నమ్రతా బాటలోనే మహేశ్ బాబు హీరోయిన్.. ఏంటా నిర్ణయం! | Amrita Rao actress who quit acting after marriage acts in Athidhi Movie | Sakshi
Sakshi News home page

Amrita Rao: స్టార్ హీరోలతో సినిమాలు.. ఆ ఒక్క కారణంతో గుడ్‌బై!!

Published Thu, Sep 21 2023 2:15 PM | Last Updated on Thu, Sep 21 2023 2:33 PM

Amrita Rao actress who quit acting after marriage acts in Athidhi Movie - Sakshi

చాలామంది హీరోయిన్స్ పలు కారణాలతో కెరీర్‌కు గుడ్‌బై చెప్పేస్తుంటారు. కొందరు అవకాశాలు తగ్గిపోయి.. మరికొందరేమో ఫేమ్ రాక మధ్యలోనే ఈ ఫీల్డ్‌ను వదిలేసిన వారు కూడా ఉన్నారు. కానీ సూపర్ హిట్‌ సినిమాల్లో నటించినప్పటికీ కొందరు అర్ధాంతరందా కెరీర్‌ను ముగిస్తుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్‌లో మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఒకరు. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాకు బైబై చెప్పేసింది. ఇక అలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకున్న హీరోయిన్‌ మరొకరు ఉన్నారు. ఆమెనే బాలీవుడ్ హీరోయిన్ అమృత రావు. 

(ఇది చదవండి: జవాన్‌ డైరెక్టర్‌పై నయన్ అసంతృప్తి.. కారణం అదేనా..!!)

2002లో అబ్ కే బరాస్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ హీరోయిన్ అమృత రావు. 2003లో అమృతారావు షాహిద్ కపూర్ సరసన ఇష్క్ విష్క్‌లో నటించింది. ఆ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. షాహిద్ కపూర్‌తో మూడు చిత్రాల్లో నటించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఆ తర్వాత షారుఖ్ ఖాన్‌తో మై హూనా, సన్నీ డియోల్‌తో సింగ్ సాహెబ్ ది గ్రేట్, అజయ్ దేవగన్‌తో ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ నటించారు. అంతే కాకుండా ప్యారే మోహన్, మస్తీ, జాలీ ఎల్‌ఎల్‌బి  చిత్రాల్లో నటించారు. టాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేసిన భామ మహేశ్ బాబు సరసన అతిథి చిత్రంలో హీరోయిన్‌గా అలరించింది.  అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే అనూహ్యంగా సినిమాల నుంచి తప్పుకున్నారు. కారణం ఆమెకు పెళ్లి కావడమే. 

(ఇది చదవండి: సైమా వేడుక.. మంచు లక్ష్మికే కోపం తెప్పించాడు..!!)

మే 15న 2016లో రేడియో జాకీ అన్‌మోల్‌ అనే వ్యక్తిని పెళ్లాడిన అమృత రావు సినిమాలను పూర్తిగా వదిలేశారు. ఈ జంటకు ఓ కుమారుడు కూడా జన్మించారు. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి పలికిన అమృతారావు.. ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ముంబయిలో పుట్టి పెరిగిన అమృతరావు మోడలింగ్‌లో అడుగుపెట్టింది. కాగా.. ఆమె చెల్లెలు ప్రీతికా రావు కూడా నటిగా రాణిస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement