
నిరసన కారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ ఫిరంగులతో..
చండీగఢ్: రాష్ట్రంలో మాదకద్రవ్యాలను అరికట్టడంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విఫలమయ్యారంటూ.. బీజేవైఎం కార్యకర్తలు సోమవారం పంజాబ్ సీఎం అధికార నివాస ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నిరసన కారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ ఫిరంగులను ఉపయోగించారు.
పంజాబ్‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాదక ద్రవ్యాలను అరికడతామని సీఎం అమరీందర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే డ్రగ్స్‌ను అరికట్టడంలో పంజాబ్ సీఎం విఫలమయ్యారని పంజాబ్ బీజేవైఎం చీఫ్ భాను ప్రతాప్ రానా ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాపారం వృద్ధి చెందిందని రానా పేర్కొన్నారు. దీనికి నిరసనగా రానా నేతృత్వంలోని ఆందోళనకారులు నిసరస చేపట్టారు.