దేశంలో ప్రాంతీయ పార్టీల శకం ప్రారంభమైందని, ఇందుకు ఢిల్లీ ఎన్నికల ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణ అని మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ పేర్కొన్నారు.
- మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ
బెంగళూరు : దేశంలో ప్రాంతీయ పార్టీల శకం ప్రారంభమైందని, ఇందుకు ఢిల్లీ ఎన్నికల ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణ అని మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీల శక్తి, సామర్థాలను తక్కువగా అంచనా వేసే జాతీయ పార్టీలకు ఈ ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠం లాంటివని అభిప్రాయపడ్డారు. మంగళవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీని చాలా తక్కువగా అంచనా వేసిన పార్టీలు ఢిల్లీ ఎన్నికల్లో భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇక ఇదే సందర్భంలో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన ఆప్ నేత కేజ్రీవాల్‌కు అభినందనలు తెలియజేశారు.