tspsc office
-
తీవ్ర ఉద్రిక్తత: టీఎస్‌పీఎస్సీలోకి చొచ్చుకెళ్లిన బీజేవైఎం కార్యకర్తలు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యాలయాన్ని బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించారు. వెంటనే టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ను సస్సెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలను అమ్ముకుంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విద్యార్థి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిన్ బోర్డును ధ్వంసం చేసిన బీజేవైఎం కార్యకర్తలు.. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. పేపర్ లీక్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: TSPSC: ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం.. ప్రవీణ్ ఫోన్లో మహిళల అసభ్య ఫోటోలు -
గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయాలి
గన్‌ఫౌండ్రీ: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గ్రూప్–1, 2, 3, 4 ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ 11 ఏళ్లుగా గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేయలేదని, ఈ విషయం గమనిస్తేనే ఎంతమంది నిరుద్యోగులు ఆవేదనకు గురవుతున్నారో స్పష్టంగా తెలుస్తుందన్నారు. అనంతరం పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా, మండలస్థాయి కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, కోల జనార్దన్, జయంతి పాల్గొన్నారు. -
టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో నిత్యం జరుగుతున్న అవకతవకలకు నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ రోజు టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడి జరిగింది. ఘంటా చక్రపాణి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. కార్యాలయంలోకి దూసుకెళ్లడానికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడి
హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో డీఎడ్ అభ్యర్థులకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ.. డీఎడ్ అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. శనివారం మధ్యాహ్నం కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న డీఎడ్ అభ్యర్థులు ముట్టడికి యత్నించడంతో.. పోలీసులు వారిని అడ్డుకొని నిరసనకారులను అరెస్ట్ చేశారు. -
గ్రూప్-2 పరీక్ష యథాతథం.. వాయిదా అబద్ధం
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న గ్రూపు-2 రాత పరీక్ష యథాతథంగా ఉంటుందని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. పరీక్షను వాయిదా వేస్తారంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని, పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఇటీవల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు ఎంపికైన 904 మంది అభ్యర్థుల జాబితాలను (శాఖల వారీగా కేటాయించిన ఉద్యోగుల జాబితా) వివిధ శాఖల ఇంజనీర్ ఇన్ ఛీఫ్‌లకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో గురువారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణి మాట్లాడారు. మరో వారం రోజుల్లో 1050 ఏఈ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామన్నారు. గ్రూపు-2 మినహా తాము నోటిఫికేషన్లు ఇచ్చిన అన్నింటి భర్తీని ఈనెలాఖరుకల్లా పూర్తి చేస్తామన్నారు. వచ్చే నెలలో గ్రూపు-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బయోమెట్రిక్ విధానం అమలుతోపాటు కేంద్రాల్లో జామర్లను ఏర్పాటు చే స్తామన్నారు. మరోవైపు ప్రభుత్వం వివిధ శాఖల్లోని ఖాళీలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేసే ఆలోచన చేస్తోందన్నారు. సింగరేణి సంస్థ కూడా తమ వద్ద ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరిందని, అయితే అది ప్రభుత్వం నుంచి రావాలని చెప్పామన్నారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించిన ఇండెంట్ ఇంకా తమకు రాలేదన్నారు. -
ఏఈఈ, ఏవో పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈనెల 17, 18వ తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్టు (సీబీఆర్టీ) నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. హైదరాబాద్‌లో 48 కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలకు దాదాపు 18 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు 17న ఉదయం జనరల్ స్టడీస్ పరీక్ష, 18న ఉదయం ఆప్షనల్ పేపర్ ఉంటుందని... అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు 17న ఉదయం జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం ఆప్షనల్ పేపర్ ఉంటుందని... ఏఈఈ పోస్టులకు 18న ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం ఆప్షనల్ పేపర్ ఉంటుందని వివరించారు. జనరల్ స్టడీస్ పేపర్ తెలుగు, ఇంగ్లిషు రెండు మాధ్యమాల్లోనూ ఉంటుందని.. ఆప్షనల్ (సబ్జెక్టు) పేపర్ మాత్రం ఇంగ్లిషులోనే ఉంటుందని తెలిపారు. వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్ష కేంద్రాన్ని ముందుగానే చూసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. పరీక్ష కేంద్రంలో రిజిస్ట్రేషన్, తనిఖీలకు సమయం పడుతుందని, అందువల్ల ముందుగానే పరీక్షా కేంద్రాలకు వెళ్లాలని చెప్పారు. ఉదయం పరీక్షకు 8:30 నుంచి 9:15 లోపే, మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంట నుంచి 1:45 లోపే పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాలని సూచించారు. పరీక్షల పర్యవేక్షణకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పకడ్బందీగా నిర్వహించేందుకు నలుగురు జోనల్ అధికారులను, 800 మంది ఇన్విజిలేటర్లను, 700 మంది సపోర్టింగ్ స్టాఫ్, 150 మంది కమిషన్ అబ్జర్వర్లు, 12 స్పెషల్ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాలను వెబ్సైట్లో (tspsc.gov.in) పొందవచ్చని వివరించారు.