ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సస్పెండెడ్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం అమరేందర్‌సింగ్ సతీమణి ప్రణీత్ కౌర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. పంజాబ్‌లోని పటియాలా కాంగ్రెస్ ఎంపీ అయిన ప్రణీత్ కౌర్ గతేడాది సస్పెన్షన్‌కు గురయ్యారు. ప్రణీత్ కౌర్.. తాజాగా గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఆమె పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జాఖర్, ఇతర బీజేపీ సీనియర్ నాయకుల సమాక్షంలో కమలం పార్టీలో చేశారు.
బీజేపీలో చేరిన తర్వాత ప్రణీత్ కౌర్ మీడియాతో మాట్లాడారు. ‘నరేంద్రమోదీ నాయకత్వంలో నా నియోజకవర్గం, రాష్ట్రం, దేశంలోని ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. గతంలో ఏం జరిగిందో నాకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో నా ఇన్నింగ్స్ బాగా ఉండేది. ఇప్పడు బీజేపీలో కూడా నా ఇన్నింగ్స్ బాగుంటుందని ఆశిస్తున్నా’అని పేర్కొన్నారు. తాను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానా? లేదా? అనే విషయాన్ని బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు.
#WATCH | Preneet Kaur, suspended Congress MP and wife of former Punjab CM Amarinder Singh, joins BJP in Delhi, today pic.twitter.com/YziHMsHDez
— ANI (@ANI) March 14, 2024
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు 2023లో కాంగ్రెస్ పార్టీ ప్రణీత్ కౌర్‌ను సస్పెండ్ చేసింది. ఇక.. ప్రణీత్ కౌర్ భర్త కెప్టెన్ అమరేందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పంజాబ్‌కు రెండుసార్లు సీఎంగా పని చేసిన విషయం తెలిసిందే. 2021లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అమరేందర్ సింగ్ సొంతగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ) అనే పార్టీ స్థాపించారు. అనంతరం 2022 సెప్టెంబర్ తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఇక.. అమరేందర్ సింగ్ కూతురు జై ఇందర్ కౌర్ కూడా బీజేపీలోనే ఉన్నారు. అయితే బీజేపీ తరఫున పటియాలా పార్లమెంట్ స్థానం నుంచి జై ఇందర్ కౌర్ బరిలోకి దిగుతారని ఊహాగానాలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment