అమ్మకానికి హీరో డ్రీమ్ హోమ్ | Michael J. Fox wants to sell family vacation home | Sakshi
Sakshi News home page

అమ్మకానికి హీరో డ్రీమ్ హోమ్

Published Sun, Sep 4 2016 8:58 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

అమ్మకానికి హీరో డ్రీమ్ హోమ్

అమ్మకానికి హీరో డ్రీమ్ హోమ్

హాలీవుడ్ హీరో మైఖెల్ ఫాక్స్, ఆయన భార్య ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. హాలీడే ట్రిప్ కోసం, రిలాక్స్ అవడానికి అప్పుడప్పుడు ఆ ఇంటిలో ఫాక్స్ తన భార్య ట్రేసి పొల్లన్ తో కలిసి సమయాన్ని గడిపేవాడు.  ఆ ఇంటిని 1997లో నిర్మించారు. డ్రీమ్ హౌస్ ట్రేసి పుట్టింటికి దగ్గర్లో ఉండటంతో ఆమెతో పాటు మైఖెల్ కు కూడా ఆ ఇల్లు ప్లస్ పాయింట్ లాగ అనిపించేది. ఎంతో కలిసొచ్చిన ఆ ఎస్టేట్ ను వదులుకోవడానికి ఇష్టం లేకున్నా ఆర్థిక అవసరాల దృష్ట్యా డ్రీమ్ హోమ్ను అమ్మకానికి పెట్టేశారు.

కొన్ని రోజులుగా మైఖెల్ ఆ ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడని, కొందరు అవన్నీ పుకార్లని భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మైఖెల్ తన డ్రీమ్ హౌస్ ను దాదాపు రూ.28.2కోట్ల(4.25 అమెరికన్ డాలర్స్)కు అమ్ముతున్నట్లు వెల్లడించడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. షరోన్ లో ఉన్న ఈ ఎస్టేట్ లో ఐదు విశాలమైన పడక గదులున్నాయని, ఇంటి చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని ట్రెసి పొల్లన్, మైఖెల్ వివరించారు. ఆ ఎస్టేట్ అంటే వారికి ఎంత ఇష్టమో చాలాసార్లు ప్రస్తావించారు, పరిస్థితులు అనుకూలించని కారణంగా ఎస్టేట్ ను వదులుకోవాల్సి వచ్చిందని మైఖెల్ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement