
ఛండీఘర్: పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ తన మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, మాజీ పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ 22 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ఆదివారం ప్రకటించారు. మరో రెండు రోజుల్లో రెండో జాబితా కూడా ప్రకటిస్తామని పేర్కొన్నారు. మొదటి జాబితాలో తొమ్మిది మంది జాట్ సిక్కులు, నలుగురు ఎస్పీ, ముగ్గురు ఓబీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. అమరీందర్ సింగ్ పాటియాలా అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపివేయడంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ గత ఏడాది నవంబరులో కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీని స్థాపించారు. ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ)’గా తమ పార్టీకి నామకరణం చేసిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ కొత్త పార్టీ.. ఏమేరకు ప్రభావం చూపనుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment