
జకార్తా: బంతి తగిలి క్రికెటర్లు ప్రాణాలు వదలడం ఇటీవలి కాలంలో తరచూ వింటున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఇలాంటి విషాద సంఘటన ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఆదివారం జకార్తాలో చోటుచేసుకుంది. గోల్ పోస్టు ముందు బంతిని ఆపే ప్రయత్నంలో వెటరన్ గోల్‌కీపర్ చొయిరుల్ హుడా సహచర ఆటగాడిని బలంగా ఢీకొని ప్రాణాలు వదిలాడు. 38 ఏళ్ల హుడా ఈస్ట్ జావాకు చెందిన పెర్సెలా క్లబ్ తరఫున 1999 నుంచి ఆడుతున్నాడు.
సెమెన్ పడాంగ్‌తో మ్యాచ్‌లో ప్రథమార్ధం మరో నిమిషంలో ముగుస్తుందనగా గోల్ కాకుండా బంతిని ఆపేందుకు బాక్స్ నుంచి బయటికి వచ్చిన క్రమంలో తమ జట్టు సభ్యుడు మిడ్‌ఫీల్డర్ రోడ్రిగ్స్‌ను గట్టిగా ఢీకొన్నాడు. ఈ సమయంలో రోడ్రిగ్స్ కాళ్లు అతడి ఛాతీకి గట్టిగా తాకడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment