గోవా బీజేపీకి షాక్‌ | Goa Assembly Elections 2022: Shock to BJP before assembly elections | Sakshi
Sakshi News home page

గోవా బీజేపీకి షాక్‌

Jan 11 2022 6:29 AM | Updated on Jan 11 2022 6:29 AM

Goa Assembly Elections 2022: Shock to BJP before assembly elections - Sakshi

పణజి: గోవాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర మంత్రి మైఖేల్‌ లోబో, మరో ఎమ్మెల్యే ప్రవీణ్‌ జాంతే బీజేపీకి సోమవారం రాజీనామా చేశారు. కలంగుటే నియోజక వర్గం నుంచి మైఖేల్‌  ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నౌకాశ్రయాలు, వ్యర్థ్యాల నిర్వహణ శాఖకు మంత్రిగా ఉన్నారు. బీజేపీ ప్రజల పక్షాన లేదని అందుకే పార్టీని వీడుతున్నట్లు మైఖేల్‌ తెలిపారు. మైఖేల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మయం నియోజక వర్గం ఎమ్మెల్యే ప్రవీణ్‌ జాంతే చెప్పారు. తన నియోజకవర్గాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోందని, సమస్యకు బీజేపీ సర్కార్‌ ఎలాంటి పరిష్కారం చూపలేకపోయిందని ప్రవీణ్‌ ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement