
చండీగఢ్ : గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేయనున్న బాలీవుడ్ నటుడు, ఇటీవలే కాషాయ తీర్ధం పుచ్చుకున్న సన్నీ డియోల్‌పై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ విమర్శలు గుప్పించారు. సన్నీ డియోల్ కేవలం తెరపైనే సైనికుడిగా నటించారని, తాను నిజమైన సైనికుడినని కెప్టెన్ సింగ్ చెప్పుకొచ్చారు. సన్నీ డియోల్ రాకతో గురుదాస్‌పూర్‌లో తమ పార్టీ అభ్యర్ధి సునీల్ జక్కర్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో సన్నీ డియోల్‌కు ఎలాంటి పట్టూ లేదని, కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడి ప్రజల కోసం పనిచేశాడని అన్నారు.
సన్నీ డియోల్ తెరపైన సైనికుడు మాత్రమేనని 1997లో ఆయన నటించిన బోర్డర్ మూవీలోని సైనికుడి పాత్రను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను నిజమైన సైనికుడినని 1965 ఇండో-పాక్ యుద్ధంలో కెప్టెన్‌గా వ్యవహరించిన అమరీందర్ సింగ్ చెప్పుకున్నారు. సన్నీ డియోల్‌కు ఓటమి తప్పదని పంజాబ్‌లో అన్ని స్ధానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని, తదుపరి ప్రధానిగా రాహుల్ బాధ్యతలు చేపడతారని కెప్టెన్ సింగ్ జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment