Preneet Kaur
-
బీజేపీలో చేరిన మాజీ సీఎం భార్య
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సస్పెండెడ్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం అమరేందర్‌సింగ్ సతీమణి ప్రణీత్ కౌర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. పంజాబ్‌లోని పటియాలా కాంగ్రెస్ ఎంపీ అయిన ప్రణీత్ కౌర్ గతేడాది సస్పెన్షన్‌కు గురయ్యారు. ప్రణీత్ కౌర్.. తాజాగా గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఆమె పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జాఖర్, ఇతర బీజేపీ సీనియర్ నాయకుల సమాక్షంలో కమలం పార్టీలో చేశారు. బీజేపీలో చేరిన తర్వాత ప్రణీత్ కౌర్ మీడియాతో మాట్లాడారు. ‘నరేంద్రమోదీ నాయకత్వంలో నా నియోజకవర్గం, రాష్ట్రం, దేశంలోని ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. గతంలో ఏం జరిగిందో నాకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో నా ఇన్నింగ్స్ బాగా ఉండేది. ఇప్పడు బీజేపీలో కూడా నా ఇన్నింగ్స్ బాగుంటుందని ఆశిస్తున్నా’అని పేర్కొన్నారు. తాను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానా? లేదా? అనే విషయాన్ని బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. #WATCH | Preneet Kaur, suspended Congress MP and wife of former Punjab CM Amarinder Singh, joins BJP in Delhi, today pic.twitter.com/YziHMsHDez — ANI (@ANI) March 14, 2024 పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు 2023లో కాంగ్రెస్ పార్టీ ప్రణీత్ కౌర్‌ను సస్పెండ్ చేసింది. ఇక.. ప్రణీత్ కౌర్ భర్త కెప్టెన్ అమరేందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పంజాబ్‌కు రెండుసార్లు సీఎంగా పని చేసిన విషయం తెలిసిందే. 2021లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అమరేందర్ సింగ్ సొంతగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) అనే పార్టీ స్థాపించారు. అనంతరం 2022 సెప్టెంబర్ తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఇక.. అమరేందర్ సింగ్ కూతురు జై ఇందర్ కౌర్ కూడా బీజేపీలోనే ఉన్నారు. అయితే బీజేపీ తరఫున పటియాలా పార్లమెంట్ స్థానం నుంచి జై ఇందర్ కౌర్ బరిలోకి దిగుతారని ఊహాగానాలు వస్తున్నాయి. -
కెప్టెన్ అమరీందర్ సింగ్ సతీమణికి కాంగ్రెస్ షాక్..
న్యూఢిల్లీ: పంజాబ్ పాటియాల నియోజకవర్గం ఎంపీ, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సతీమణి పర్నీత్ కౌర్‌ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పర్నీత్ కౌర్‌పై పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుందని కాంగ్రెస్ తెలిపింది. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ బీజేపీకీ ప్రయోజనం చేకూర్చుతున్నారని తరచూ ఫిర్యాదులు వస్తున్నందునే ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు చెప్పింది. పర్నీత్ కౌర్ భర్త కెప్టెన్ అమరీందర్ సింగ్ 2021లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. దీంతో ఎన్నికల అనంతరం పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం కమలం పార్టీలోనే కొనసాగుతున్నారు. చదవండి: నేను లాయర్.. నా ఇష్టం.. లోకల్ ట్రైన్లో యువతి రుబాబు.. -
రూ. 23 లక్షలు పోగొట్టుకున్న సీఎం భార్య!
చండీగఢ్ : అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలు పెచ్చుమీరుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతీ ఒక్కరూ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్య, ఎంపీ ప్రణీత్ కౌర్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు. బ్యాంకు మేనేజర్ పేరిట వచ్చిన కాల్ కారణంగా 23 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. వివరాలు.. పార్లమెంటు సమావేశాలకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ ప్రణీత్ కౌర్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను బ్యాంకు మేనేజర్‌ను అని, ఎంపీ జీతం డిపాజిట్ చేసే అకౌంట్ అప్డేట్ కోసమే కాల్ చేసినట్లు చెప్పాడు. ఈ మేరకు అకౌంట్ నంబరు, ఏటీఎం పిన్ నంబరు, సీవీసీ నంబరు తదితర వివరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు. అతడి మాటలు నమ్మిన ప్రణీత్ కౌర్ వివరాలతో సహా ఓటీపీ కూడా చెప్పారు. ఈ క్రమంలో కొన్ని నిమిషాల తర్వాత ఆమె అకౌంట్ నుంచి 23 లక్షల రూపాయలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. తాను మోసపోయినట్లుగా గుర్తించిన ప్రణీత్ కౌర్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జార్ఖండ్‌కు చెందిన వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. అక్కడే అతడిని అరెస్టు చేసి పంజాబ్ తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. -
ఆ ముగ్గురు ఎవరు?
విదేశాల్లోని బ్యాంకుల్లో భారీగా నల్లధనం దాచుకున్న కొంతమంది కుబేరుల పేర్లను కేంద్ర సర్కారు వెల్లడించడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయయేనని భయపడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు వణుకుతున్నారు. హస్తం పార్టీకి చెందిన నేతలు పేర్లు ఉన్నాయని కేంద్రం సూచాయగా వెల్లడించడంతో కాంగీయులకు చెమటలు పడుతున్నాయి. యూపీఏ మంత్రి పేరు ఉందని తెలియడంతో వారికి పాలుపోవడం లేదు. సుప్రీంకోర్టుకు మోదీ సర్కారు సమర్పించిన అఫిడవిట్ లో తన పేరు లేనప్పటికీ కేంద్ర మాజీ మంత్రి ప్రణీత్ కౌర్ తనంతతానుగా బయటకు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. తనకు అసలు విదేశీ ఖాతాలే లేవని వెల్లడించారు. ఆదాయ పన్ను శాఖ నుంచి 2011లో తనకు వచ్చిన నోటీసుకు ఇదే సమాధానం ఇచ్చానని కూడా ఆమె తెలిపారు. ప్రణీత్ కౌర్ భర్త, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విదేశాల్లో నల్లధనం దాచారని ఎన్నికల ప్రచారంపై బీజేపీ, అకాలీదళ్ ఆరోపించాయి. కాగా, మరో ముగ్గురు కాంగ్రెస్ నాయకులు పేర్లు 'నల్ల' జాబితాలో ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. వీరిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ సభ్యుడు కాగా, మహారాష్ట్రలో ప్రముఖ రాజకీయ కుటుంబానికి ఇద్దరు ఉన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ ముగ్గురు ఎవరై ఉంటారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంచలనాల కోసం పాకులాడడం మానేసి పూర్తి వివరాలతో నల్లకుబేరులు పేర్లు బయటపెట్టాలని కాంగ్రెస్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. -
విదేశీ బ్యాంకు ఖాతాలు లేవు: ప్రణీత్ కౌర్
న్యూఢిల్లీ: విదేశాల్లో తనకు బ్యాంకు ఖాతాలు లేవని కేంద్ర మాజీ మంత్రి ప్రణీత్ కౌర్ స్పష్టం చేశారు. విదేశాల్లో నల్లధనం దాచారనే ఆరోపణలతో తనపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టిన నేపథ్యంలో ఆమె స్పందించారు. తన పేరుతో విదేశీ బ్యాంకు ఖాతా ఉన్నందుకు ఆదాయపన్ను తనకు నోటీసు పంపిందని ఆమె తెలిపారు. అయితే విదేశాల్లో తనకు ఎటువవంటి బ్యాంకు ఖాతాలు లేవని ఆమె తెలిపారు. తన పేరుతో విదేశీ బ్యాంకుల్లో ఎకౌంట్లు లేవని కూడా చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అమరీందర్ సింగ్ భార్య అయిన ప్రణీత్ కౌర్- మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో విదేశాంగ సహాయ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి నలుగురు బడా నాయకులకు స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రణీత్ కౌర్ పేరు ఇప్పటికే బయటకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ సభ్యుడు, మహారాష్ట్రలో ప్రముఖ రాజకీయ కుటుంబానికి ఇద్దరు ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. బ్లాక్‌మనీ లిస్టులో కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద తలకాయల పేర్లు ఉన్నాయని గతవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బ్లాక్ మనీ వ్యవహారంలో కాంగ్రెస్‌కు షాక్