
సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యాలయాన్ని బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించారు. వెంటనే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ను సస్సెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలను అమ్ముకుంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విద్యార్థి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పబ్లిక్ సర్వీస్ కమిన్ బోర్డును ధ్వంసం చేసిన బీజేవైఎం కార్యకర్తలు.. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. పేపర్ లీక్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: TSPSC: ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం.. ప్రవీణ్ ఫోన్‌లో మహిళల అసభ్య ఫోటోలు
Comments
Please login to add a commentAdd a comment