గ్రూప్స్‌ నోటిఫికేషన్లు విడుదల చేయాలి | Krishnaiah Demanded For Issue Job Notifications | Sakshi
Sakshi News home page

గ్రూప్స్‌ నోటిఫికేషన్లు విడుదల చేయాలి

Published Sat, Feb 19 2022 1:59 AM | Last Updated on Sat, Feb 19 2022 1:59 AM

Krishnaiah Demanded For Issue Job Notifications - Sakshi

టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడిలో పాల్గొన్న ఆర్‌.కృష్ణయ్య

గన్‌ఫౌండ్రీ: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. గ్రూప్‌–1, 2, 3, 4 ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ 11 ఏళ్లుగా గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ జారీ చేయలేదని, ఈ విషయం గమనిస్తేనే ఎంతమంది నిరుద్యోగులు ఆవేదనకు గురవుతున్నారో స్పష్టంగా తెలుస్తుందన్నారు.

అనంతరం పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా, మండలస్థాయి కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, కోల జనార్దన్, జయంతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement