గోవాలో కాంగ్రెస్, బీజేపీ అమీతుమీ
సాగర తీర పర్యాటకానికి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన గోవాలో రాజకీయాలు అనిశి్చతిమయం. నేతల పార్టీ ఫిరాయింపులు ఇక్కడ పరిపాటి. దేశానికి 1947లోనే స్వాతంత్య్రం వచి్చనా గోవా మాత్రం 1961 దాకా పోర్చుగీసు పాలనలో ఉంది. కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగి 1987లో రాష్ట్ర హోదా పొందింది.
దేశంలోనే అతి చిన్న రాష్ట్రమైనా కొత్త కూటములు, కొత్త పార్టీలు, పదేపదే సీఎంల మార్పుకు మారుపేరుగా మారింది. కొందరు రెండు మూడు విడతలు పాలించగా, మరికొందరు నెల రోజులు కూడా సీఎంగా కొనసాగలేదు. ఇక్కడ పోరు జాతీయ పార్టీల చుట్టూనే తిరుగుతున్నా ప్రాంతీయ పారీ్టలూ చక్రం తిప్పుతున్నాయి...
గోవాలో రెండు లోక్‌సభ సీట్లే ఉన్నా ఈ రాష్ట్రాన్ని పారీ్టలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో కాంగ్రెస్‌కు బాగా పట్టున్న ఈ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ ఆధిపత్యం నడుస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాషాయదళం ఇక్కడి రెండు సీట్లనూ దక్కించుకుని సత్తా చాటింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతి పెద్ద పారీ్టగా నిలిచినా బీజేపీ నాటకీయంగా అధికారం దక్కించుకుంది.
మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ), కొత్తగా పుట్టుకొచ్చిన గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యే మద్దతుతో మనోహర్ పారికర్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. 2019లో పారికర్ మరణానంతరం ప్రమోద్ సావంత్ సీఎం అయ్యారు. తర్వాత కూడా బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలస కొనసాగింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో సీటు దక్కించుకున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక పెద్ద పారీ్టగా నిలిచిన బీజేపీ ప్రాంతీయ పారీ్టలతో కలిసి అధికారాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్‌లో ముసలం పుట్టి 11 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీలోకి జంప్ చేశారు. ఉత్తర గోవా లోక్‌సభ స్థానం బీజేపీకి, దక్షిణ గోవా కాంగ్రెస్‌కు కంచుకోటలుగా మారాయి.
లోకల్ ఎఫెక్ట్
‘ఇండియా’ కూటమి దన్నుతో కాంగ్రెస్ బరిలోకి దిగింది. రెండు సీట్లలోనూ పోటీ చేస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, నిరుద్యోగం, ధరల పెరుగుదల తదితరాలను ప్రచారాస్త్రాలుగా సంధిస్తోంది. బీజేపీ మోదీ, అభివృద్ధి, అయోధ్య రామ మందిరం, హిందుత్వ నినాదాలతో బరిలోకి దిగుతోంది.
సౌత్ గోవాలో బీజేపీ నుంచి పల్లవి డెంపో, కాంగ్రెస్ నుంచి మాజీ నేవీ అధికారి విరియాటో ఫెర్నాండెజ్ పోటీ చేస్తున్నారు. ఉత్తర గోవాలో సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున రమాకాంత్ ఖలప్ తలపడుతున్నారు. ఇండియా కూటమి భాగస్వామి గోవా ఫార్వర్డ్ పార్టీ కాంగ్రెస్‌కు దన్నుగా ఉంది. ఎంజీపీ వంటి పారీ్టలు కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరి అవకాశాలకు గండి కొడతాయనేది ఆసక్తికరంగా మారింది.
సర్వేలు ఏమంటున్నాయి...
గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా కాంగ్రెస్, బీజేపీ చెరో సీటు గెలుచుకోవచ్చని మెజారిటీ సర్వేలు అంచనా వేస్తున్నాయి.
ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తించిన కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టు తాజా తీర్పు చెంపపెట్టు. ప్రజలకు ఆ పార్టీ క్షమాపణ చెప్పాలి. అభివృద్ధికి పెద్దపీట వేసి, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న ఎన్డీఏ కూటమి ఒకవైపు... అవినీతి, వారసత్వ రాజకీయాలు, సొంత ప్రయోజనాలే పరమావధిగా ఉన్న ఇండియా కూటమి మరోవైపున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను గోవా సంతృప్త స్థాయిలో అమలు చేస్తోంది. నిజమైన సెక్యులరిజం, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తోంది.
– గోవా ఎన్నికల సభలో ప్రధాని మోదీ
అధికారంలోకి వస్తే గోవాలో మైనింగ్ కార్యకలాపాలను మూడు నెలల్లో ప్రారంభిస్తామని 2014లో మోదీ హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చనందుకు గోవా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నదుల అనుసంధానం పేరుతో మా నదులపై కేంద్రం పెత్తనం చేస్తోంది. వాటి పేర్లు మార్చేస్తోంది. గోవా గుర్తింపు, సంస్కృతిని నావనం చేస్తోంది.
– ఎన్నికల ర్యాలీలో గోవా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ పాట్కర్
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment