే!

Published Tue, Jul 11 2017 11:27 AM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

భార్యకు ప్రేమతో.. కేవలం 24 గంటల్లోనే!

భార్యకు ప్రేమతో.. కేవలం 24 గంటల్లోనే!

బెంగళూరు: భార్య మీద ప్రేమతో ఆమెకు అపురూప కానుక ఇవ్వాలని భావించాడు ఓ వ్యాపారి. అందుకోసం భార్య పుట్టినరోజున ఆమెకు ఓ కొత్త ఇల్లు కట్టివ్వాలని, కేవలం ఒకరోజు లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఆమె కళ్లల్లో ఆనందం చూడాలని ఆశ పడుతున్నాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. కొడగుకు చెందిన వ్యాపారి త్యాగ్ ఉతప్ప కాఫీ పంటల పెంపకం కూడా చేస్తుంటారు. జూలై 16న ఉతప్ప భార్య పుట్టినరోజు కావడంతో ఆమెకు ఓ తక్కువ వ్యవధిలో ఓ ఇంటిని నిర్మించి సర్‌ప్రైజ్ చేయాలనుకున్నాడు.

ఇందుకోసం దాదాపు రూ.70-80 లక్షల మేర ఖర్చు చేయనున్నారు. అయితే 24 గంటల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేయించి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకోవాలన్న తాపత్రయం ఆయనలో ఉంది. దీంతో ఆ స్పెషల్ డ్రీమ్ హోమ్ కోసం బెంగళూరుకు చెందిన రెబల్ డిస్‌రప్టీవ్ బిల్డింగ్ టెక్నాలజీస్ అనే  కంపెనీతో మాట్లాడుకున్నారు. ఇంటిని రికార్డు సమయంలో పూర్తి చేయించి ఆమె పుట్టినరోజు కానుక ఇచ్చి జీవితాంతం గుర్తుండిపోయేలా చేయడంలో ఎంతో సంతృప్తి ఉందని వ్యాపారి త్యాగ్ ఉతప్ప అన్నారు. 2,400 గజాల స్థలంలో నిర్మించనున్న ఈ ఇంట్లో మూడు బెడ్రూమ్‌లు ఏర్పాటుచేస్తారు.

బెంగళూరు, టిఅగ్రహారలో స్టోన్‌హిల్‌ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో ఈ ఇంటి నిర్మాణానికి అంతా సిద్ధం చేశారు. ఈ నిర్మాణానికి సిద్ధంగా ఉండే (ప్రీకాస్ట్‌) అచ్చులను వినియోగిస్తారు. 'సరిగ్గా జూలై 15న ఏ సమయానికి నిర్మాణం చేపడతామో 16న అదే సమయంలోపే డ్రీమ్ హోమ్ నిర్మాణం పూర్తి చేయాలని వ్యాపారి చెప్పారు. ఇప్పటికే అచ్చులతో పాటు రంగులు, లైట్లు, టైల్స్, అలంకరణ సామాగ్రి, ఇతరత్రా ముడి సరుకులను ఏర్పాటు చేశాం. కేవలం 24 గంటల్లోనే ఇంటిని నిర్మిస్తాం. ఖర్చుకు మాత్రం ఓనర్ వెనుకాడలేదని' కాంట్రాక్ట్ కంపెనీ చీఫ్ ప్యాడీ మీనన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement