BJYM Activists
-
YSRCP కార్యాలయంపై దాడి
-
‘వైఎస్సార్సీపీ ఆఫీస్‌పై దాడి యత్నం హేయం’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఆఫీస్‌పై దాడి యత్నం హేయమని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, దేవినేని అవినాష్, పోతిన మహేష్‌తో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. శ్రీవేంకటేశ్వరస్వామి సాక్షిగా చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని అంబటి మండిపడ్డారు. టీటీడీ లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న దానిపై, ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు, పురందేశ్వరి, లోకేష్, పవన్ కల్యాణ్‌తో పాటు, ఎల్లో మీడియా దారుణ ఆరోపణ చేస్తోందని ఆయన ఆక్షేపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి దృష్టి మళ్లించడం కోసమే టీడీపీ, బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని అంబటి అన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంపై భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తల దాడి యత్నాన్ని ఖండించిన మాజీ మంత్రి, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ ఘటనను ఖండించాలని కోరారు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు ఆరోపిస్తున్నారని.. దానికి ఆధారాలు ఏమున్నాయని నిలదీశారు. అందుకు వారు చూపిస్తున్న ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) రిపోర్టు గత జూలై 23న వచ్చిందన్న ఆయన, అప్పుడు సీఎంగా ఉన్నది చంద్రబాబే అని గుర్తు చేశారు. అదే రిపోర్టుకు సంబంధించి, ఆనాడు (జూలై 23న) మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈఓ, లడ్డూ తయారీ కోసం కాంట్రాక్ట్ సంస్థ పంపిన నెయ్యి నాణ్యత పరీక్షిస్తే.. అందులో వెజిటబుల్ ఆయిల్, వనస్పతి కలిపినట్లుగా తేలిందని, ఆ నెయ్యిని రిజెక్ట్ చేశామని, ఇంకా ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదీ చదవండి: వాస్తవాలు నిగ్గు తేల్చాలి.. ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖఆ తర్వాత ఈనెల 18న ఎన్డీఏ సమావేశంలో టీటీడీ లడ్డూపై చంద్రబాబు ఆరోపణల తర్వాత, 20వ తేదీన మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈఓ, మాట మార్చారని గుర్తు చేశారు. తాము ఎన్డీడీబీ ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్‌లో జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యి కలిపినట్లు అవశేషాలు ఉన్నట్లుగా, నివేదిక వచ్చిందని తెలిపారని ప్రస్తావించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీస్తూ, టీటీడీని, శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని చంద్రబాబు తన రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆక్షేపించారు. దీన్ని తీవ్రంగా ఖండించిన తమ పార్టీ నేత, కుటుంబంతో సహా స్వామి వారి చెంత కుటుంబ సమేతంగా ప్రమాణానికి సిద్ధమని సవాల్ చేస్తే, స్పందన లేదని అంబటి గుర్తు చేశారు. గుడ్డ కాల్చి మొహం మీద వేసి తుడుచుకోమంటున్నారని ఆక్షేపించారు.కూటమిలో భాగమైన బీజేపీకి సంబంధించిన విభాగం బీజేవైఎం, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి ప్రయత్నించిందన్న మాజీ మంత్రి, అది ఏదో ఒక విధంగా జగన్‌పై బురద జల్లాలనే కుట్రపూరితమైన ప్రయత్నం అని అభివర్ణించారు. అసలు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి టీటీడీ ప్రతిష్టను దిగజార్చాలనుకుంటున్నారా? లేక జగన్ ప్రతిష్టను దెబ్బ కొట్టాలనుకుంటున్నారా? అని అంబటి నిలదీశారు.‘దైవాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ పరువు మీద దాడికి ప్రయత్నిస్తే శ్రీ వెంకటేశ్వరస్వామివారు కూడా సహించరు. పురందేశ్వరి.. అమ్మా ఏంటిది?. వైఎస్ జగన్ పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఏవేవో విసిరి ఆనందపడాలనుకుంటున్నారా? విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తీసేస్తున్నారనే బాధతో ప్రజలు, కార్మికులు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఒక పార్ట్ అమ్మేశారు. ఉద్యోగులకు జీతాలు కట్ చేశారు. అక్కడ రగిలిపోతుంటే దాన్ని డైవర్ట్ చేయాలనే దురుద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం చాలా దురదృష్టకరం. ఇలాంటి వాటికి కచ్చితంగా సమాధానం ఉంటుందని అంబటి స్పష్టం చేశారు.టీటీడీ ఈఓగా శ్యామలరావును నియమించిన రోజునే, స్వామివారిని రాజకీయాల కోసం వాడుకునే ప్రయత్నం మొదలైందన్న మాజీ మంత్రి.. టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి టెస్ట్, ఎన్డీడీబీ రిపోర్ట్‌కు జగన్‌గారిని బాధ్యుడిని ఎలా చేస్తారని నిలదీశారు. అది చాలా అన్యాయం, అక్రమం, దుర్మార్గమన్న ఆయన.. ముగ్గురూ కలిసి తొండి ఆడుతున్నారని అభివర్ణించారు.గత జూలైలో కాంట్రాక్ట్ సంస్థ పంపిన నెయ్యి నాణ్యతపై అనుమానంతో పరీక్ష చేయించామని, ఆ తర్వాత నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపించామని స్వయంగా టీటీడీ ఈఓ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన అంబటి రాంబాబు.. లడ్డూ తయారీలో కల్తీ నూనె ఎక్కడ వాడారో పవన్‌కళ్యాణ్ చెప్పాలని స్పష్టం చేశారు.నెయ్యిలో నాణ్యత లేకపోతే, తిప్పి పంపించడం ఆనవాయితీ అని గుర్తు చేసిన మాజీ మంత్రి, 2019–24 మధ్య 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేసిన విషయాన్ని తెలిపారు. అలా టీడీపీ హయాంలోనూ 14 ట్యాంకర్లు వెనక్కు పంపారని, అయినప్పటికీ నిరాధార ఆరోపణలు, విమర్శలు చేస్తూ.. గుడ్డ కాల్చి మొహాన వేస్తున్నారని ఆక్షేపించారు. నిజంగా ఆధారాలు ఉంటే, ఇలా ఆరోపణలు చేయకుండా, వాటిని చూపాలని కోరారు. ఎంత మంది చెప్పినా అబద్ధం నిజమైపోదన్న అంబటి.. జగన్ హయాంలో ప్రసాదాల తయారీలో ఏ పొరపాటు, తప్పిదం జరగలేదని స్పష్టం చేశారు. అలా జరిగి ఉంటే, నిరూపించాలని సవాల్ చేశారు.రాష్ట్రంలో 40 శాతం ఓట్ షేర్ ఉన్న జగన్ ప్రజాదరణ తట్టుకోలేక నిత్యం ఆయనపై అసత్య ఆరోపణలు చేస్తూ నిందిస్తున్నారని, అందుకోసం చివరకు దేవుణ్ని కూడా వాడుకుంటున్నారని.. అయితే అవన్నీ శ్రీ వెంకటేశ్వరస్వామివారు చూస్తున్నారని, వారిని తప్పకుండా శిక్షిస్తారని చెప్పారు.పవన్‌కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షను ప్రస్తావించిన మాజీ మంత్రి, అసత్య ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునే చంద్రబాబు ఆ దీక్ష చేయాలని, పొరపాటు అయ్యింది కాబట్టి క్షమాపణ కూడా చెప్పి, సంప్రోక్షణ చేసుకోవాలని సూచించారు. భగవంతుడిని అడ్డు పెట్టుకుని నీచ రాజకీయాలు చేసే సంస్కృతి చంద్రబాబుది అని అంబటి రాంబాబు వివరించారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి యత్నం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తలు దాడికి యత్నించారు. రాళ్లు, రంగు డబ్బాలు విసిరిన బీజేవైఎం కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులపై దాడికి యత్నించారు. సెక్యూరిటీ సిబ్బంది గదిని బీజేవైఎం కార్యకర్తలు ధ్వంసం చేశారు.కాగా, చంద్రబాబు సర్కార్ వంద రోజుల వైఫల్యాలు, విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మకాలపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని కప్పి పుచ్చేందుకు కూటమి నేతలు డైవర్షన్ రాజకీయాలకు తెర తీస్తున్నారు. ఇదీ చదవండి: ‘ఏపీలో రౌడీ రాజ్యం.. పరాకాష్టకు కూటమి అరాచకాలు’ -
TGPSC వద్ద హైటెన్షన్
-
తీవ్ర ఉద్రిక్తత: టీఎస్‌పీఎస్సీలోకి చొచ్చుకెళ్లిన బీజేవైఎం కార్యకర్తలు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యాలయాన్ని బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించారు. వెంటనే టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ను సస్సెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలను అమ్ముకుంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విద్యార్థి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిన్ బోర్డును ధ్వంసం చేసిన బీజేవైఎం కార్యకర్తలు.. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. పేపర్ లీక్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: TSPSC: ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం.. ప్రవీణ్ ఫోన్లో మహిళల అసభ్య ఫోటోలు -
ప్రగతిభవన్ ముట్టడించిన బీజేవైఎం కార్యకర్తలు
-
అర్ధరాత్రి ఉద్రిక్తత.. బైక్‌పై వెంబడించి బీజేపీ నేతను చంపారు
కర్నాటకలో ఒక్కసారిగా ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. అధికార బీజేపీ పార్టీకి చెందిన నేత దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా అతడిని నరికి చంపారు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. దక్షిణ కన్నడ జిల్లాలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా యువనేత ప్రవీణ్ నెట్టారు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే, ప్రవీణ్ స్వస్థలం సుళ్య తాలుకా బెళ్లారపేటె కేరళ సరిహద్దుల్లో ఉంది. కాగా.. ప్రవీణ్ స్థానికంగా ఓ పౌల్ట్రీ షాప్‌ను నిర్వహిస్తోన్నారు. అయితే, మంగళవారం రాత్రి షాప్‌ను మూసివేసి, ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. ప్రవీణ్‌ను బైక్‌పై వెంటాడి మరీ నరికి చంపారు. #Karnataka: #BJPYuvaMorcha worker #PraveenNettaru hacked to death by bike-borne attackershttps://t.co/obftQ1YoHQ — India TV (@indiatvnews) July 27, 2022 అనంతరం.. రక్తపు మడుగులో పడివున్న అతడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రవీణ్‌ను పుత్తూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ ప్రవీణ్ మృతిచెందాడు. ఈ విషయం కాస్తా.. బీజేపీ నేతలు, యువమోర్చా నాయకులకు తెలియడంతో వారు భారీ సంఖ్యతో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి రోడ్డుపై కూర్చోని నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘటన కర్నాటకలో చర్చనీయాంశంగా మారింది. ప్రవీణ్ హత్యపై కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. యువ నాయకుడు దారుణహత్యకు గురికావడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. ప్రవీణ్ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. నిందితులను త్వరగా పట్టుకుంటామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ వేదికగా తెలిపారు. Karnataka: "We want justice" slogans raised by many BJP workers protesting against the killing of BJP Yuva Morcha worker Praveen Nettaru. (Visuals from Bellare & Puttur in Dakshina Kannada) 😡😡😡👇#justnow Source: ANI pic.twitter.com/vpsDsPMFfr — Naren Mukherjee 🇮🇳 (@narendra52) July 27, 2022 ఇది కూడా చదవండి: రూ.3వేల కోట్లు విద్యుత్తు బిల్లు.. షాక్‌తో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి! -
బెంగాల్లో రగడ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో మరో రాజకీయ రగడ రాజుకుంది. కోల్‌కతాలోని కాశిపూర్‌లో గురువారం జరిగిన బీజేవైఎం కార్యకర్త అర్జున్ చౌరాసియా హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డిమాండ్ చేశారు. బెంగాల్లో హింసాత్మక సంస్కృతిపెరిగిపోతోందని, ప్రజలు భయభ్రాంతులవుతున్నారని ఆరోపించారు. రెండురోజుల బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం అర్జున్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ మరణంపై కేంద్ర హోంశాఖ నివేదిక కోరుతుందని చెప్పారు. మృతదేహాన్ని అధికారులు బలవంతంగా తీసుకుపోయారని కుటుంబీకులు ఆరోపించారు. మరోవైపు అర్జున్ తమ పార్టీ కార్యకర్తేనని అధికార టీఎంసీ బదులిచ్చింది. అర్జున్ మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని, ప్రక్రియను వీడియో తీయాలని, అతని కుటుంబానికి భద్రత కల్పించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం తీసుకువెళ్లేందుకు వచ్చిన పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డగించడంతో అదనపు బలగాలను దింపి పరిస్థితిని అదుపు చేశారు. పాతికేళ్లలో నంబర్‌వన్‌గా భారత్ పాతికేళ్లలో ఇండియా ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుతుందని అమిత్ షా అన్నారు. బెంగాల్ దుర్గాపూజను అంతర్జాతీయ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ గౌరవం దక్కడం దేశానికే గర్వకారణమని ప్రశంసించారు. విద్య, కళలు, రక్షణ సహా పలు రంగాల్లో భారత్ గత 75ఏళ్లుగా ఎంతో పురోగతి సాధించిందని, ఇదే ధోరణిలో పయనిస్తే దేశ 100వ స్వాతంత్రదినోత్సవాల నాటికి భారత్ అగ్రగామిగా మారుతుందని చెప్పారు. గతంలో యోగా, కుంభమేళాలకు యునెస్కో ఇలాంటి గుర్తింపునే ఇచ్చింది. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్రోద్యమ వీరులకు ఆయన నివాళులర్పించారు. వారి త్యాగాల వల్లనే మనకు స్వేచ్ఛ లభించిందని గుర్తు చేశారు. -
సీఎం ఇంటి ముట్టడికి యత్నం.. టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులతో..
చండీగఢ్: రాష్ట్రంలో మాదకద్రవ్యాలను అరికట్టడంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విఫలమయ్యారంటూ.. బీజేవైఎం కార్యకర్తలు సోమవారం పంజాబ్ సీఎం అధికార నివాస ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నిరసన కారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ ఫిరంగులను ఉపయోగించారు. పంజాబ్‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాదక ద్రవ్యాలను అరికడతామని సీఎం అమరీందర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే డ్రగ్స్‌ను అరికట్టడంలో పంజాబ్ సీఎం విఫలమయ్యారని పంజాబ్ బీజేవైఎం చీఫ్ భాను ప్రతాప్ రానా ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాపారం వృద్ధి చెందిందని రానా పేర్కొన్నారు. దీనికి నిరసనగా రానా నేతృత్వంలోని ఆందోళనకారులు నిసరస చేపట్టారు. -
‘శబరిమల’ నిరసన హింసాత్మకం
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. కేరళ దేవాదాయ మంత్రి కదంకపల్లి సురేంద్రన్ అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) గురువారం చేసిన యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. తొలుత ఆందోళనకారులు సురేంద్రన్ ఇంటి వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను బద్ధలుకొట్టడానికి ప్రయత్నించారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు తొలుత జల ఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. బీజేపీ, కాంగ్రెస్‌ల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి జిల్లాల్లో సభలు నిర్వహించి ప్రజలకు తన వైఖరి తెలియజేయాలని సీపీఎంనేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్లకు పూర్వమే ఆరెస్సెస్ కోరింది.. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని కోరుతూ 12 ఏళ్ల క్రితమే ఆరెస్సెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని మంత్రి సురేంద్రన్ అన్నారు. బీజేపీ తలపెట్టిన 5 రోజుల ‘లాంగ్‌మార్చ్’ను..అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చేపట్టిన రథయాత్రతో పోల్చారు. ‘లాంగ్‌మార్చ్‌ను చూస్తుంటే నాకు రథయాత్ర గుర్తుకొస్తోంది. అన్ని వయసున్న మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం కల్పించాలని ఆరెస్సెస్ 12 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నారు’ అని అన్నారు. మసీదుల్లోకి అనుమతించాలి.. శబరిమల తీర్పు స్ఫూర్తితో అన్ని మసీదుల్లోకి కూడా మహిళలను అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేరళకు చెందిన ముస్లిం మహిళా హక్కుల సంఘం నిసా యోచిస్తోంది. మహిళలను కేవలం ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలనే కాకుండా వారిని ఇమామ్‌లుగా కూడా నియమించాలని ఉద్యమించనుంది. -
ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన
మిర్యాలగూడ (నల్లగొండ) : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. బీజేవైఎమ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం బీజేవైఎమ్ కార్యకర్తలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేంతవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని నినాదాలు చేస్తూ.. శుక్రవారం ఆర్డీవో కార్యలయం ఎదుట నిరసనలు చేపట్టారు. తెలంగాణ రాక ముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని చేయడంలో ఆసక్తి చూసిన కేసీఆర్ ఈ రోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.