తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో నిత్యం జరుగుతున్న అవకతవకలకు నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ రోజు టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడి జరిగింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో నిత్యం జరుగుతున్న అవకతవకలకు నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ రోజు టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడి జరిగింది. ఘంటా చక్రపాణి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. కార్యాలయంలోకి దూసుకెళ్లడానికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.