goalkeeper
-
PR Sreejesh: జెర్సీ నంబర్ 16కు వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత దిగ్గజ గోల్‌కీపర్ శ్రీజేశ్ ఇకపై హాకీ మైదానంలో కనిపించడు. అలాగే అతని జెర్సీ నంబర్ 16 కూడా కనిపించదు. గోల్‌పోస్ట్ ముందు ప్రత్యర్థులకు అడ్డుగోడలా నిలబడి భారత జట్టుకు విశేష సేవలందించిన శ్రీజేశ్ ఘనకీర్తికి గుర్తుగా ఆ జెర్సీకి అతనితోపాటే రిటైర్మెంట్ ఇవ్వాలని హాకీ ఇండియా (హెచ్ఐ) నిర్ణయించింది. బుధవారం ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జట్టు సభ్యులను ఘనంగా సన్మానించారు. శ్రీజేశ్కు రూ. 25 లక్షల నగదు పురస్కారం చెక్ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్ టిరీ్క, భోళానాథ్ సింగ్‌లు మాట్లాడుతూ శ్రీజేశ్‌ను ఆకాశానికెత్తారు. ఆధునిక భారత హాకీకి అతనొక దేవుడని కితాబిచ్చారు. భారత సీనియర్ పురుషుల జట్టులో 16వ నంబర్ జెర్సీని ఎవరికీ కేటాయించబోమని భోళానాథ్ చెప్పారు. ‘శ్రీజేశ్ త్వరలోనే జూనియర్ భారత జట్టు కోచ్‌గా వెళతారు. ఘనమైన కెరీర్‌కు అతను వీడ్కోలు పలికితే ... హాకీ ఇండియా అతని ఘనకీర్తికి గుర్తుగా జెర్సీ నంబర్ 16కు రిటైర్మెంట్ ఇచ్చింది. అయితే ఇది సీనియర్ స్థాయికే పరిమితం. జూనియర్ జట్టులో 16వ జెర్సీ యథాతథంగా కొనసాగుతుంది’ అని ఆయన వివరించారు. -
FIFA World Cup 2022: క్రొయేషియా కేక
దోహా: లీగ్ దశలో రెండు ప్రపంచ మాజీ చాంపియన్ జట్లపై (జర్మనీ, స్పెయిన్) సంచలన విజయం సాధించిన జపాన్ జట్టు కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం తడబడింది. గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా జట్టుతో సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జపాన్ ‘షూటౌట్’లో ఓడిపోయింది. జపాన్ను ఏమాత్రం తక్కువ చేయకుండా నిర్ణీత సమయంలో... ఆ తర్వాత అదనపు సమయంలోనూ జాగ్రత్తగా ఆడిన క్రొయేషియా నిర్ణాయక ‘షూటౌట్’లో మాత్రం పూర్తిగా పైచేయి సాధించింది. తుదకు ‘షూటౌట్’లో 3–1తో జపాన్ను ఓడించి ఈ మెగా ఈవెంట్లో మూడోసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 1998లో మూడో స్థానం పొందిన క్రొయేషియా, 2018లో రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు జపాన్ ప్రస్థానం నాలుగోసారి ప్రిక్వార్టర్ ఫైనల్‌కే పరిమితమైంది. గతంలో మూడుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరి ఈ గండాన్ని అధిగమించలేకపోయిన ‘బ్లూ సమురాయ్’ బృందానికి నాలుగోసారీ నిరాశే ఎదురైంది. క్రొయేషియా సంబరం ముందుగా ఆట 43వ నిమిషంలో డైజెన్ మేడా గోల్‌తో జపాన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 55వ నిమిషంలో లావ్రెన్ కుడి వైపు నుంచి కొట్టిన క్రాస్ షాట్‌ను ‘డి’ ఏరియాలో పెరిసిచ్ హెడర్ షాట్‌తో గోల్‌గా మలచడంతో క్రొయేషియా స్కోరును 1–1తో సమం చేసింది. అనంతరం రెండు జట్లు మరో గోల్ చేయకపోవడంతో నిర్ణీత సమయానికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఫలితం తేలడానికి అదనపు సమయం (15 నిమిషాలు నిడివి గల రెండు భాగాలు) ఆడించారు. అదనపు సమయంలోనూ స్కోరు సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ అనివార్యమైంది. ‘షూటౌట్’లో క్రొయేషియా గోల్‌కీపర్ లివాకోవిచ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. జపాన్ ఆటగాళ్లు కొట్టిన మూడు షాట్లను నేర్పుతో నిలువరించాడు. మరోవైపు క్రొయేషియా జట్టులో లివాజా కొట్టిన షాట్ గోల్‌పోస్ట్ బార్‌కు తగిలి పక్కకు వెళ్లగా, మిగతా ముగ్గురు ఆటగాళ్లు జపాన్ గోల్కీపర్ను బోల్తా కొట్టించి బంతిని లక్ష్యానికి చేర్చారు. బ్రెజిల్, దక్షిణ కొరియా మ్యాచ్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో క్రొయేషియా ఆడుతుంది. -
ఓర్నీ.. మీరెక్కడ తయారయ్యార్రా బాబూ
టెక్నాలజీ వల్ల ఎంత మంచి జరుగుతుందో.. ఒక్కోసారి అంతే ఇబ్బందులూ ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో నడిచే కమ్యూనికేషన్.. చిన్న చిన్న పొరపాట్ల వల్ల మిస్ కమ్యూనికేషన్ మారుతుంది కూడా. కేవలం టెక్నికల్ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని.. వ్యవహారంతో సంబంధం లేనివాళ్లను ఇబ్బంది పెడుతుండటం తరచూ చూస్తుంటాం. అలాంటిదే ఈ ఘటన. ప్రస్తుతం పంజాబ్ రాజకీయ సంక్షోభం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా అనంతర పరిణామాలు ఆసక్తిగా మారాయి. అయితే ఈ వ్యవహారంలోకి సంబంధం లేని వ్యక్తి పేరు తెర మీదకు రాగా.. అది సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. అమరీందర్ సింగ్.. ఇండియన్ ఫుట్‌బాల్ టీం గోల్ కీపర్. అయితే ఈ అమరీందర్ సింగ్‌ను.. కెప్టెన్ అమరీందర్ సింగ్‌గా పొరపడి మీడియా ఛానెల్స్, వెబ్సైట్లు, నెటిజన్స్ ఎగబడి ట్విటర్లో ట్యాగ్ చేస్తున్నారట. Dear News Media, Journalists, I am Amrinder Singh, Goalkeeper of Indian Football Team 🇮🇳 and not the Former Chief Minister of the State Punjab 🙏😂 Please stop tagging me. — Amrinder Singh (@Amrinder_1) September 30, 2021 దీంతో ఈ ట్యాగుల గోల భరించలేక ట్విటర్లో రియాక్ట్ అయ్యాడు గోల్ కీపర్ అమరీందర్ సింగ్. దయచేసి ట్యాగ్ చేయడం ఆపండంటూ మీడియా హౌజ్‌లకు రిక్వెస్ట్‌లు చేశాడాయన. మనోడి రిక్వెస్ట్‌కి మీడియా పేజీల సంగతేమోగానీ.. నెటిజన్స్ మాత్రం భలేగా రియాక్ట్ అవుతున్నారు. గోల్‌కీపర్ అమరీందర్.. జట్టుకు కెప్టెన్ అయ్యి ఉంటే సరిగ్గా సరిపోయి ఉండేదని ఒకరు, సీఎం అయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టమని మరొకరు.. ఇలా ఒక్కోక్కరు సరదా సంభాషణలతో గోల్‌కీపర్ అమరీందర్ టైం లైన్‌ను నింపేస్తున్నారు. Please dont accept captaincy of the team for some time. Otherwise definitely you will be made CM candidate. — Mudisu Drejine (@magicdheer) September 30, 2021 😂😂 pic.twitter.com/dvzbGUZbg2 — Superpower Football (@SuperpowerFb) September 30, 2021 Indian Media ryt now 👇😂 pic.twitter.com/sk41ow9PFY — 90ndstoppage (@90ndstoppage) September 30, 2021 -
భారత్ శుభారంభం
జించియోన్: దక్షిణ కొరియా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 2–1తో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున లాల్రెమ్సియామి (20వ ని.), నవనీత్ కౌర్ (40వ ని.) చెరో గోల్ చేశారు. కొరియా తరఫున షిన్ హ్యెజియాంగ్ (48వ ని.) గోల్ సాధించింది. ఆతిథ్య కొరియాకు పదే పదే పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కినా... భారత గోల్‌కీపర్ సవిత గోల్‌పోస్ట్ ముందు గోడలా నిలబడింది. ఐదు పీసీ లను, ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను సమర్థంగా అడ్డుకుంది. రెండో మ్యాచ్ బుధవారం జరుగుతుంది. -
