local parties
-
Lok sabha elections 2024: సీట్లు రెండే... పోటీ సయ్యారే !
సాగర తీర పర్యాటకానికి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన గోవాలో రాజకీయాలు అనిశి్చతిమయం. నేతల పార్టీ ఫిరాయింపులు ఇక్కడ పరిపాటి. దేశానికి 1947లోనే స్వాతంత్య్రం వచి్చనా గోవా మాత్రం 1961 దాకా పోర్చుగీసు పాలనలో ఉంది. కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగి 1987లో రాష్ట్ర హోదా పొందింది. దేశంలోనే అతి చిన్న రాష్ట్రమైనా కొత్త కూటములు, కొత్త పార్టీలు, పదేపదే సీఎంల మార్పుకు మారుపేరుగా మారింది. కొందరు రెండు మూడు విడతలు పాలించగా, మరికొందరు నెల రోజులు కూడా సీఎంగా కొనసాగలేదు. ఇక్కడ పోరు జాతీయ పార్టీల చుట్టూనే తిరుగుతున్నా ప్రాంతీయ పారీ్టలూ చక్రం తిప్పుతున్నాయి... గోవాలో రెండు లోక్‌సభ సీట్లే ఉన్నా ఈ రాష్ట్రాన్ని పారీ్టలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో కాంగ్రెస్‌కు బాగా పట్టున్న ఈ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ ఆధిపత్యం నడుస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాషాయదళం ఇక్కడి రెండు సీట్లనూ దక్కించుకుని సత్తా చాటింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతి పెద్ద పారీ్టగా నిలిచినా బీజేపీ నాటకీయంగా అధికారం దక్కించుకుంది. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ), కొత్తగా పుట్టుకొచ్చిన గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యే మద్దతుతో మనోహర్ పారికర్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. 2019లో పారికర్ మరణానంతరం ప్రమోద్ సావంత్ సీఎం అయ్యారు. తర్వాత కూడా బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలస కొనసాగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో సీటు దక్కించుకున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక పెద్ద పారీ్టగా నిలిచిన బీజేపీ ప్రాంతీయ పారీ్టలతో కలిసి అధికారాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్‌లో ముసలం పుట్టి 11 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీలోకి జంప్ చేశారు. ఉత్తర గోవా లోక్‌సభ స్థానం బీజేపీకి, దక్షిణ గోవా కాంగ్రెస్‌కు కంచుకోటలుగా మారాయి. లోకల్ ఎఫెక్ట్ ‘ఇండియా’ కూటమి దన్నుతో కాంగ్రెస్ బరిలోకి దిగింది. రెండు సీట్లలోనూ పోటీ చేస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత, నిరుద్యోగం, ధరల పెరుగుదల తదితరాలను ప్రచారాస్త్రాలుగా సంధిస్తోంది. బీజేపీ మోదీ, అభివృద్ధి, అయోధ్య రామ మందిరం, హిందుత్వ నినాదాలతో బరిలోకి దిగుతోంది. సౌత్ గోవాలో బీజేపీ నుంచి పల్లవి డెంపో, కాంగ్రెస్ నుంచి మాజీ నేవీ అధికారి విరియాటో ఫెర్నాండెజ్ పోటీ చేస్తున్నారు. ఉత్తర గోవాలో సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున రమాకాంత్ ఖలప్ తలపడుతున్నారు. ఇండియా కూటమి భాగస్వామి గోవా ఫార్వర్డ్ పార్టీ కాంగ్రెస్‌కు దన్నుగా ఉంది. ఎంజీపీ వంటి పారీ్టలు కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరి అవకాశాలకు గండి కొడతాయనేది ఆసక్తికరంగా మారింది.సర్వేలు ఏమంటున్నాయి... గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా కాంగ్రెస్, బీజేపీ చెరో సీటు గెలుచుకోవచ్చని మెజారిటీ సర్వేలు అంచనా వేస్తున్నాయి.ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తించిన కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టు తాజా తీర్పు చెంపపెట్టు. ప్రజలకు ఆ పార్టీ క్షమాపణ చెప్పాలి. అభివృద్ధికి పెద్దపీట వేసి, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న ఎన్డీఏ కూటమి ఒకవైపు... అవినీతి, వారసత్వ రాజకీయాలు, సొంత ప్రయోజనాలే పరమావధిగా ఉన్న ఇండియా కూటమి మరోవైపున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను గోవా సంతృప్త స్థాయిలో అమలు చేస్తోంది. నిజమైన సెక్యులరిజం, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తోంది. – గోవా ఎన్నికల సభలో ప్రధాని మోదీఅధికారంలోకి వస్తే గోవాలో మైనింగ్ కార్యకలాపాలను మూడు నెలల్లో ప్రారంభిస్తామని 2014లో మోదీ హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చనందుకు గోవా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నదుల అనుసంధానం పేరుతో మా నదులపై కేంద్రం పెత్తనం చేస్తోంది. వాటి పేర్లు మార్చేస్తోంది. గోవా గుర్తింపు, సంస్కృతిని నావనం చేస్తోంది. – ఎన్నికల ర్యాలీలో గోవా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ పాట్కర్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
Ghulam Nabi Azad: గులాం నబీ ఆజాద్ దారెటు?
జమ్ము కశ్మీర్ గడ్డపై నల్ల మంచు కురిసిన వేళ.. తాను బీజేపీలో చేరతానంటూ గతంలో బీజేపీలో చేరిక మీడియా ఊహాగానాలపై వ్యంగ్యం ప్రదర్శించారు గులాం నబీ ఆజాద్. ఈ తరుణంలో మారిన రాజకీయ సమీకరణాలతో ఆయన మనసు మార్చుకుంటారా? లేదంటే మరో పార్టీలో చేరతారా? సొంత కుంపటి పెట్టబోతున్నారా? అసలు ఆయన తర్వాతి అడుగు ఏంటన్న దానిపై చర్చ మొదలైంది ఇప్పుడు.. కాంగ్రెస్ కీలక నేత, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్గా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా, రాజ్యసభ సభ్యుడిగా, పెద్దల సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగిన 73 ఏళ్ల వయసున్న ఆజాద్.. దాదాపు 50 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో కొనసాగిన అనుబంధాన్ని తెంచేసుకున్నారు. గత రెండు మూడేళ్లుగా కాంగ్రెస్ పరిణామాలపై తీవ్ర అసంతృప్తిని ప్రదర్శిస్తున్న ఆయన.. తాజా పరిణామాలకు మాత్రం తీవ్రంగా నొచ్చుకున్నారు. అయితే.. ఆయన పార్టీని వీడతారని మాత్రం అధిష్ఠానం ఊహించలేదు. పైగా పార్టీని వీడుతూ.. ఆయన విడుదల చేసిన సంచలన ప్రకటన కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. ► 1973లో 22 ఏళ్ల వయసులో భలెస్సా బ్లాక్‌కు కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా ఆజాద్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ పనితనానికి మెచ్చి.. రెండేళ్లకే జమ్ము కశ్మీర్ యూత్ ప్రెసిడెంట్‌ను చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం. మరో ఐదేళ్లకు అంటే 1980లో ఏకంగా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయ్యాడు ఆయన. ఆపై మహారాష్ట్ర వాసిం లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు, అటుపై కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ► పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే.. పార్లమెంటరీ వ్యవహారాలు, పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖలు చేపట్టారు ఆజాద్. ఆపైనా రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘ కాలం కొనసాగినా.. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి అవకాశం రావడంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ► పీపుల్స్ డెమొక్రటిక్‌పార్టీ కూటమి మద్దతు ఉపసంహరణతో కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం పదవికి విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే రాజీనామా చేశారాయన. ► ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, డాక్టర్ మన్మోహన్ సింగ్.. కాంగ్రెస్ నలుగురి ప్రధానుల హయాంలో మంత్రిగా పని చేసిన అనుభవశాలి గులాం నబీ ఆజాద్. తేడా వ్యాఖ్యలు! ► ప్రతిపక్ష నేతగా, సభ్యుడిగా బీజేపీ-ఎన్డీయేపై ఆయన ప్రత్యక్ష విమర్శలు గుప్పించిన సందర్భాలు చాలా చాలా తక్కువ. ► మోదీ నేతృత్వంలోని బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి పురస్కారం అందుకున్నారాయన. ఆ సందర్భంలో.. కనీసం ఎవరో ఒకరు తన పనిని గుర్తించారంటూ వ్యాఖ్యానించడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. ► కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గిందంటూ బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా ప్రశంసలు గుప్పించారు గులాం నబీ ఆజాద్. ఆ సందర్భంలో.. బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలను స్వాగతించారు. ► కాంగ్రెస్ గులాం నబీ ఆజాద్‌ని అవమానిస్తోందని ఆరోపిస్తూ.. ఆయన మేనల్లుడు ముబషర్ ఆజాద్ బీజేపీలో చేరారు. ► కాంగ్రెస్ గాంధీ కుటుంబ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ.. ఏర్పడ్డ జీ 23 కూటమిలో గులాం నబీ ఆజాద్ కీలకంగా వ్యవహరించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల(పంజాబ్‌లో అయితే ఏకంగా అధికారం కోల్పోవడం) ఆధారంగా.. సంస్థాగత మార్పుపై తీవ్రస్థాయిలో అధిష్ఠానంపై గళమెత్తారు. ► ఆ సమయంలోనే ఆయన పార్టీని వీడతారేమో అనే చర్చ నడిచింది. అయితే సోనియా గాంధీ పిలిపించుకుని వ్యక్తిగతంగా మాట్లాడడంతో ఆయన ఆ సమయానికి మెత్తబడ్డారు. "పోస్టులు వస్తాయి... పెద్ద పెద్ద ఆఫీసులు వస్తాయి... అధికారం వస్తుంది... కానీ వాటిని ఎలా నడపాలి అనేది ఎవరైనా సరే... గులామ్ నబీ ఆజాద్ జీ నుంచి నేర్చుకోవాలి. నా దృష్టిలో ఆయన నిజమైన స్నేహితుడు" అని మోదీ భావోద్వేగం చెందారు. "నేను మిమ్మల్ని రిటైర్ కానివ్వను. మీ సలహాలు తీసుకుంటూనే ఉంటాను. నా డోర్లు ఎల్లప్పుడూ మీ కోసం తెరిచే ఉంటాయి" అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆజాద్ వీడ్కోలు సందర్భంగా రాజ్యసభలో కన్నీరు పెట్టుకున్నారు. #WATCH: PM Modi gets emotional while reminiscing an incident involving Congress leader Ghulam Nabi Azad, during farewell to retiring members in Rajya Sabha. pic.twitter.com/vXqzqAVXFT — ANI (@ANI) February 9, 2021 ► ఈ వ్యాఖ్యల తర్వాత ఆజాద్.. బీజేపీ గూటికి చేరతారంటూ పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. అయితే అవన్నీ ఊహాగానాలే అని అప్పుడు కొట్టిపారేశారాయన ► కాంగ్రెస్‌లో తన ప్రాబల్యాన్ని తగ్గించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన్ని ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమిస్తే, అది ప్రమోషన్ కాదని.. డిమోషన్ అని పేర్కొంటూ ఆ పదవికి రాజీనామా చేసి సోనియాగాంధీ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు. ఈ నిర్ణయం ప్రకటించి వారం తిరగక ముందే.. ► తాజాగా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపిన లేఖలో.. పార్టీ ఎన్నికలను బూటకమని, రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలే గుప్పించారు. ► బీజేపీ కాకుంటే.. బీజేపీలో చేరేది ఊహాగానాలే అంటూ గతంలో ప్రకటించారు గులాం నబీ ఆజాద్. కానీ, బీజేపీతో ఆయన అనుబంధం మాత్రం చాలా ఏళ్లుగా కొనసాగుతూనే వస్తోంది. ప్రస్తుత పరిస్థితులు.. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరవచ్చని ఒకవర్గం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బీజేపీలో చేరినా.. సలహాదారుగా మాత్రమే ఆయన వ్యవహరించవచ్చనే భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీలో గనుక చేరుకుంటే.. ఆయన కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ‘స్థానిక’ సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుని కొత్త పార్టీ నిర్ణయం తీసుకోవచ్చని, లేదంటే.. ప్రాంతీయ పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: రాహుల్‌కు ఆ హోదా లేకున్నా.. కాంగ్రెస్‌కు ఆజాద్ రాజీనామా, లేఖ కలకలం -
తెలంగాణ: 7 జాతీయ, 4 ప్రాంతీయ పార్టీలు
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో 7 జాతీయ, నాలుగు ప్రాంతీయ పార్టీలకు గుర్తింపు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో 4 శాతం ఓట్లు సాధిస్తే జాతీయ పార్టీగా, ఏదైనా పార్టీ ఒక రాష్ట్రం లేదా ప్రాంతంలో 4 శాతం ఓట్లు సాధిస్తే దాన్ని రాష్ట్ర లేదా ప్రాంతీయ పార్టీగా పరిగణిస్తారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎన్నికల గుర్తులను ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. సిద్ధాంత రీత్యా లేదా వ్యక్తుల వల్ల పార్టీలు చీలిపోయినప్పుడు ఆ పార్టీ గుర్తు ఏ వర్గానికి కేటాయించాలన్న వివాదం ఏర్పడడం సహజమే. అలాంటప్పుడు సమస్య పరిష్కార చర్య ఎన్నికల సంఘమే తీసుకుంటుంది. రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీలు సాధారణంగా ఎన్నికల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీలతో పాటు రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీలు పోటీలో ఉంటాయి. ఈ పార్టీలను కొందరు వ్యక్తులు లేదా సంస్థలు ఎన్నికల సంఘంలో నమోదు చేసుకుంటాయి. ఎన్నికల్లో పోటీ చేసినా, చేయకపోయినా అవి అలాగే కొనసాగుతుంటాయి. ఒకవేళ పోటీ చేస్తే ఆ పార్టీ అభ్యర్థులకు ఎన్నికలప్పుడు ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్‌గా ఉంచిన వాటిలో నుంచి గుర్తులు కేటాయిస్తుంది. వారికి స్వతంత్య్ర అభ్యర్థుల కన్నా ముందు గుర్తులు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తారు. దేశంలో సుమారు 1,983 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీలు ఉన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో 73 వరకు ఉంటాయి. తెలంగాణ జన సమితి, జనసేన, లోక్‌సత్తా, ఏఐఎఫ్బీలను ఇదే కోవలో పరిగణిస్తారు. రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించేందుకు ఎన్నికల సంఘం 164 ఫ్రీ సింబల్స్‌ను సిద్ధంగా ఉంచింది. జాతీయ పార్టీలు దేశంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు కేటాయించిన గుర్తులను ఇతర పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు ఇవ్వకుండా జాగ్రత్త పడుతుంది. దేశంలో ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ), కమ్యూనిస్టు పార్టీ ఇండియా(సీపీఎం), ఆలిండియా కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీలుగా గుర్తించింది. ప్రాంతీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు ప్రాంతీయ పార్టీలు ఎన్నికల సంఘం గుర్తింపు పొందాయి. మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం–పతంగి గుర్తు), తెలంగాణ రాష్ట్ర సమితి (కారు గుర్తు), తెలుగుదేశం పార్టీ(సైకిల్ గుర్తు), వైఎస్సార్సీపీ (సీలింగ్ ఫ్యాన్ గుర్తు)లను ఎన్నికల సంఘం గుర్తించింది. -
కేంద్రంలో ‘ప్రాంతీయ’ ప్రాబల్యం!
ప్రస్తుతం దేశంలో నిజమైన జాతీయ పార్టీ ఏదీ ఇప్పుడు లేదని తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. గతంలో జాతీయపార్టీలుగా పేరొందిన బీజేపీ, కాంగ్రెస్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలుగానే మిగిలిపోయాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ రెండు పార్టీల పాదముద్రలు కనబడుతున్నాయి. వైఎస్సార్ ఆకస్మిక మరణానంతరం తన నిజమైన వారసుడిని ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ ఏపీలో సామూహికంగా ఆత్మహత్య చేసుకుంది. 20 మంది శక్తిమంతులైన ప్రాంతీయ నేతలతో భారత్ నిజమైన ఫెడరల్ రిపబ్లిక్‌గా ఎదుగుతోంది. 2019 సార్పత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీల సంకీర్ణం తప్పదు. భారతదేశాన్ని అవలోకించడానికి రెండు మార్గాలున్నాయని మీరు అర్థం చేసుకోదలిచినట్లయితే, మీరు తరచుగా దేశరాజధాని ఢిల్లీని వదిలి బయటకు రావాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే లోపలినుంచి బయటకు చూడటం.. అంటే ఢిల్లీ, దేశ ప్రధాన భూభాగం నుంచి వెలుపలకు తొంగి చూడటం లేక వెలుపలినుంచి లోపలికి చూడటం. అంటే దేశ ప్రధాన భూభాగాన్ని సుదూరం నుంచి చూడటం. మీరు లోపలి నుంచి బయటకు చూస్తున్నప్పుడు, జాతీయ పార్టీ, జాతీయ నాయకుల కోణం నుంచి మాత్రమే దర్శించే కోణాన్నే మీకు అందిస్తుంది. అలా కాకుండా సుదూరం నుంచి దాపరికం లేకుండా మీరు చూసినట్లయితే ఈ నూతన భారత్‌లో జరిగిన, జరుగుతున్న మార్పును మీరు చూడవచ్చు. అదేమిటంటే జాతీయపార్టీలుగా ఇన్నాళ్లుగా మనకు తెలిసిన పార్టీలు క్షీణించిపోతున్నాయి. మహా జాతీయ నేత అనే భావన ఇందిరాగాంధీతోనే ముగిసిపోయింది. భారత మహా రాజకీయ చిత్రపటంపై కొత్త చిత్రణలు ఈ వారం ఇద్దరు బలమైన రాష్ట్ర నాయకుల గురించి వివరించాయి. ఒకరు తెలంగాణలో తిరుగులేని నేత కె. చంద్రశేఖరరావు (టీఆర్ఎస్), రెండు. అంధ్రప్రదేశ్‌లో వైఎస్. జగన్మోహన్ రెడ్డి (వైఎస్సార్ సీపీ). భారత్‌లో నిజమైన జాతీయ పార్టీ ఇప్పుడు ఏదీ లేదని ఈ ఇద్దరు నేతలూ తమ శైలిలో చాలా స్పష్టంగా చెప్పారు. ఒకప్పుడు జాతీయ పార్టీలుగా వర్ణించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలుగానే ఉన్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ రెండు పార్టీల పాదముద్రలు కనపడుతున్నాయి. ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ క్షీణించిపోతున్నదని మనం అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో బీజేపీని జాతీయపార్టీగా ఎందుకు చెప్పలేం. ఢిల్లీలో కూర్చున్న మనం దేశం అంటే హిందీ ప్రాబల్యం ఉండే భూభాగం అని అయోమయానికి గురవుతున్నాం. ఉదాహరణకు 2014లో బీజేపీ సాధించిన 282 స్థానాల్లో మెజారిటీ ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హరి యాణా, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ (190 స్థానాలు) రాష్ట్రాల నుంచే వచ్చాయి. బీజేపీ సాధించిన మిగతా సీట్లలో 49 స్థానాలు పశ్చిమప్రాంతమైన మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చాయి. అంటే ఈ అన్ని రాష్ట్రాల్లోని మొత్తం 299 సీట్లలో 239 స్థానాలను బీజేపీ సాధిం చింది. అంటే 80 శాతం స్థానాలు ఇక్కడినుంచే వచ్చాయి. మిగిలిన దేశ మంతటా మొత్తం దక్షిణప్రాంతం (కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు), తూర్పున (పశ్చిమబెంగాల్, ఒడిశా), ఉత్తరాన జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని 244 సీట్ల నుంచి బీజేపీ 43 స్థానాలు మాత్రమే గెల్చుకుంది. అంటే 17 శాతం మాత్రమే అన్నమాట. ఈ వ్యత్యాసాన్ని పరిశీలిస్తే బీజేపీని దేశమంతటా పునాది ఉన్న జాతీయ పార్టీగా గుర్తించలేం. అది కేవలం పది రాష్ట్రాల్లో మాత్రమే గెలిచిన పార్టీగా కనిపిస్తుంది. మరి జాతీయ నాయకుల మాటో? నరేంద్రమోదీ ఒక్కరు మాత్రమే ఆ స్థాయిని ఇవాళ ప్రకటించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికీ ఆయన తెలుసు. కానీ ఈ పది రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాల్లో ప్రజలు తనకు అధికంగా ఓట్లు వేసేలా మోదీ మ్యాజిక్ చేయగలరా? బీజేపీకి మెజారిటీనిచ్చిన ఈ పది రాష్ట్రాల్లో కూడా స్థానిక పార్టీలు, స్థానిక నేతల నుంచే మోదీకి సవాల్ ఎదురైంది. బిహార్‌లో లాలూ ప్రసాద్, నితిశ్ కుమార్‌లు సరిసమాన స్థాయి నాయకులు. ఈ ఇద్దరిలో చెరొకరితో కాంగ్రెస్, బీజేపీ జూనియర్ భాగస్వామి స్థాయిలో పొత్తు కట్టాయి. పంజాబ్‌లో బీజేపీ అకాలీదళ్‌తో పొత్తుకలిపి ఉంది. హరియాణాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ స్థానిక భాగస్వామికోసం గాలిస్తున్నాయి. చివరకు అసాధారణమైన వాగ్ధాటి కలిగిన మోదీ సైతం ఏడు రాష్ట్రాలకు మించి ఇతరత్రా తన పార్టీకి మెజారిటీ తీసుకువచ్చే పరిస్థితిలో లేరు. బీజేపీ 7 నుంచి 9 రాష్ట్రాల్లో మాత్రమే జాతీయ పార్టీ స్థాయిలో ఉండగా, కాంగ్రెస్ ఆరు రాష్ట్రాల్లో మాత్రమే జాతీయ పార్టీగా ఉంటోంది. అది కూడా చాలా చిన్న రాష్ట్రాల్లో మాత్రమే. అవేమిటంటే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ, పంజాబ్, కర్ణాటక. ఇక పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బిహార్‌లో కాంగ్రెస్ ఉనికిలో లేకుండా పోయింది. అందుకనే ఓటర్ దేవుళ్లు ఎంత కరుణిం చినా కాంగ్రెస్ గురిపెట్టగల స్థానాలు 150 మాత్రమే. ఇవి కూడా వచ్చే అవకాశం లేదని నాకు తెలుసు. మహా అయితే 100 స్థానాలను అది లక్ష్యంగా చేసుకోవచ్చు. అయితే బీజేపీ అర్థ జాతీయ పార్టీగా తన్నుతాను నిరూపించుకుంటూండగా, కాంగ్రెస్ మూడిట ఒక వంతు కూడా జాతీయ పార్టీ స్థాయిని కలిగిలేదు. నిజానికి, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గెలుపు సాధించగలిగిన నిజమైన చివరి జాతీయ నాయకురాలు ఇందిరాగాంధీ మాత్రమే. ఆమె తదనంతరం 1984 డిసెంబర్లో జరిగిన అసాధారణ ఎన్నికలను మినహాయిస్తే నిజమైన జాతీయనాయకులు కానీ, పార్టీలు కానీ ఆవిర్భవించలేదు. రాజకీయపరమైన ఈ ఖాళీని ప్రజాకర్షణ కలిగిన శక్తిమంతులైన రాష్ట్రాల, కులాల నాయకులు భర్తీ చేశారు. వీరిలో ఏ ఒక్కరినీ ప్రాంతీయ స్థాయి నేత అని వర్ణించినా అది అపప్రయోగమే అవుతుంది. ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలు 1952–77 కాలంలో కేవలం 4 శాతం ఓట్ల శాతాన్ని మాత్రమే సాధించగా, 2002–2018 కాలంలో అది 34 శాతానికి పెరిగింది. ఈ వేసవిలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. తమకు వస్తున్న ఓటింగ్ శాతం ప్రకారం వీరు మరిన్ని స్థానాలను పొందగలరు కూడా. ఇవాళ 34 శాతం ఓటుతో ఈ పార్టీలన్నీ లోక్‌సభ స్థానాల్లో 34 శాతం గెల్చుకోగలవు. ప్రతి అదనపు ఒక శాతం ఓట్లకు గానూ వీరు 11 స్థానాలను అధికంగా పొందనుండగా, జాతీయ పార్టీలు మాత్రం ఒక శాతం అదనపు ఓట్లతో కేవలం 7 స్థానాలు మాత్రమే పొందగలవు. ప్రణబ్ రాయ్, దొరబ్ సోపరివాలా పొందుపర్చిన ది వర్డిక్ట్ నుంచి తీసుకున్న డేటా ఆధారంగా నేను ఇలా చెబుతున్నాను. విభజన పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ వాటా సాంప్రదాయికంగానే 40 శాతం మేరకు ఉండేది. కానీ విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటు శాతం కేవలం 3 శాతానికి పడిపోయింది. మోదీ మెజారిటీతో ఉన్నా, అమిత్‌షా బీజేపీ సభ్యత్వాన్ని 10 కోట్లకు పెంచినా అసోం, త్రిపుర మినహాయిస్తే, కొత్త ప్రాంతాల్లో ఈ పార్టీ ఎక్కడా గెలుపొందలేదు. వాస్తవానికి దేశంలోని ఒక పరిమిత భూభాగంలో లేక రాజకీయ జనసంఖ్యలో ఇవాళ దేశంలో 20 మంది నాయకులు చాలా బలంగా ఉంటున్నారు. మోదీతో సహా ఏ జాతీయ స్థాయి నేత కూడా వీరి ఓట్లను కొల్లగొట్టలేరు. వీరిలో చాలామందికి పాలనాపరమైన, రాజకీయ పరమైన అనుభవం ఉంది. వీరందరికీ విభిన్న భావజాలాలు, అభిప్రాయాలు ఉండవచ్చు కానీ జాతీయ పార్టీల ఆధిపత్యం పట్ల ఏవగింపును ప్రకటించడంలో వీరందరూ ఐక్యత కలిగి ఉంటున్నారు. హిందీ ప్రాంతాలకు, ఢిల్లీకి బయట ఉన్న విశాలమైన ప్రగతిశీల ప్రపంచం మన ప్రముఖుల అభ్రదత అంశాన్ని ఈ ఎన్నికల సీజన్లో పట్టించుకోవడం లేదు. మోదీ గెలవకపోతే ‘కలగూరగంపే’ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. దక్షిణాదిలోగానీ, తూర్పునగానీ మోదీ గెలవకపోతే ఎవరు అనే ప్రశ్నేలేదు. మూడు దశాబ్దాల తర్వాత, కాంగ్రెస్ ఓటమి తర్వాత భారతదేశం నిజమైన ఫెడరల్ రిపబ్లిక్‌గా ఎదుగుతోంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే కాంగ్రెస్, బీజేపీ ఆధిక్యం కోసం పోటీ పడుతున్న రాష్ట్రాల్లో ఒక్క చోటా అసలైన ప్రాంతీయ నాయకుడు లేకపోవడం. యూపీ, బీహార్లలో లాలూ, నితీశ్, మాయావతి, అఖిలేశ్ బలమైన నాయకులు. కానీ, ప్రతి ఒక్కరికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. బీజేపీ వారిని ఎదిరించడం లేదంటే కలుపుకుపోవడం ద్వారా విజయాన్ని పంచుకుంటుంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఒక రకంగా కర్ణాటక సహా చాలా రాష్ట్రాల్లో వారికి బలమైన నాయకులు లేకపోయినా జాతీయ పార్టీలదే ఇప్పటికీ హవా. మరో కారణం బలమైన రాష్ట్ర నాయకులు ఎదగడానికి జాతీయ పార్టీలు సుముఖంగా లేకపోవడం. ఆంధ్రప్రదేశ్‌లో తన నిజమైన వారసుడు వైఎస్ జగన్‌ని ఎదగనీయడానికి బదులుగా కాంగ్రెస్ సామూహికంగా ఆత్మహత్య చేసుకుంది. సీఎం పదవిని ఆశించినందుకు ఆగ్రహిం చిన కాంగ్రెస్ పార్టీ, హెలికాఫ్టర్ ప్రమాదంలో తన తండ్రి వైఎస్సార్ చనిపోయిన తర్వాత వైఎస్ జగన్‌కి కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ వల్ల బీజేపీకి ఏమాత్రం లాభం లేదు. శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే, రమణ్ సింగ్‌లను ఇప్పటికే అది పక్కన పెట్టేసింది. దీంతో భారతదేశపు రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికర దశకు చేరుకున్నాయి. హిందీ ప్రాంతానికి బయట నిజానికి జాతీయ నాయకుడు, జాతీయ పార్టీ ఏర్పడే అవకాశం లేదు. సంకీర్ణ ప్రభుత్వాల పట్ల అభద్రతా భావం కూడా తగ్గుముఖం పడుతోంది. 2014 ఫలితాల్లో వలే పక్కపక్కనే ఉన్న రాష్ట్రాల్లో 200 స్థానాలు సాధించినా సరే.. పూర్తి స్థాయి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడే సూచనలు ప్రస్తుతం లేవు. 2019 ఎన్నికల్లో ప్రచారం చేయడానికేమీ లేదు. ఇవి ఎవరికైనా గాలివాటం ఎన్నికలే. 2014లో వలే కాకుండా 2004లో లాగా ఇవి రాష్ట్రాలవారీ ఎన్నికలని ఇప్పుడు మనం గట్టిగా చెప్పొచ్చు. తదుపరి సంకీర్ణానికి ఎవరు నాయకత్వం వహిస్తారని నన్ను అడగొద్దు, ఎందుకంటే నాకు కూడా తెలీదు. తదుపరి ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించినా రాం విలాస్ పాశ్వాన్ లాంటి వాడు కూడా నోరు తెరవగలిగే మంత్రివర్గం ఏర్పడుతుందని మాత్రమే నేను మీకు చెప్పగలను. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
బీజేపీ ఓట్ల శాతం తగ్గింది!
న్యూఢిల్లీ: బీజేపీ జోరుకు బ్రేకులు పడుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మూడు ప్రధాన రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో గతంకన్నా భారీగా ఓట్ల శాతం కోల్పోయింది. ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో 2013 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం ఒక్కసారిగా తగ్గింది. అయితే ఆ ఓట్లు పూర్తిగా కాంగ్రెస్ వైపే మళ్లలేదు. ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీ ఓట్లను పంచుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో అత్యధిక ఓట్లశాతంతో మొత్తం 65 స్థానాలకుగాను 62 స్థానాల్లో విజయం సాధించినా ఇప్పుడు అది తగ్గుముఖం పట్టింది. మరోవైపు తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే విజయం ఢంకా మోగించాయి. 2014 తర్వాత చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపేతర పార్టీలకు ఆదరణ పెరుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఫలితాలను చూస్తుంటే 2019 సాధారణ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పోషిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా బీజేపేతర పార్టీలు కూటమి ఏర్పాటు చేసే పనిలో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో దిగజారిన బీజేపీ.. ఛత్తీస్‌గఢ్ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 41 శాతం ఓట్లు రాగా, 2014లో అది 49 శాతానికి పెరిగింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అది 32.2 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్‌కు 2013లో 40.3శాతం రాగా, 2014లో 38.37 శాతానికి తగ్గింది. ఈ ఎన్నికల్లో 43.2 శాతానికి పెరిగింది. 2013లో బీఎస్పీకి 4.3 శాతం ఓట్లు రాగా.. ఈ సారి ఆ పార్టీ మాజీ సీఎం అజిత్ జోగి పార్టీతో కూటమిగా ఏర్పడి 10.7 శాతం ఓట్లు దక్కించుకుంది. మరోవైపు స్వతంత్రులు 2013లో 5.3 శాతం కొల్లగొట్టగా తాజాగా 6.3 శాతానికి మెరుగయ్యారు. రాజస్తాన్‌లోనూ అదే పరిస్థితి.. రాజస్తాన్‌లోనూ బీజేపీ పరిస్థితి అలాగే ఉంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 45.2 శాతం ఓట్లు బీజేపీకి రాగా, ఇప్పుడది 38.8కి పడిపోయింది. 2014లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ రికార్డ్ స్థాయిలో 55శాతం ఓట్లను కొల్లగొట్టి మొత్తం 25 స్థానాలూ గెలిచింది. గతంతో పోలిస్తే కాంగ్రెస్ మెరుగైంది. 2013లో 33.1 శాతం వస్తే, ఇప్పుడది 39.2కు చేరింది. 2014లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి 30 శాతం ఓట్లతో సరిపెట్టుకుని అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది. ఇక ఇక్కడ స్వంతత్రుల ఓటు షేర్ 8.2 శాతం నుంచి 9.5కి పెరిగింది. మిజోలో కాంగ్రెస్ చతికిల.. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించిన 5 రాష్ట్రాల్లో కేవలం మిజోరాంలోనే బీజేపీకి ఓట్ల శాతం పెరగడం, కాంగ్రెస్ తగ్గడం జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ను ఓడించిన ప్రాంతీయ మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్)దే అత్యధిక ఓట్లు సాధించింది. 2013లో ఇక్కడ కాంగ్రెస్‌కు 45 శాతం ఓట్లు రాగా, తాజాగా అది 30 శాతానికి పడిపోయింది. ఇక బీజేపీ 0.4 నుంచి 8 శాతానికి పెంచుకోగలిగింది. ఇక ఎంఎన్ఎఫ్ ఓట్ల శాతం 28.8 శాతం నుంచి ఈసారి 37.6 పెరిగింది. హోరాహోరీగా మధ్యప్రదేశ్.. కాంగ్రెస్, బీజేపీకి మధ్య పోటీ హోరా హోరాగా ఉండటంతో మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓట్ల శాతం ఆసక్తిగా మారింది. 2013తో పోలిస్తే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 36.4 శాతం ఓట్ల నుంచి 41.4కి పెరిగింది. ఇక బీజేపీ 44.9శాతం నుంచి 41.3కు పడిపోగా, బీఎస్పీ 4.6 శాతానికి పడిపోయింది. ఇక స్వతంత్రులు అదే 5 శాతం వద్ద ఆగిపోగా..చిన్న పార్టీలు తమ ఓటు షేర్ పెంచుకున్నాయి. కాగా, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రెండూ పతనమయ్యాయి. -
కష్టాల కడలిలో కాంగ్రెస్ నావ
సమకాలీనం 2013 తరువాత కాంగ్రెస్ అధికారంలో ఉన్నచోట బీజేపీ ఆధిపత్యం సాధించి, తేలిగ్గా గెలుస్తోంది. అయితే, బీజేపీ సైతం ఏదైనా ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే ఓడిపోతోంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట రెండు జాతీయ పార్టీలకు స్థానం దొరకటం లేదు. అంటే కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తూ వస్తోంది, తాను అధికారంలో ఉన్న చోట నిలదొక్కుకుంటోంది. అంతేగానీ ప్రాంతీయ పార్టీలను మాత్రం ఏమీ చేయలేకపోతోంది. స్వల్ప వ్యవధి విశ్రాంతికోసం మళ్లీ అజ్ఞాతంలోకి పోతున్నట్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తే... ఆ పార్టీ ఆకతాయి అభిమాని ఒకరు ‘మళ్లీ రానక్కర్లేదు’ అని రీ-ట్వీట్ చేశారు. ‘విశ్రాంతి కోసం వెళ్లిన మొదటి అజ్ఞాతానికి, తాజా అజ్ఞాతానికి మధ్య కూడా విశ్రాంతే కదా!’ అని మరో క్రియాశీల కార్యకర్త వేళాకోళమాడారు. ఇది వేళాకోళం కాదు, అతికష్టం మీద జీర్ణించుకుంటున్న వాస్తవమని కాంగ్రెస్ శ్రేయోభిలాషులు పలువురు వాపోతున్నారు. భారత రాజకీయ యవనికపై ఎన్నడూ ఎరుగని లోలోతు ల్లోకి దిగజారిన కాంగ్రెస్ ఉనికి మిణుకు మిణుకుమంటోంది. పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే రాహుల్‌కు పూర్తి బాధ్యతలను అప్పగించాలని ‘వీర విధేయులు’ అక్కడక్కడ గొంతెత్తుతున్నా.... అత్యధికులకు సందేహాలు న్నాయి. పార్టీ అధినేత్రి, రాహుల్ తల్లి సోనియా గాంధీ తన ఆరోగ్యం బాగోలేకపోయినా రాహుల్‌ను పార్టీ అధ్యక్షుణ్ణి చేసి, పగ్గాలను అప్పగించేం దుకు సాహసించలేకపోతున్నారు. రాహుల్ సారథ్య ప్రతిభపై ఈ సొంతింటి సందేహాలకు తోడు ప్రత్యర్థి బీజేపీ, ఆరెస్సెస్ చేస్తున్న విస్తృత, వ్యూహాత్మక ప్రచారం రాహుల్‌ను ‘ఇంకా ఎదగని వాడు‘గా చూపుతోంది. ఆయన చేష్టలూ దానికి ఊతమిస్తున్నాయి. మాటల్లో ఇటీవల కొంత మెరుగుపడ్డా... మాటలకు, చేతలకు పొంతనలేనితనం ఆయన ఎదుగుదలను దెబ్బతీస్తోంది. అను భవరాహిత్యంతో తీసుకుంటున్న కొన్ని సంస్థాగత నిర్ణయాలు వివిధ రాష్ట్రాల్లో పార్టీని బలహీనపరుస్తున్నాయి. విశాల భారతంలో కాంగ్రెస్ ఒక పెద్ద రాష్ట్రం, మరో అరడజను చిన్న రాష్ట్రాలకే పరిమితం కావడానికి రాహుల్ మాత్రమే కారణం కాదు. చాలా ఇతర కారణాలూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు అందుకు ఉదాహరణలు. నాయకత్వలోపం, వ్యూహం, కార్యాచరణలేమి, పడిపోతున్న విలువలతో చేజారిపోతున్న ప్రజాప్రతినిధులు, మీడియాపై గట్టి పట్టున్న బీజేపీ ప్రచారం... వెరసి కాంగ్రెస్ ప్రతిష్టను దిగజార్చాయి. పూర్వవైభవ సాధనకు మల్లగుల్లాలు కాంగ్రెస్ 1977లో, 1989లో ఓటమి పాలైనా ఇంతటి దయనీయ స్థితి ఏర్పడ లేదు. కాంగ్రెస్ రోజురోజుకూ ప్రజాదరణ కోల్పోవడానికి ప్రధాన కారణం పార్టీ అంతర్గత పరిస్థితేనని విశ్లేషకుల మాట. దేశంలోని ఏ ఎన్నికల్లోనైనా నేడు యువతదే కీలకపాత్ర. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలేప్రధాన ఆధారంగా కాంగ్రెస్ నిలబడుతూ వచ్చింది. వారి పేరు, ప్రఖ్యాతులు గానీ, కాంగ్రెస్ అధినాయకత్వం పెంచి పోషిస్తున్న ‘కోటరీ’ నాయకులు గానీ యువతను ప్రత్యక్షంగా ఉత్తేజపరచే వాతావరణం నేడు లేదు. మోదీ గుజరాత్లో బాగా పని చేశారనే నమ్మకంతో, దేశానికి ఆయన సేవలు అవసరమని నమ్మి యువత బీజేపీకి పట్టం కట్టింది. ప్రాంతీయంగా కూడా నాయకుల సేవల్ని ప్రత్యక్షంగా చూసే వారికి పట్టం కడుతున్నారు. బాగా పనిచేస్తేనో, ప్రభావం చూపేలా ప్రచారం చేయగలిగితేనో మరోసారి అధికారం ఇస్తున్నారు. 2014 ఎన్నికల ఓటమి దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని సడలించింది. పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఆ పార్టీని మరింత బలహీన పరిచాయి. 2013 నుంచి కాంగ్రెస్ క్రమంగాఅన్ని రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోతూ... కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలు నాలుగిటిలోనే సొంతంగా అధికారంలో ఉంది. బిహార్, మిజోరాం, మేఘాలయ, పుదుచ్చేరీల్లో ఇతర పార్టీలతో కలసి అధికారం పంచుకుంటోంది. 2013లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోగా 2014 తరువాత మహారాష్ట్ర, హరియాణా, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, కేరళ రాష్ట్రాల్లో ఓటమి పాలయింది. వివిధ ఎన్నికల్లో ఓటమికన్నా ప్రధానమైంది కాంగ్రెస్ ఓటింగ్ శాతాలు పడిపోతుండటం. దశాబ్దాలుగా ఓటు బ్యాంకు లుగా ఉన్న వర్గాలు క్రమంగా పార్టీకి దూరమవుతున్నాయి. సీఎస్డీఎస్ అధ్యయనం ప్రకారం, కాంగ్రెస్‌కు సాంప్రదాయకంగా అండగా ఉండే అల్పసంఖ్యాకవర్గాలు ప్రాంతీయ పార్టీల వైపు, పేద, దళిత వర్గాలు బీజేపీ వైపు మొగ్గుతున్నాయి. సర్వత్రా నాయకత్వ లోపం కాంగ్రెస్ అధ్యక్షునిగా రాహుల్ పగ్గాలు చేపట్టాలన్న నినాదాన్ని పలువురు నేతలు మరోసారి తెరపైకి తెస్తున్నారు. 2013 జైపూర్ ‘చింతన్ శిబిర్’లో రాహుల్‌ను ఉపాధ్యక్షుడ్ని చేసినా, 2014లో కాంగ్రెస్ ప్రచార సారథ్య బాధ్య తలు అప్పగించినా పార్టీ బలపడ్డ దాఖలాలు లేవు. త్వరలోనే ఏఐసీసీ సదస్సు జరిపి ఆయనకు నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారని వినవచ్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ నేతల రాజీనామాలను ఇప్పటికే తీసుకు న్నారు. పార్టీ ముఖ్యనేతగా రాహుల్ నిర్వహించిన పాత్ర ఏం లేదుగానీ ఆయన నేతృత్వంలోనే కేరళ, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ఎదురు దెబ్బలు తగిలాయి. నేర్చుకుంటే, పార్టీకి అసోం ఓ పెద్ద గుణపాఠం. 2014లో మల్లికార్జున్ ఖర్గే పార్టీ ప్రతినిధిగా అసోం వెళ్లగా 78లో 51మంది ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పును కోరారు. కానీ వీర విధేయతకే పెద్దపీఠం వేసిన నాయకత్వం వారి డిమాండ్‌ను పెడచెవిన పెట్టింది. తరుణ్ గొగోయ్‌పై పెరుగుతున్న వ్యతిరేకతను పట్టించుకోలేదు. సీఎం కుమారుడు గౌరవ్ గొగోయ్ రాహుల్ ‘బుల్లి కోటరీ’లో ముఖ్యుడు. అసోం పరిస్థితి బాగోలేదని 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనే స్పష్టమైనా సరిదిద్దుకునే చర్యలు చేపట్టక హేమంత్ బిశ్వశర్మ వంటి కీలక నాయకుడ్ని పోగొట్టుకుంది. బీజేపీకి ఆయనే పెద్ద వరం అయ్యారు. 2009లో అసోంలో 7 లోక్‌సభ స్థానాలున్న కాంగ్రెస్ 2014లో 3కు పడిపోగా, అప్పటివరకు 3 స్థానాలున్న బీజేపీ కూటమి బలం 7కు పెరిగింది. అయినా ముప్పును గ్రహించలేని కాంగ్రెస్ గుడ్డి వైఖరివల్ల తాజా ఎన్నికల్లో బీజేపీ 126లో 86 స్థానాలు గెలిచింది. ‘ఓ కీలక భేటీలో సీఎం, పీసీసీ నేత సమక్షంలో పార్టీ జీవన్మరణ సమస్యపై చర్చ జరుగుతుంటే... రాహుల్, సమావేశంలోకి తన పెంపుడు కుక్కకిచ్చిన ప్రాధాన్యతను ఆ చర్చకివ్వలేద’ని బిశ్వశర్మ విమర్శించారు. రాజ కీయ నాయకుల్నిగాక, రిటైర్డ్ అధికారుల సలహాలను పాటించడం వల్లనే రాహుల్ సరైన అంచనాకు రాలేకపోతున్నారనే అభిప్రాయముంది. అవినీతి కొంత, అసమర్థ నిర్వహణ ఇంకొంత హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇటీవలి వరకు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న ఉమెన్ చాందీపైనా అవినీతి ఆరోపణలొచ్చాయి. కాంగ్రెస్‌లోని బలమైన నేతలంతా ఆ పార్టీతో పొసగక ఎప్పుడో ఒకప్పుడు సొంత పార్టీలు పెట్టుకుని, బలమైన ప్రాంతీయ నేతలుగా ఎదిగారు. శరద్‌పవార్, మమతాబెనర్జీ, వై.ఎస్. జగన్మోహన్రెడ్డి వంటి నేతలకు సరితూగేలా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తమ నేతలను తయారు చేసుకోలేకపోయింది. నితీష్‌కుమార్, జయలలిత, ములాయంసింగ్, నవీన్ పట్నాయక్ తరహా నేతలనూ తయారు చేసుకోలేక పోయింది. బీజేపీ ఐదేళ్లు, పదేళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు ప్రజాదరణ పొందిన బలమైన నేతలుగా ఎదిగారు (ఛత్తీస్ గఢ్‌లో రమణ్‌సింగ్, మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్, రాజస్తాన్‌లో వసుంధర రాజే). ఇప్పుడున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఏ ఒక్కరూ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వారు కాకపోవడమూ ప్రతికూలాం శమే! ఒక్క కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అంతో ఇంతో ప్రజా దరణ ఉంది. కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాల్లోనూ నాయకుల మధ్య ఐక్యత లేదు. తెలంగాణలో ఎన్నికల ముందే కాదు తర్వాత కూడా ఎప్పు డెప్పుడు ముఖ్యమంత్రి అవుదామా? అని ఆలోచించే చాలామంది ఉంటారు. శాసనసభలో పార్టీకి ప్రాతినిధ్యమే లేకుండాపోయిన ఏపీలోనూ హైకమాండ్ అసమ్మతి పొగ పెడు తున్నట్టు వినవస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో అజిత్జోగీయే గాక, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో మూకుమ్మడిగా పార్టీ శాసన సభ్యులు పార్టీ మారడానికి కాంగ్రెస్ నాయకత్వ వైఖరే కారణం. ప్రాంతీయ శక్తులు అంగీకరించేనా? 2013 తరువాత దేశ రాజకీయాల్లో కనిపిస్తున్న స్పష్టమైన పరిణామాలు రెండు. ఒకటి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నచోట బీజేపీ ఆదిపత్యం సాధించి, తేలిగ్గా గెలుస్తోంది. అది గమనించే కావచ్చు ‘కాంగ్రెస్ రహిత భారత్’ అనే తమ నినాదాన్ని దేశ ప్రజలు ఎజెండాగా స్వీకరించారని, ఇక అదే లక్ష్యంతో పని చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గం తీర్మానించింది. అయితే, బీజేపీ సైతం ఏదైనా ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే ఓడిపోతోంది. రెండు, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట కాంగ్రెస్‌కు గానీ, బీజేపీకి గానీ స్థానం దొరకటం లేదు. ఢిల్లీ, బిహార్,బెంగాల్, తమిళనాడు అందుకు ఉదాహర ణలు. కాంగ్రెస్ తప్ప మరే పార్టీ బలంగా లేని మధ్యప్రదేశ్, రాజస్థాన్, అసోం, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌పై బీజేపీ అవలీలగా నెగ్గింది. అంటే కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తూ వస్తోంది, తాను అధికారంలో ఉన్న చోట నిలదొక్కు కుంటోందే గానీ ప్రాంతీయ పార్టీలను మాత్రం ఏమీ చేయలేకపోతోంది. భవిష్యత్తులో ఇదే సమీకరణం తలకిందులై బీజేపీ స్థానాన్ని కాంగ్రెస్ భర్తీ చేసినా చేయొచ్చు. అయితే కాంగ్రెస్ పడి లేచే కెర టంగా మారుతుందా? అంటే ఏమో...! కాదని చెప్పలేకపోయినా, అవునన గల ధీమా లేదు.. 2014 ఎన్నికలకు ఒక ఏడాది ముందువరకు బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అంతా భావించారు. కానీ, అకస్మాత్తుగా నరేంద్ర మోదీ తెరపైకి వచ్చారు. ఆ తదుపరి ఎన్నికల్లో ఎక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడ బీజేపీ గెలుస్తుండటాన్ని ప్రాంతీయ పార్టీలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తమకు మంచి అవకాశాలను కల్పించే రాజకీయ శూన్యత ఉందని అవి భావిస్తున్నాయి. 2019 ఎన్నికల కోసం వారంతా జట్టు కట్టే ఆస్కారం ఉంది. ఎన్డీఏకు వ్యతిరేక ఓట్లు చీలొద్దనుకుంటే అవి కాంగ్రెస్ వైపు చూడాల్సి రావచ్చు. కానీ, బలహీనపడుతున్న కాంగ్రెస్‌తో జట్టు కట్టడానికి అవి అంగీ కరిస్తాయా? అన్నది పెద్ద ప్రశ్న. లేకపోతే అవి కాంగ్రెస్ రహిత ప్రత్యామ్నాయ (మూడో) శక్తిగా ఆవిర్భవిస్తాయేమో వేచి చూడాల్సిందే. గత కొన్ని దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో వ్యతిరేక ఓటు ప్రభావం విపరీతంగా ఉంది. విధానాల్లో పెద్ద వ్యత్యాసం ఉండట్లేదు. విపక్షాలు నచ్చడం కన్నా, పాలకపక్షాల పట్ల వ్యతిరేకతే నిర్ణాయకంగా మారుతోంది. గాల్లో దీపంలా మినుకు మినుకుమంటున్న కాంగ్రెస్, అటువంటి ఆశావహ దృక్పథంతోనే ముందుకు సాగుతుందా? నిజంగానే పార్టీ పరిస్థితిని మెరుగు పరచుకోగలదా? అన్నది కాలమే తేల్చాలి. దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
'ఇది ప్రాంతీయ పార్టీల శకం'
- మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ బెంగళూరు : దేశంలో ప్రాంతీయ పార్టీల శకం ప్రారంభమైందని, ఇందుకు ఢిల్లీ ఎన్నికల ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణ అని మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీల శక్తి, సామర్థాలను తక్కువగా అంచనా వేసే జాతీయ పార్టీలకు ఈ ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠం లాంటివని అభిప్రాయపడ్డారు. మంగళవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీని చాలా తక్కువగా అంచనా వేసిన పార్టీలు ఢిల్లీ ఎన్నికల్లో భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇక ఇదే సందర్భంలో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన ఆప్ నేత కేజ్రీవాల్‌కు అభినందనలు తెలియజేశారు. -
సంకీర్ణ కిరీటం ఎవరిది?
ఎన్డీయే, థర్డ్‌ఫ్రంట్, యూపీఏల ఆశలు చక్రం తిప్పనున్న ప్రాంతీయ పార్టీలు న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 12తో పూర్తవనుండటంతో ఇక అందరి చూపు 16న వెలువడే ఫలితాలపై పడనుంది. దేశంలో గత 20 ఏళ్లుగా ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రంలో ఈసారి కూడా సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనేది అందిరికీ తెలిసిన విషయమే అయినా కూటమి సర్కారుకు సారథ్యం ఎవరిదన్న అంశంపైనే ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్డీయే అవకాశాలు ఎంత? ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 190 నుంచి 290 వరకు సీట్లు దక్కుతాయని ఎన్నికలకు ముందు వివిధ సర్వేలు అంచనా వేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువని చెప్పొచ్చు. అయితే ఒకవేళ ఈ అంచనాలు తప్పి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 సీట్ల సంఖ్యాబలానికి ఎన్డేయే ఆమడ దూరంలో నిలిస్తే మాత్రం కొత్త పొత్తులు అవసరమవుతాయని రాజకీయ వర్గాల విశ్లేషణ. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్‌కు 10 నుంచి 40 సీట్లు తక్కువ పడితే ఎన్డీయేకు చిన్న చిన్న పార్టీలను మచ్చిక చేసుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో మొత్తం 25 పార్టీలు ఉన్నాయి. వీటికి తోడుగా బీజేడీ, డీఎంకే వంటి పార్టీల మద్దతు కోరే అవకాశం ఉంది. ఇక 40 నుంచి 80 సీట్లు తక్కువైన సందర్భంలో పెద్ద పార్టీల మద్దతు తప్పనిసరవుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ సీట్లు సాధిస్తాయన్న అంచనాలు ఉన్న పార్టీలను మద్దతు కోరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ, తెలంగాణలో టీఆర్ఎస్తోపాటు అన్నాడీఎంకే, బీఎస్పీ వంటి కీలక ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేకు మద్దతిచ్చే అవకాశాలు కనిపించడంలేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో 2016లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతున్న అధికార అన్నాడీఎంకే 10 శాతం ఉన్న మైనారిటీల ఓట్లను పణంగాపెట్టి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. ఎన్డీయేకు మద్దతివ్వబోమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పగా తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ సైతం ఎన్డీయేకు మద్దతిచ్చే ప్రసక్తేలేదని శుక్రవారం స్పష్టం చేశాయి. బీఎస్పీ తరఫున ఆ పార్టీ చీఫ్ మాయావతి, తృణమూల్ తరఫున ఆ పార్టీ అధికార ప్రతినిధి దీపక్ ఓబ్రీన్ ఈ మేరకు ప్రకటన చేశారు. కానీ పెద్ద పార్టీల మద్దతు తప్పనిసరైన పక్షంలో నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని త్యాగం చేసి ఎల్.కె.అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్ వంటి నేతలు ప్రధాని రేసులోకి వస్తే తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు ఎన్డీయేకు మద్దతివ్వొచ్చని రాజకీయ పరిశీలకుల అంచనా. దేశాభివృద్ధి కోసం ఏ పార్టీ మద్దతునైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, రాజకీయ అస్పృశ్యతపై తమకు విశ్వాసం లేదని మోడీకి అత్యంత సన్నిహితుడు, బీజేపీ నేత అమిత్ షా శుక్రవారం ప్రకటించడం ఈ వాదనకు బలం చేకూర్చేలా కనిపిస్తోంది. మూడో కూటమి ముచ్చట తీరేనా.. సార్వత్రిక ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు మూడో కూటమి సిద్ధమవుతూనే ఉంటుంది. కానీ అధికారం అందుకోలేకపోతోంది. అయితే ఈసారి ప్రాంతీయ పార్టీలు తమ ప్రాంతాల ప్రజల ఆశలను గెలిపించేందుకు మూడో కూటమి వైపు మొగ్గుచూపుతుండటమే కాకుండా.. కాంగ్రెస్ సైతం తనకు అధికారం దక్కనప్పుడు మూడో కూటమికైనా మద్దతిచ్చేందుకు సిద్ధమవుతుండడం తాజా విశేషం. లెఫ్ట్ పార్టీలు, ఎస్పీ, అన్నాడీఎంకే, జేడీ(యూ), బీజేడీ, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇవన్నీ కలిసి మూడో ఫ్రంట్‌గా ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇందులో లెఫ్ట్ పార్టీలు రాకుంటే తృణమూల్ కాంగ్రెస్, అన్నాడీఎంకే రాకుంటే డీఎంకే ఈ కూటమిలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ మద్దతిస్తే మూడో కూటమికి అధికారం సులువవుతుంది. అలా మూడో కూటమికి అవకాశం దక్కే పక్షంలో ములాయంసింగ్ యాదవ్, జయలలిత, మమతా బెనర్జీ ప్రధాని రేసులో ముందుండే అవకాశం ఉంది. యూపీఏ-3కు అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీకి 2004లో కేవలం 145 సీట్లు దక్కినా యూపీఏ కూటమికి నేతృత్వం వహించి ఐదేళ్లు పాలించింది. ఇప్పుడు కూడా 150 సీట్లు దక్కినా దేశాన్ని పాలిస్తామన్న ధీమాలో ఆ పార్టీ ఉంది. కానీ సర్వేలన్నీ యూపీఏకు 85 నుంచి 140 మధ్యే సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో యూపీఏ అధికారంలోకి రావడానికి అతితక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎన్డీయేకు అధికారం దక్కడం సులువవని పక్షంలో యూపీఏ కూడా అధికారం దక్కించుకునే ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం ఉంది. మూడో కూటమివైపు చూస్తున్న పార్టీలు... ఆ కూటమిలో అవకాశం దక్కని పక్షంలో చివరకు యూపీఏవైపే మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కూటమిలో లుకలుకలు ఏర్పడి.. ఆ కూటమిలోని పార్టీలు యూపీఏకు మద్దతిచ్చేందుకు ముందుకు వస్తే.. మళ్లీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మూడోసారి పాలించే అవకాశం ఉంది. -
2 నెలల పార్టీకి 5 ఏళ్ల అధికారం
స్థాపించిన రెండు నెలలకే అధికారాన్ని కైవసం చేసుకున్న ఘనత దేశంలోని ఏ జాతీయ పార్టీకీ లేదు. అయితే, ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన అసోం. గణ పరిషత్ (ఏజీపీ) 1985 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఘనత సాధించింది. ఏజీపీ 1985 అక్టోబర్‌లో ప్రారంభం కాగా, అదే ఏడాది డిసెంబర్లో అసోం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో విజయం సాధించిన ఆ పార్టీ ప్రఫుల్లకుమార్ మహంతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. -
ప్రాంతీయమే చక్రం తిప్పేది