గోల్‌కీపర్ ఆకాశ్ చిక్టేపై రెండేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్న భారత క్రీడాకారులపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సస్పెన్షన్ వేటు వేసింది. భారత హాకీ గోల్ కీపర్ ఆకాశ్ చిక్టేపై రెండేళ్లు, రెజ్లర్ అమిత్, కబడ్డీ ప్లేయర్ ప్రదీప్ కుమార్, వెయిట్‌లిఫ్టర్ నారాయణ్ సింగ్, అథ్లెట్స్ సౌరభ్ సింగ్, బల్జీత్ కౌర్, సిమర్జిత్ కౌర్‌లపై నాలుగేళ్ల నిషేధం విధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో నిర్వహించిన శిక్షణ శిబిరం సందర్భంగా చిక్టే రక్త,మూత్ర నమూనాల్ని పరీక్షించారు. ఇందులో నిషిద్ధ ఉత్ప్రేరకాలైన అనబాలిక్ స్టెరాయిడ్ తీసుకున్నట్లు తేలింది. అయితే అతను కావాలని దీన్ని తీసుకోలేదని కాలికి దెబ్బతగలడంతో డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో మెడిసిన్ ద్వారా తీసుకున్నట్లు చెప్పారు. దీంతో అతనికి కేవలం రెండేళ్ల నిషేధంతోనే సరిపెట్టగా... మిగతా ఆరుగురు మాత్రం ఎప్పుడు, ఎందుకు తీసుకున్నారో వెల్లడించకపోవడంతో నాలుగేళ్లు నిషేధించారు. అయితే దీనిపై అప్పీలు చేసుకునేందుకు ఆటగాళ్లకు అవకాశముంది. 2016 ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టుకు ఆకాశ్ గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు. -
ప్రపంచ హాకీ టోర్నీల్లో రాణిస్తాం
సాక్షి, తిరుమల: తిరుమలేశుని ఆశీస్సులు, సహచర క్రీడాకారుల ప్రతిభతో ఆసియా హాకీ కప్ గెలిచామని భారత జట్టు గోల్‌కీపర్ ఇతిమరపు రజని ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రపంచ స్థాయి హాకీ టోర్నీల్లో మరింత క్రీడాస్ఫూర్తితో రాణించి, మరిన్ని విజయాలు అందిస్తామన్నారు. ఆమెకు టీటీడీ జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు ప్రత్యేక దర్శనం కల్పించారు. -
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో విషాదం
జకార్తా: బంతి తగిలి క్రికెటర్లు ప్రాణాలు వదలడం ఇటీవలి కాలంలో తరచూ వింటున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఇలాంటి విషాద సంఘటన ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఆదివారం జకార్తాలో చోటుచేసుకుంది. గోల్ పోస్టు ముందు బంతిని ఆపే ప్రయత్నంలో వెటరన్ గోల్‌కీపర్ చొయిరుల్ హుడా సహచర ఆటగాడిని బలంగా ఢీకొని ప్రాణాలు వదిలాడు. 38 ఏళ్ల హుడా ఈస్ట్ జావాకు చెందిన పెర్సెలా క్లబ్ తరఫున 1999 నుంచి ఆడుతున్నాడు. సెమెన్ పడాంగ్తో మ్యాచ్‌లో ప్రథమార్ధం మరో నిమిషంలో ముగుస్తుందనగా గోల్ కాకుండా బంతిని ఆపేందుకు బాక్స్ నుంచి బయటికి వచ్చిన క్రమంలో తమ జట్టు సభ్యుడు మిడ్‌ఫీల్డర్ రోడ్రిగ్స్‌ను గట్టిగా ఢీకొన్నాడు. ఈ సమయంలో రోడ్రిగ్స్ కాళ్లు అతడి ఛాతీకి గట్టిగా తాకడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. -
సినిమా రివ్యూ: ఎంఎస్ ధోనీ
కొత్త సినిమా గురూ! ఒక టికెట్ ఇస్తారా ప్లీజ్... లక్ష్యం నిన్ను ఎంచుకుంటుంది. నువ్వు చేయాల్సిందల్లా లక్ష్యాన్ని ఎంచుకోవడమే. ధోనికి అసలు క్రికెట్ అంటే పెద్ద ఇష్టం లేదు. రాంచీ స్కూల్లో ఫుట్‌బాల్ ఆటలో ఆసక్తి కలిగి ఉంటాడు. గోల్ కీపర్‌గా మంచి చలాకీ. కాని ఆ స్కూల్ క్రికెట్ టీమ్‌లో వికెట్ కీపర్ లేకపోవడంతో స్కూల్ స్పోర్ట్స్ టీచర్ కన్ను ధోని మీద పడుతుంది. ‘క్రికెట్ ఆడతాడేమో కనుక్కో’ అని కబురు చేస్తే ‘పెద్ద బాల్ని వదిలేసి చిన్నబాల్తో ఆడతారా ఎవరైనా?’ అని జవాబు చెప్తాడు. కాని లక్ష్యం అతని కోసం కాచుకుని ఉంది. అది పదే పదే అతడి వెంట పడింది. చివరకు ధోని ఫుట్బాల్ని వదిలి క్రికెట్లోకి వస్తాడు. చేతికి గ్లవ్స్... దూసుకొచ్చే బాల్‌ను ఒడిసి పట్టడం డ్యూటీ. ‘సార్... నాకు బ్యాటింగ్ అంటే ఇష్టం’ అని టీచర్‌కు చెప్తే ‘నీ ముఖం... కీపింగ్ చెయ్’ అని చెప్తాడు. సంతలో దేవుని పటాలన్నింటి మధ్య సచిన్ పోస్టర్ ఉంటే కొనుక్కున్న కొడుకును చూసి తండ్రికి దిగులు. వీడు బాగా చదువుతాడా... చదువులో పాస్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటాడా అని. తల్లికి మాత్రం తెలుసు- వాడికి ఆనందం ఆటల్లోనే అని. ధోని లోకల్ గల్లీలలో హీరో అవుతాడు. బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లో నిలబడితే కొడుతూనే ఉంటాడు. చివరకు స్కూళ్లకు సెలవులిచ్చి జనమంతా వచ్చి నిలుచునేంత క్రేజ్. కాని చిన్న ఊరి కుర్రవాడు. మధ్యతరగతి కుటుంబం. బతుకు భయం. ఎదగాలంటే ఎన్నో అడ్డంకులు. రైల్వే అధికారి ఒకరు అతడి ప్రతిభను గుర్తించి రైల్వేలో టిసి ఉద్యోగం ఇచ్చి రైల్వే క్రికెట్ టీమ్‌లో ఎంపిక చేసుకుంటాడు. నెలకు ఐదు వేల జీతం. ఖాళీ ఉన్నప్పుడల్లా క్రికెట్ ప్రాక్టీస్. డౌన్ వచ్చే రైలు... అప్ వెళ్లే రైలు... మధ్యలో టికెట్ కలెక్షన్... లేని వాళ్లకు ఫైన్ వేయడం... రోజులు గడుస్తున్నాయి. కొంత ఏమరపాటుకు లోనైతే ఇక్కడే ఫినిష్ అయిపోయే అవకాశం ఉంది. ఏం చేయాలి? ఇలాంటి సందర్భం ప్రతి మనిషి జీవితంలోనూ వస్తుంది. ఉండాలా... వదిలేసి వెళ్లాలా... అందరి దగ్గరా టికెట్ కలెక్ట్ చేసే మనిషి తన లక్ష్యం కోసం తెగింపు అనే టికెట్‌ను కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చివరకు ధోని నిర్ణయం తీసుకుంటాడు. రైలుకు టాటా. డియర్ క్రికెట్... అయామ్ కమింగ్. ప్రతిభ నగరాల్లో మాత్రమే ఉండదు. చిన్న చిన్న పట్టణాల్లో కూడా గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉంటారు. దాల్మియా హయాంలో బి.సి.సి.ఐ చిన్న ఊళ్లలో ఉన్న టాలెంట్‌ను వెతికి పట్టే కార్యక్రమం తీసుకోవడం ధోనికి లాభిస్తుంది. ఒక దేశవాళీ ట్రోఫీ క్రికెట్‌తో ధోని ఎక్కడైతే సెలెక్టర్లు కూచున్నారో వాళ్ల నెత్తిన పడేలా సిక్సర్లను బాదుతాడు. అక్కడి నుంచి హైదరాబాద్ ఏ టీమ్, ఆ తర్వాత భారత జట్టు, ఆ తర్వాత వరుస విజయాల వరుస... ఆ తర్వాత చెరపలేని ఒక చరిత్ర స్థాపన. ఎంఎస్ ధోని సినిమా 2011 వరల్డ్ కప్ ఫైనల్స్‌తో మొదలయ్యి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి తిరిగి ఫైనల్స్‌తో ముగుస్తుంది. మూడు ముఖ్యమైన వికెట్లను పోగొట్టుకుని జట్టు ఒత్తిడిలో ఉన్న తరుణాన ఒక కెప్టెన్‌గా కసి ఉన్న ఆటగాడిగా దేశానికి వచ్చిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడవరాదనే సంకల్పంతో చేతులకు గ్లవ్స్ బిగించుకుంటూ ధోని క్రీజ్‌లోకి దిగి బ్యాట్‌తో బంతి మాడు పగిలేలా మోదడం, యువరాజ్ సింగ్‌తో కలిసి జట్టును విజయం వైపు నడిపించడం... చివరి బాల్‌ను బౌండరీ లైన్ ఆవలికి తరలించడం... ఇటీవలి జ్ఞాపకంగా మన కళ్ల ముందు కదలాడినా మళ్లీ ఆ క్షణాలు ఉజ్జీవనమై ఉద్వేగం కలుగుతుంది. ఛాతీ ఉప్పొంగుతుంది. 28 ఏళ్ల తర్వాత భారత్‌కు ప్రపంచం కప్‌ను సాధించి పెట్టిన ఈ కుర్రవాడు ఒక చిన్న ఊళ్లో... ఒక దిగువ శ్రేణి ప్రభుత్వ క్వార్టర్ల నుంచి పుట్టుకొచ్చాడని తెలియడం ఎవరికైనా స్ఫూర్తి... తమ లక్ష్యాన్ని ఎంచుకోవడానికి అవసరమయ్యే ఉత్సాహాన్ని ఇస్తుంది. మహేంద్ర సింగ్ ధోనిగా ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్పుట్ నటించాడు. అతడికి ఇది జీవిత కాలపు అవకాశం. దానిని అతడు నిలబెట్టుకున్నాడు. ఇక మీదట ధోని, సుశాంత్ అవిభాజ్యం. గత స్పోర్ట్స్ బయోపిక్‌ల వలే కాకుండా ఈ సినిమా అంతా రియల్ ఫుటేజ్ వాడారు. అందులో ధోనికి బదులుగా సుశాంత్‌ను గ్రాఫిక్స్‌తో మార్పిడి చేశారు. కాని గ్రాఫిక్స్ ఉన్నతశ్రేణిలో ఉండటం వల్ల ఎఫెక్ట్ అద్భుతంగా వచ్చింది. అలాగే స్కూల్ ప్లేయర్‌గా సుశాంత్ ముఖాన్ని ఆ వయసు కుర్రాడికి గ్రాఫిక్స్‌తో అమర్చి చాలా మంచి అనుభూతిని రాబట్టగలిగారు. తర్వాతి కాలంలో జట్టులో హోరాహోరీగా పేరు తెచ్చుకున్న యువరాజ్ సింగ్, ధోనిలు రంజి స్థాయిలో పోటీ పడటం ఈ సినిమాలో చూడటం చాలా ముచ్చటగా ఉంటుంది. ముఖ్యంగా 84 పరుగులు కొట్టి ఔట్ అయిన ధోని టీమ్‌ని పంజాబ్ టీమ్ తరఫున బ్యాటింగ్‌లో దిగిన యువరాజ్ సింగ్ ఉతికి ఆరేయడం ఆ విషయాన్ని ధోని చాలా మురిపెంగా చెప్పడం చాలా బాగుంటుంది. ముఖ్యంగా యువరాజ్‌లా వేసిన కుర్రాడు యువరాజ్లాగే కనిపిస్తూ చాలా బాగా చేశాడు. ధోని తను కెప్టెన్ అయ్యాక ఎవరి హయాంలో అయితే తాను పైకి వచ్చాడో ఆ ప్లేయర్స్ (నేరుగా పేర్లు చెప్పరు... కాని మనకు తెలుసు వాళ్లు... రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, గౌతమ్ గంభీర్)ను పక్కన పెట్టడంలో కఠినంగా వ్యవహరించడం అది విమర్శలకు దారి తీయడం చూచాయగా కనిపిస్తుంది. ‘నాకు ఆటగాళ్లు కాదు కావలసింది... విజయం కోసం ఆకలిగొన్న వ్యక్తిత్వాలు’ అని ధోని సెలక్టర్లతో చెప్తాడు. ‘నాకు స్వతంత్రం ఇస్తే తప్ప భారత్‌ను ప్రపంచ కప్ కోసం సిద్ధం చేయలేను’ అని ధోని కుండ బద్దలు కొడతాడు. అతడి నిర్ణయం సబబే అని చరిత్ర నిరూపించింది. ‘వెన్స్ డే’, ‘బేబీ’ వంటి మంచి సినిమాలు తీసిన దర్శకుడు నీరజ్ పాండే ఈ సినిమాను కంగారు లేకుండా మోసకారి తనంతో కాకుండా నిజాయితీగా తీసే ప్రయత్నం చేశాడు. మూడు గంటల నిడివితో తీరిగ్గా చెప్తాడు. ఫస్ట్ హాఫ్ మనం మైమరపుతో చూస్తాం. సెకండ్ హాఫ్‌లో డ్రమెటిక్‌గా పైకి లేచే కథనం కథలోనే లేకపోవడం వల్ల కొంచెం నిరాసక్తంగా అనిపించినా నటీనటుల ప్రతిభ, దర్శకుడి ప్రావీణ్యం సినిమాను గట్టెక్కించేస్తాయి. ముఖ్యంగా ఇవాళ మన ఎదుట హీరోలుగా నిలిచిన వ్యక్తులు అలా ఉత్త పుణ్యానికి హీరోలు అయిపోరనీ దాని వెనుక ఎంతో కఠోరమైన పరిశ్రమ ఉంటుందనీ ఎవరైనా ఏ రంగంలో అయినా పైకి రావాలంటే అటువంటి పరిశ్రమ అవసరమని ఈ సినిమా ఈనాటి యువతకు బడి పిల్లలకు చెబుతుంది. దుర్వ్యసనాల జోలికి పోకుండా లక్ష్య శుద్ధికి కట్టుబడి ఉండాలని కూడా ఈ సినిమా చాలా బలంగా చెప్తుంది. స్మోకింగ్ అయితే అసలు కనిపించలేదు. ధోనిని కుటుంబం మొత్తం చూడొచ్చు. ముఖ్యంగా పిల్లలకు చూపించవచ్చు. తల్లిదండ్రులకు పిల్లలను ఏ ట్రైన్ ఎక్కించాలో తెలుస్తుంది. పిల్లలకు ఏ ట్రైన్‌ను వదిలిపెట్టాలో తెలుస్తుంది. గుడ్ ఎటెంప్ట్. పదికి ఎనిమిది మార్కులు. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మహిళా గోల్ కీపర్‌పై నిషేధం!
యూఎస్: రియో ఒలింపిక్స్ సందర్భంగా స్వీడన్ సాకర్ జట్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా జాతీయ మహిళా ఫుట్ బాల్ జట్టు గోల్ కీపర్ హోప్ సోలోపైనిషేధం పడింది. ఈ మేరకు సోలోపై ఆరు నెలల నిషేధం విధిస్తున్నట్లు అమెరికా సాకర్ అధ్యక్షుడు సునీల్ గులాటి స్పష్టం చేశారు. క్వార్టర్ ఫైనల్లో అమెరికా ఓటమి పాలైన అనంతరం స్వీడన్ 'పిరికిపందల జట్టు' అంటు సోలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అమెరికా సాకర్ యాజమాన్యం... ఒక జట్టుపై అలా వ్యాఖ్యానించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. దీనిలో భాగంగానే ఆమెపై చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. పెనాల్టీ షూటౌట్ లో స్వీడన్ 4-3 తేడాతో అమెరికాను ఓడించి సెమీ ఫైనల్ దూసుకెళ్లింది. దీంతో ఒలింపిక్స్‌లో వరుసగా నాల్గోసారి సెమీ ఫైనల్ చేరాలనుకున్న అమెరికా ఆశలకు కళ్లెం పడింది. -
ఢిల్లీ డైనమోస్ కు స్పానిష్ గోల్ కీపర్
అక్టోబర్ 2న ప్రారంభం కానున్న రెండో సీజన్ కోసం ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ఫ్రాంచైజీ ఢిల్లీ డైనమోస్ ఎఫ్ సీ స్పానిష్ గోల్ కీపర్ టోనీ బోడ్లాస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. టోనీ రియల్ బెటీస్ తరఫున 95 మ్యాచ్ లు ఆడాడని... అతని రాక టీమ్ కు ఎంతో ఉపయోగపడుతుందని ఫ్రాంచైజీ అభిప్రాయపడింది. ఢిల్లీ డైనమోస్ తో ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని టోనీ తెలిపాడు. ఈ సీజన్ లో తన టీమ్ టైటిట్ గెలిచేందుకు కృషి చేస్తానని అన్నాడు. -
నీళ్లు తాగుతూ గోల్ వదిలేశాడు
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ప్రతీ క్షణం కీలకమైనది. గోల్ కీపర్ ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించకతప్పదు. అలాంటిది ఆట మధ్యలో గోల్ కీపర్ ఏకంగా నెట్‌ను విడిచి పక్కన నించుని తాపీగా నీళ్లు తాగుతున్నాడు. ఇంకేముంది ప్రత్యర్థి జట్టు మిడ్‌ఫీల్డర్ బంతిని నేరుగా గోల్‌పోస్టులోకి పంపాడు. గోల్ కీపర్ దాహార్తికి మ్యాచ్ విజయావకాశాలను చేజార్చుకున్నారు. చైనా సూపర్ లీగ్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. గోల్ కీపర్ కు 5 లక్షల రూపాయల జరిమానా విధించి సస్పెండ్ చేశారు. చోంగ్గింగ్ లిఫాన్, లియోనింగ్ జట్ల ఫుట్‌బాల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. మ్యాచ్ మరో 7 నిమిషాలకు మ్యాచ్ ముగుస్తుందనగా, లిఫాన్ 1-0 ఆధిక్యంలో ఉంది. కాసేపు ప్రత్యర్థి జట్టును నిలువరించి ఉంటే విజయం వరించేదే. కాగా ఆ సమయంలో లియోనింగ్కు ఫ్రీ కిక్ అవకాశం వచ్చింది. లియోనింగ్ మిడ్‌ఫీల్డర్ డింగ్ హైఫెంగ్ బంతిని గోల్ పోస్టు వైపు పంపాడు. అప్పుడు ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. లిఫాన్ గోల్ కీపర్ సూ వీజీ దాహం తట్టుకోలేక నెట్స్ పక్కన నీళ్లు తాగుతున్నాడు. దీంతో బంతిని ఆపే ప్రయత్నం చేయలేకపో్యాడు. బంతి నేరుగా నెట్స్‌లోకి వెళ్లడం, అక్కడ గోల్ కీపర్ లేకపోయేసరికి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఆశ్చర్యపోగా, లిఫాన్ ఆటగాళ్లు షాక్ తిన్నారు. మ్యాచ్ 1-1తో సమమైంది. గోల్ కీపర్ చేసిన తప్పిదానికి లిఫాన్ విజయావకాశాలను చేజేతులా జారవిడుచుకుంది. గోల్ కీపర్ నిర్లక్ష్యాన్ని జట్టు యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. సూ వీజీకి 5 లక్షల రూపాయల జరిమానా విధించి సస్పెండ్ చేశారు. ఘోరమైన తప్పిదాన్ని చేశానని, ఇలాంటి తప్పును ఇకమీదట చేయబోనని, ఆట మధ్యలో ఏకాగ్రత కోల్పోనని సూ వీజీ చెంపలేసుకున్నాడు. -
పక్కా వ్యూహంతో లాభాల గోల్స్
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికులను నెల రోజుల పాటు అలరించిన ప్రపంచ కప్ తుది దశకి చేరుకుంది. ఈ నెల రోజుల్లోనూ దాదాపు ప్రతి జట్టూ పోటీలో నిల్చేందుకు.. కప్ దక్కించుకునేందుకు హోరాహోరీగా పోరాడినా కొన్ని సార్లు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రారంభంలోనే డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ నిష్ర్కమించగా.. వరల్డ్ కప్‌కి ఆతిథ్యమిస్తున్న బ్రెజిల్‌పై సెమీ ఫైన ల్స్‌లో జర్మనీ ఘనంగా గెలిచింది. ఇలాంటి పరిణామాలకు ఆయా టీమ్స్ వ్యూహాలే కారణం. ఎందుకంటే.. మ్యాచ్ జరిగే గంటన్నర సమయంలో సత్తా చాటాలి. గోల్స్ చేయాలి. ప్రత్యర్థిపై గెలుపొందాలి. పటిష్టమైన వ్యూహాలతోనే ఇదంతా సాధ్యపడుతుంది. అలాగే పొదుపు.. పెట్టుబడులైనా పక్కా ప్రణాళిక ఉంటేనే, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటూ దూసుకెడితేనే లక్ష్యాలను (గోల్స్) సాధించగలిగేది. ఇందుకోసం ఫుట్‌బాల్ నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. అలాంటివే కొన్ని... ఫుట్‌బాల్ టీమ్‌లో ఉండే 11 మంది ఆటగాళ్లు ఒక్కొక్కరూ ఒక్కొక్క పాత్ర పోషిస్తుంటారు. ప్రత్యర్థి గోల్పోస్ట్పైకి దూసుకెళ్లే బాధ్యత కొందరిదైతే.. వారికి సహాయం అందించే బాధ్యత మరికొందరిది. గోల్‌పోస్ట్‌ను కాపాడుకునే బాధ్యత గోల్కీపర్ది. విజయ సాధనలో వీరందరూ కీలకమే. ఇలా ప్రత్యేకమైన కూర్పుతో.. ప్రత్యర్థి జట్టుపై గెలుపు సాధించేందుకు ఒక్కొక్క టీమ్ ఒక్కొక్క వ్యూహం ప్రకారం ముందుకెడుతుంది. కొన్నిసార్లు దూకుడుగాను.. మరికొన్ని సార్లు రక్షణాత్మకంగాను ఆడుతూ పరిస్థితికి తగ్గట్లు వ్యూహం మార్చుకుంటూ ఉంటుంది. ఆర్థిక ప్రణాళిక సాధన కూడా ఇలాంటిదే. ఫుట్‌బాల్ టీమ్‌లో రకరకాల ప్లేయర్స్ ఉన్నట్లుగానే మన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో కూర్పులో కూడా వైవిధ్యం ఉండాలి. పెట్టుబడులకు సంబంధించి ఫిక్సిడ్ డిపాజిట్లనీ, షేర్లనీ, రియల్ ఎస్టేట్ అనీ వివిధ రకాల సాధనాలు ఉన్నాయి. వీటిలో ఎఫ్డీల్లాంటివి రక్షణాత్మకమైనవి కాగా షేర్లులాంటివి కాస్త రిస్కీ సాధనాలు. లక్ష్యాలను సాధించడంలో ఇవన్నీ కూడా కీలకపాత్ర పోషిస్తాయి. దేనికదే ప్రత్యేకం. అలాగని పోర్ట్‌ఫోలియోను మరీ షేర్లతో నింపేసినా.. లేదా పూర్తిగా ఎఫ్‌డీలపైనే ఆధారపడినా ఆశించిన ఫలితాలను దక్కించుకోలేం. కాబట్టి..ఫుట్‌బాల్ టీమ్లాగానే పోర్ట్‌ఫోలియో కూర్పు ముఖ్యం. ఎంత మేర రిస్కు భరించగలం అన్నదాని ఆధారంగా ఏయే సాధనాల్లో ఎంతెంత ఇన్వెస్ట్ చేయడం అన్నది ఆధారపడి ఉంటుంది. సమయం కీలకం.. ఫుట్‌బాల్ మ్యాచ్ గంటన్నరలో అయిపోతుంది. ఆ గంటన్నరలో ఫలితం తేలకపోతే.. మరికాస్త సమయం మాత్రమే ఉంటుంది. మొత్తం వరల్డ్ కప్ టోర్నమెంటు ఒక నెలరోజుల్లో ముగిసిపోతుంది. కానీ, ఈ టోర్నమెంటు కోసం టీమ్స్ ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేస్తాయి. ఎన్నెన్నో వ్యూహాలు రూపొందించుకుంటాయి. పెట్టుబడుల తీరు కూడా ఇలాంటిదే. ఉన్న కాస్త సమయంలోనూ రిటైర్మెంట్ వంటి అవసరాలకు కావాల్సిన డబ్బు సమకూర్చుకోవాలంటే దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. ధరల పెరుగుదలను మించి సంపదను వృద్ధి చేసే పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాలి. ఇందుకోసం పోర్ట్‌ఫోలియోలో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటికి కొంతైనా చోటు కల్పించాలన్నది నిపుణుల సూచన. అయితే, ఎవరో చెప్పారని గుడ్డిగా పోకుండా వాటి గురించి క్షుణ్నంగా తెలుసుకునేందుకు కాస్తంత కసరత్తు చేస్తేనే సత్ఫలితాలు ఉంటాయి. అనుకోని పరిస్థితులకు సంసిద్ధంగా.. ఎంత కసరత్తు చేసి, ఎంతగా సిద్ధం అయినా.. కొన్ని సార్లు ఊహించని పరిస్థితులు ఎదురవుతుంటాయి. వాటికి తగ ్గట్లుగా అప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. కోస్టారికా జట్టుతో జరిగిన పోటీలో నెదర్లాండ్స్ కోచ్ చేసినదిదే. నిర్ణీత సమయంలో ఫలితం రాకపోవడంతో పెనాల్టీ షూటవుట్ తప్పనిసరైంది. ప్రత్యర్థి దాడుల నుంచి గోల్‌పోస్ట్‌ను రక్షించుకునే క్రమంలో ప్రధాన గోల్‌కీపర్‌ని పక్కనపెట్టి రెండో గోల్‌కీపర్ క్రూల్‌ను రంగంలోకి దింపాడు నెదర్లాండ్స్ కోచ్. ప్రధాన గోల్‌కీపర్ కన్నా క్రూల్ ఎత్తు రెండంగుళాలు ఎక్కువ ఉండటమే ఇందుకు కారణం. ఇదే మ్యాచ్‌లో టర్నింగ్‌పాయింట్ అయింది. ఏకంగా 2 గోల్స్‌ని ఆపి నెదర్లాండ్స్‌ను సెమీఫైనల్స్‌కి చేర్చడంలో క్రూల్ కీలకపాత్ర పోషించాడు. పెట్టుబడుల తీరూ అప్పుడప్పుడు ఇలాగే ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన చేతిలో లేని అంశాల కారణంగా కొన్ని సార్లు ఎదురుదెబ్బలు తగలొచ్చు. కాబట్టి, ఎప్పుడైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అప్పటిదాకా అమలు చేసిన ప్రణాళికను సవరించుకుని, కొత్త వ్యూహం అమలు చేయగలిగేలా సంసిద్ధంగా ఉండాలి. పోర్ట్‌ఫోలియోలు ఇలా.. ఫుట్‌బాల్ టీమ్‌లో స్ట్రైకర్స్, మిడ్ఫీల్డర్స్, డిఫెండర్స్ అని ప్లేయర్స్ ఉంటారు. టీమ్‌లు ఎటాకింగ్ అనీ డిఫెండింగ్ అనీ రకరకాల వ్యూహాలు పాటిస్తుంటాయి. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోకి దీన్ని అన్వయించుకుంటే.. యుక్తవయస్సులో వారికి ఒకలాగా .. మధ్యవయస్కులకు ఒకలాగా .. రిటైర్మెంట్కి దగ్గర్లో ఉన్న వారికి ఒకలాగా ఉంటుంది. వయస్సు, ఎంత రిస్కు తీసుకోగలం అన్న దాన్ని బట్టి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో ఆధారపడి ఉంటుంది. యుక్తవయస్సులో ఉన్న వారు కాస్తంత ఎక్కువ రిస్కు తీసుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు. ఒకవేళ ఏదైనా నష్టం వచ్చినా, మళ్లీ తేరుకుని నిలదొక్కుకునేందుకు వారికి సమయం ఉంటుంది. కాబట్టి యుక్తవయస్సులో ఉన్నవారు.. ఎటాకింగ్ ధోరణిలో తమ పోర్ట్‌ఫోలియోలో సింహభాగం షేర్లు, ఫండ్స్ లాంటి వాటికి కేటాయించవచ్చు. వాటికి ఊతంగా ఉండేందుకు కొంత మొత్తాన్ని సురక్షితమైన సాధనాలకు కేటాయించవచ్చు. అదే మధ్యవయస్కులూ.. మరీ ఎక్కువ రిస్కు తీసుకోవడానికి ఇష్టపడని వారూ పోర్ట్‌ఫోలియో సమతూకంగా ఉండేలా చూసుకోవచ్చు. షేర్లూ, బాండ్లూ, ప్రావిడెంట్ ఫండ్ లాంటివాటికి తలా కాస్త నిధులు కేటాయించవచ్చు. ఇక రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వారు, రిస్కును అస్సలు ఇష్టపడని వారు సురక్షితమైన సాధనాలకు మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చుకోవచ్చు. దీని వల్ల పెట్టుబడులకు పెద్దగా నష్టం ఉండదు. అలాగని భారీ రాబడులూ ఉండవు.