వీటి సారథ్యంలో సంకీర్ణ సర్కారుకూ అవకాశం 200 పైచిలుకు స్థానాలు గెల్చుకునే ఛాన్స్ లాభించనున్న సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్ కీలకం కానున్న తృణమూల్ కాంగ్రెస్, అన్నా డీఎంకే, వైఎస్సార్సీపీ ఒడిశాలో ఎదురులేని బీజేడీ.. నవీన్ పట్నాయక్ వైపే ప్రజల మొగ్గు మొత్తమ్మీద బీజేపీ 200లోపు, కాంగ్రెస్‌కు 100 సీట్లకు అటూఇటుగా రావొచ్చంటున్న సర్వేలు దేశవ్యాప్తంగా ‘ప్రాంతీయ’ ప్రాభవం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఈసారి ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పనున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన పలు సర్వేల అంచనాల ప్రకారం ఎన్డీఏకు సారథ్యం వహిస్తున్న బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో గరిష్టంగా రెండు వందల స్థానాలకు మించి లభించే అవకాశాల్లేవు. పదేళ్లుగా యూపీఏ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌కు వందకు అటూ ఇటుగా మాత్రమే సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలన్నింటి ఉమ్మడి స్కోరు 200 దాటడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ గద్దెపై ఎవరిని కూర్చోబెట్టాలో నిర్ణయించేది ప్రాంతీయ పార్టీలే. బీజేపీ విషయంలో సర్వేల అంచనాలు తారుమారైతే, కేంద్రంలో ప్రాంతీయ పార్టీల సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా ఆశ్చర్యమేమీ ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ స్థానాలను దక్కించుకున్న ప్రాంతీయ పార్టీలు కీలకంగా పరిణమించే అవకాశాలు ఉంటాయి. తృణమూల్ అధినాయకురాలు మమతా బెనర్జీ.. ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్, తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినాయకురాలు జయలలిత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంటి నేతలు కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మమత, నవీన్, జయలలిత ఇప్పటికే తమ తమ రాష్ట్రాల్లో అధికారంలో ఉండటంతో పాటు, ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు వారికి పూర్తి సానుకూలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు ప్రజాదరణ పుష్కలంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, మహారాష్ట్రలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీహార్‌లో లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, తమిళనాడులో కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే కొంత బలహీనపడ్డా, పూర్తిగా ఉనికిలో లేకుండా పోయే పరిస్థితులు లేవు. ఈ తరుణంలో ప్రాంతీయ పార్టీల బలాబలాలు, ఎన్నికల తర్వాత వాటి ముందుండే అవకాశాలపై ఫోకస్... వైఎస్సార్సీపీ హవా వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీవూంధ్ర ప్రాంతంలోనే 20 స్థానాలకు అటూ ఇటుగా ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని ఎన్నికల సర్వేలన్నీ చెబుతున్నారుు. ఎన్నికల తర్వాత వుూడో ఫ్రంట్కే వుద్దతిస్తావుని పార్టీ ఇదివరకే ప్రకటించింది. మోడీ సవుర్థ పాలకుడని ప్రశంసించినా, ఎన్డీఏకు వుద్దతిస్తావుని పార్టీ నాయుకత్వం ఇంతవరకు ప్రకటించలేదు. జయకు జై... ప్రధాని పదవిపై ఆశలున్నాయుని చెబుతున్న వురో ప్రాంతీయు పార్టీ నేత తమిళనాడు వుుఖ్యవుంత్రి జయులలిత. ఆమె నాయుకత్వం లోని అన్నాడీఎంకేకు తమిళనాడు, పుదుచ్చేరిల్లోని మొత్తం 40 (39+1) సీట్లలో అత్యధికంగా 20-25 మధ్య రావచ్చని అంచనా. మొదట రెండు కవుూ్యనిస్టు పార్టీలతో పొత్తుకు ప్రయుత్నించి విఫలమైన అన్నాడీఎంకే చివరికి ఈ ఎన్నికల్లో కూడా జాతీయు పార్టీలతో పొత్తు లేకుండానే పోటీకి సిద్ధమైంది. 1998లో రెండో ఎన్డీఏ సర్కారుకు వుద్దతు ఉపసంహరించుకున్నాక అన్నాడీఎంకే వుళ్లీ ఇంతవరకు కేంద్రం లో అధికారం పంచుకోలేదు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో ఉన్న సత్సంబంధాల కారణంగా అవసరమైతే జయు ఎన్డీఏకు వుద్దతు ఇచ్చి అధికారంలో వాటా తీసుకునే అవకాశాలున్నారుు. కాంగ్రెస్, వావుపక్షాలతో గతంలో ఉన్న సంబంధాలు వురోసారి వుూడో ఫ్రంట్‌లో చేరడానికి దారితీయొచ్చు. తమిళనాట ప్రధాన ప్రతిపక్షం డీఎంకే బలహీనపడడం, రెండు ప్రధాన జాతీయు పార్టీలకు ఇక్కడ పొత్తులు లేకపోవడం అన్నాడీఎంకే బలం 20 సీట్లు దాటడానికి అవకాశమిస్తున్నారుు. చాంపియన్... టీఎంసీ 16వ లోక్‌సభలో అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా తృణవుూల్ కాంగ్రెస్ అవతరించేలా కన్పిస్తోంది. ఈ పార్టీకి దాదాపు 30 సీట్లు దాటొచ్చని సర్వేలు చెబుతున్నారుు. పశ్చివు బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ తన ప్రధాన ప్రత్యర్థి సీపీఎం భాగస్వామిగా ఉన్న వుూడో కూటమిలో చేరే అవకాశం లేదు. అలాగే తప్పనిసరైతే తప్ప కాంగ్రెస్ నేతృత్వంలోని యుూపీఏలో వుళ్లీ చేరకపోవచ్చు. తన వుద్దతు కీలకమైన పక్షంలో ఎన్డీఏతో చేతులు కలపడానికి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి అభ్యంతరం ఉండకపోవచ్చు. తానూ ప్రధాని పదవి రేసులో ఉన్నానంటూ పార్టీ శ్రేణులు చేస్తున్న ప్రచారాన్ని ఆమె ప్రోత్సహిస్తున్నా, అది కేవలం సొంత రాష్ట్రంలో బలం పెంచుకోవడానికే. తనకు ఆ అవకాశం అంత తేలికగా రాదనే వాస్తవం మమతకూ తెలుసు. ఎన్డీఏకు తగినన్ని సీట్లు రాకపోతే కాంగ్రెస్, వావుపక్షాలు కీలకపాత్ర పోషించే తృతీయు ఫ్రంట్‌లో టీఎంసీ చేరికకు వీలు లేదనే చెప్పాలి. అసోం, త్రిపురల్లో కూడా పోటీ చేస్తున్నా, ఈ పార్టీకి వచ్చే సీట్లన్నీ బెంగాల్ నుంచేనని చెప్పవచ్చు. ఎస్పీ కుదేలే ఉత్తరప్రదేశ్‌లో అధికార పక్షమైన సవూజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) 2009 ఎన్నికల్లో 23 లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. ఈసారి అది 13కు పరిమితం కావచ్చని సర్వేలన్నీ చెబుతున్నారుు. కొడుకు అఖిలేశ్ పాలనలో ప్రజాదరణ కోల్పోరుున పార్టీ వురింత బలహీనపడకుండా ఆపడానికి ఎస్పీ అధినేత వుులాయుంసింగ్ యూదవ్ చేస్తున్న ప్రయుత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. యుూపీఏకు అవసరమైన పక్షంలో గతంలో లాగే బయుటి నుంచి వుద్దతివ్వడానికి ఎస్పీ వుుందుకు రావచ్చు. ఒకవేళ కాంగ్రెస్ బలం తగ్గి, వుూడో ఫ్రంట్ సర్కారు ఏర్పాటుకు అవకాశ మొస్తే వుులాయుం సహజంగానే ఆ ప్రయుత్నాలకు వుద్దతిస్తారు. జేడీ(యుూ)కు కష్ట కాలమే బీహార్‌లో అధికారంలో ఉన్న జేడీ(యుూ), మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో ఎన్డీఏ నుంచి వైదొలిగింది. అలా బీజేపీతో పదిహేనేళ్ల పొత్తును తెంచుకుంది. మోడీ ప్రభంజనం నిజంగా పనిచేస్తే బీహార్‌లో జేడీ(యుూ) గెలిచే లోక్‌సభ సీట్ల సంఖ్య ఐదుకు పడిపోవచ్చు. 2009లో ఆ పార్టీకి 20 సీట్లు రావడానికి బీజేపీతో పొత్తు ఉపకరించింది. ఈసారి రెండు ప్రధాన జాతీయు పార్టీలతో పొత్తు లేకుండా జేడీ(యూ) వుూడో ఫ్రంట్‌లో చేరింది. కవుూ్యనిస్టు పార్టీలతో ఉన్న సీట్ల సర్దుబాటు వల్ల దానికి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎన్నికల తర్వాత ఎన్డీఏ బలం ఊహించిన విధంగా పెరగకపోతే జేడీ(యుూ) నేత, బీహార్ సీఎం నితీశ్ యుూపీఏకు వుద్దతు ఇవ్వవచ్చు. సర్వేలను బట్టి చూస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో బలం బాగా తగ్గే అవకాశవుున్న పార్టీగా జేడీ(యుూ)ను భావించవచ్చు. బలం తగ్గనున్న బీఎస్పీ రెండేళ్ల క్రితం యుూపీలో అధికారం కోల్పోరుున బహుజన్ సవూజ్ పార్టీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకునే అవకాశాలు లేవనే సర్వేలన్నీ చెబుతున్నారుు. అంతేగాక మోడీ ప్రభంజనం ఫలితంగా ఎస్పీతో పాటు బీఎస్పీ బలం కూడా తగ్గిపోతుందం టున్నాయి. గరిష్టంగా 15-18 లోక్‌సభ సీట్లు దక్కవచ్చని అంచనా వేస్తున్నారుు. బీఎస్పీకి ప్రస్తుతం 21 స్థానాలున్నాయి. మరీ అవసరమైతే తప్ప బీఎస్పీ అధినేత్రి వూయూవతి ఎన్డీఏకు వుద్దతివ్వక పోవచ్చు. ఎస్పీ భాగస్వామిగా ఉండే వుూడో ఫ్రంట్ సర్కారు ఏర్పాటు చేసేందుకు కూడా ఆమె సాయుపడే అవకాశం లేదు. టీఆర్ఎస్ జోరు! ప్రత్యేక తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్కు ఈసారి 10-12 లోక్‌సభ సీట్ల దాకా రావచ్చని సర్వేల అంచనా. యుూపీఏతో పాత సంబంధాలున్న ఈ పార్టీ ఎన్నికల తర్వాత అవసరమైతే దానికి వుద్దతిస్తానని చెబుతోంది. ఇప్పటికి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోలేదు. ఎన్నికల తర్వాత బీజేపీ నాయుకత్వంలోని ఎన్డీఏకు కేసీఆర్ వుద్దతు ఇచ్చే ఆస్కారం లేకపోలేదు. అలాగాక కాంగ్రెస్ బలం బాగా తగ్గి, ఎన్డీఏ పుంజు కోకపోతే వుూడో ఫ్రంట్‌కు వుద్దతిచ్చే అవకాశవుుంది. బీజేడీకి ఏకపక్షం! ఒడిశాలో 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్‌కు ఈసారి 17 సీట్లు రావచ్చని సర్వేలు చెబుతున్నారుు. కాంగ్రెస్, బీజేపీలు ఏవూత్రం పుంజుకోకపోవడమే బీజేడీ నిలదొక్కు కోవడానికి కారణవుని చెప్పొచ్చు. ఈ ఐదేళ్లలో ఎందరో పెద్ద నేతలు బీజేడీ నుంచి వైదొలిగినా వుుఖ్యవుంత్రి నవీన్ పట్నాయుక్ పాలన, ప్రజలకు వురో ప్రత్యావ్నూయుం లేకపోవడం కారణంగా ఈ ఎన్నికల్లో బీజేడీ స్కోరు 15కు తగ్గకపోవచ్చు. ఒడిశా రాజకీయూల దృష్ట్యా కేంద్రంలో కాంగ్రెస్‌తో బీజేడీ చేతులు కలిపే చాన్సే లేదు. ఈ పార్టీ ప్రస్తుతం ఏ కూటమిలోనూ లేకున్నా ఎన్నికల తర్వాత వీలును బట్టి ఎన్డీఏలోనో, వుూడో ఫ్రంట్లోనో చేరవచ్చు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే ఒడిశాలో కూడా లోక్‌సభతో పాటు అసెంబ్లీకీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ బరిలో కాంగ్రెస్, బీజేడీలే ప్రధాన తెలుగుదేశం 15వ లోక్‌సభలో ఆరుగురు సభ్యులున్న తెలుగు దేశం బలం ఈసారి కూడా అటూఇటుగా అంతే ఉండొచ్చని సర్వేలంటున్నారుు. బీజేపీతో టీడీపీకి పొత్తుంటుందని కొద్ది నెలలుగా ఊహాగానాలు సాగుతున్నారుు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఎన్డీఏలో చేరే అవకాశాలే కనిపి స్తున్నారుు. సంక్షోభంలో డీఎంకే గతంలో ఎన్డీఏ, యుూపీఏ-1,2 సర్కార్లలో భాగస్వామిగా ఉన్న ఈ తమిళనాడు ప్రాంతీయుపార్టీ ఇప్పుడు రెండు ప్రధాన జాతీయు పార్టీలతోనూ పొత్తు లేకుండా పోటీ చేస్తోంది. వుూడేళ్ల క్రితం అధికారం కోల్పోయూక ఎన్నడూ లేనన్ని కష్టాల్లో వుునిగి ఉంది. ప్రస్తుత సర్వేల ప్రకారం డీఎంకేకు లోక్‌సభ ఎన్నికల్లో 10 సీట్లు మించి రాకపోవచ్చు. డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఈ వుధ్యనే మోడీకి సానుకూలంగా వూట్లాడారు. ఒకవేళ అన్నాడీఎంకే వుద్దతు ఎన్డీఏకు లభించకపోతే డీఎంకేకు ఆ అవకాశం రావచ్చు. వుూడో ఫ్రంట్ పార్టీలతో పాత సంబంధాల కారణంగా ఆ ఫ్రంట్‌లోనూ చేరే వీలుంది. మొత్తమ్మీద గడ్డుస్థితిలో ఉన్న ఈ పార్టీకి కేంద్రంలో అధికారం పంచుకునే అవకాశం తక్కువే. 2జీ స్పెక్ట్రం కుంభకోణం డీఎంకేను బాగా దెబ్బ తీసింది. ఆటలో అరటిపండు జేడీ(ఎస్)... ఇటీవల వుూడో ఫ్రంట్‌లో చేరిన ప్రాంతీయుపార్టీల్లో చిన్న పార్టీ వూజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ నేతృత్వం లోని జేడీ(ఎస్). 2009లో 3 సీట్లు గెలుచుకున్న ఈ పార్టీ ఈసారి 2కే పరిమితవతుందని అంచనా. కర్ణాటకలో బీజేపీతో ఉన్న అనుభవాల కారణంగా ఎన్డీఏతో చేతులు కలిపే అవకాశాల్లేవు. వుూడో కూటమితో కలిసి పని చేయుడం మినహా వురో ప్రత్యావ్నూయుం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు లేకుండానే బరిలో దిగుతోంది. ఎన్సీపీకి ఎదురు గాలి 13 ఏళ్లుగా వుహారాష్ట్రలో కాంగ్రెస్‌తో అధికారం పంచుకుంటూ పదేళ్లుగా కేంద్రంలో యుూపీఏ భాగస్వామిగా కొనసాగుతున్న ప్రాంతీయు పార్టీ ఎన్సీపీ. శరద్‌పవార్ నేతృత్వంలోని ఈ పార్టీ 2009లో 8 లోక్‌సభ సీట్లు గెలిచింది. ఈసారి 5కే పరిమితవతుందని అంచనా. ఈ ఎన్నికల్లో యుూపీఏ బలం బాగా తగ్గినా ఎన్డీఏ పక్షాన చేరే అవకాశాలు తక్కువే. పవార్ ఈ వుధ్య బీజేపీకి, మోడీకి అనుకూలంగా వూట్లా డినా వుహారాష్ట్ర రాజకీయూల కారణంగా ఆ పార్టీతో చేతులు కలిపే పరిస్థితి రాకపో ఆర్జేడీ... అంతంతే యుూపీఏ-1 సర్కారులో భాగస్వామిగా ఉండి, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దూరమైన పార్టీ ఆర్జేడీ. ఫలితంగా అప్పుడు దీనికి 4 సీట్లే వచ్చారుు. దాణా స్కాంలో దోషిగా తేలడంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ సంక్షోభంలో చిక్కుకున్నారు. ఈసారి కాంగ్రెస్‌తో పొత్తు కుదిరినా ఆర్జేడీ బలం 4 నుంచి పెద్దగా పెరిగే అవకాశాల్లేవని సర్వేలు చెబుతున్నారుు. ఎల్జేపీ ఈసారి బీజేపీతో చేతులు కలపడంతో లాలూ పరిస్థితి బలహీనపడింది. ఆయనపై కోర్టు కేసులు, బీహార్ రాజకీయూల కారణంగా ఆర్జేడీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పక్షానే ఉంటుంది. ‘చిక్కి’పోనున్న వావుపక్షాలు సీపీఐ, సీపీఎం నేతృత్వంలోని వామపక్షాల బలం 2009 లోక్ సభ ఎన్నికల్లో గణనీయుంగా పడిపోరుుంది. పశ్చివు బెంగాల్ లో ప్రధాన ప్రత్యర్థి తృణవుూల్ కాంగ్రెస్ బలం వురింత పెరిగి, కేరళలోనూ తగినంతగా పుంజుకోక పోతే ఈసారి వావుపక్షాలు వురింత బలహీన పడవచ్చు. అదే జరగవచ్చని ఎన్నికల సర్వేల న్నీ చెబుతున్నారుు. లోక్‌సభలో వామపక్ష కూటమి బలం ప్రస్తుతమున్న 24 స్థానాల నుంచి బాగా తగ్గిపోయేలా ఉంది. బీజేపీ పెద్దగా పుంజుకోకుండా, యుూపీఏకు తవు వుద్దతు అవసరమైన పక్షంలో వావుపక్షాలు అందుకు సిద్ధపడవచ్చు. కుదిరితే తృతీయు ఫ్రంట్ సర్కారు ఏర్పాటుకు సాయుపడవచ్చు. -
2014లో సత్తా చాటనున్న ప్రాంతీయపార్టీలు
-
కింగ్ మేకర్లు ప్రాంతీయ పార్టీలే!
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలదే అత్యంత కీలకపాత్ర కానుందని తాజాగా నిర్వహించిన ఎన్నికల సర్వే ఫలితాలు జోస్యం చెప్తున్నాయి. అధికార యూపీఏ కానీ, ప్రతిపక్ష బీజేపీ కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యా బలం సాధించలేవని.. ఈ రెండు కూటములకూ వెలుపల ఉన్న వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలే అత్యధిక స్థానాలు గెలుచుకుంటాయనేది సర్వే సారాంశం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ దారుణంగా దెబ్బతింటుందని.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గణనీయంగా బలం పుంజుకుంటుందని సర్వే చెప్తోంది. ఆ ఫలితాల ప్రకారం.. 543 సీట్లున్న లోక్‌సభలో బీజేపీ, శివసేన, అకాలీదళ్, ఆర్పీఐ (అథవాలే), మేఘాలయ ఎన్సీపీ, హర్యానా జన్హిత్ కాంగ్రెస్‌లతో కూడిన ఎన్డీఏ 186 సీట్లు సాధిస్తుంది. అలాగే.. కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్ఎల్డీ, జేఎంఎం, ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, కేరళ కాంగ్రెస్ (మణి)లతో కూడిన యూపీఏ కూటమి కేవలం 117 సీట్లకు మాత్రమే పరిమితమవుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 240 సీట్లు గెలుచుకున్న ‘ఇతర పార్టీల’ పాత్ర అత్యంత కీలకం కానుంది. ఈ విభాగంలో ప్రధానంగా వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలైన బీఎస్పీ, ఎస్పీ, అన్నాడీఎంకే, తృణమూల్, వైఎస్సార్‌కాంగ్రెస్, టీఆర్ఎస్, ఆర్జేడీ, బీజేడీ వంటి పార్టీలు ఉన్నాయి.