Amrita Rao
-
నమ్రతా బాటలోనే మహేశ్ బాబు హీరోయిన్.. ఏంటా నిర్ణయం!
చాలామంది హీరోయిన్స్ పలు కారణాలతో కెరీర్‌కు గుడ్‌బై చెప్పేస్తుంటారు. కొందరు అవకాశాలు తగ్గిపోయి.. మరికొందరేమో ఫేమ్ రాక మధ్యలోనే ఈ ఫీల్డ్‌ను వదిలేసిన వారు కూడా ఉన్నారు. కానీ సూపర్ హిట్ సినిమాల్లో నటించినప్పటికీ కొందరు అర్ధాంతరందా కెరీర్‌ను ముగిస్తుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్లో మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఒకరు. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాకు బైబై చెప్పేసింది. ఇక అలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకున్న హీరోయిన్ మరొకరు ఉన్నారు. ఆమెనే బాలీవుడ్ హీరోయిన్ అమృత రావు. (ఇది చదవండి: జవాన్ డైరెక్టర్‌పై నయన్ అసంతృప్తి.. కారణం అదేనా..!!) 2002లో అబ్ కే బరాస్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ హీరోయిన్ అమృత రావు. 2003లో అమృతారావు షాహిద్ కపూర్ సరసన ఇష్క్ విష్క్‌లో నటించింది. ఆ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. షాహిద్ కపూర్‌తో మూడు చిత్రాల్లో నటించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఆ తర్వాత షారుఖ్ ఖాన్‌తో మై హూనా, సన్నీ డియోల్‌తో సింగ్ సాహెబ్ ది గ్రేట్, అజయ్ దేవగన్‌తో ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ నటించారు. అంతే కాకుండా ప్యారే మోహన్, మస్తీ, జాలీ ఎల్ఎల్బి చిత్రాల్లో నటించారు. టాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేసిన భామ మహేశ్ బాబు సరసన అతిథి చిత్రంలో హీరోయిన్గా అలరించింది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే అనూహ్యంగా సినిమాల నుంచి తప్పుకున్నారు. కారణం ఆమెకు పెళ్లి కావడమే. (ఇది చదవండి: సైమా వేడుక.. మంచు లక్ష్మికే కోపం తెప్పించాడు..!!) మే 15న 2016లో రేడియో జాకీ అన్మోల్ అనే వ్యక్తిని పెళ్లాడిన అమృత రావు సినిమాలను పూర్తిగా వదిలేశారు. ఈ జంటకు ఓ కుమారుడు కూడా జన్మించారు. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి పలికిన అమృతారావు.. ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ముంబయిలో పుట్టి పెరిగిన అమృతరావు మోడలింగ్‌లో అడుగుపెట్టింది. కాగా.. ఆమె చెల్లెలు ప్రీతికా రావు కూడా నటిగా రాణిస్తోంది. -
లక్షన్నరలో హీరోయిన్ వివాహం.. పెళ్లి చీర రూ.3 వేలు మాత్రమేనట!
పెళ్లి అనేది మన జీవితంలో ఓ మధురమైన ఘట్టం. అందుకే గుర్తిండిపోయేలా చాలా అట్టహాసంగా పెళ్లి తంతు జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు. పేదవాడు సైతం తన స్తోమతకు మించి ఖర్చు చేసి పెళ్లి చేసుకుంటాడు. ఇక సెలబ్రిటీల పెళ్లి గురించి చెప్పనక్కర్లేదు. కోట్లలో ఖర్చు చేసి అందరూ చర్చించుకునేలా అట్టహాసంగా తమ పెళ్లి జరుపుకుంటారు. కానీ బాలీవుడ్ బ్యూటీ అమృతా రావు మాత్రం అందుకు తాము మినహాయింపు అంటుంది. కేవలం లక్షన్నర రూపాయల్లో తమ పెళ్లి జరిగిపోయిందటుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2016లో ఆర్జే అన్ మోల్ ను ను అమృతా రావు పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమ పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘కొద్దిమంది దగ్గరి బంధువులు, మిత్రుల సమక్షంలోనే మా పెళ్లి జరిగింది. పెళ్లి తంతు కోసం మేం కేలవం రూ. 1.5లక్షలు మాత్రమే ఖర్చు చేశాం. పెళ్లి బట్టలు, ప్రయాణ ఖర్చులు, కల్యాణ వేదిక.. ఇవన్నీ ఆ డబ్బుతోనే సర్దుకున్నాం. పెళ్లికి నేను ధరించిన చీర ధర కేవలం రూ.3000 మాత్రమే. (చదవండి: ఆ దేవుడు నన్ను కరుణించలేదు: జబర్దస్త్ యాంకర్ ఎమోషనల్) పెళ్లి వేదిక కోసం రూ. 11 వేలు ఖర్చు చేశాం. భోజనాలు, ప్రయాణ ఖర్చులతో కలిపి మొత్తం లక్షన్నరలో మా పెళ్లి జరిగిపోయింది’అని అమృతా రావు చెప్పుకొచ్చింది. 2002లో ‘అబ్ కే బరాస్’ చిత్రంతో హీరోయిన్గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అమృతా రావు. మహేశ్ బాబు ‘అతిథి’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీతో గడిపేస్తుంది. -
మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్న రోజులవి.. నమ్మినవాడే మోసం చేశాడు
అమృతరావు.. తెలుగులో ఒకే ఒక సినిమా చేసింది. అదీ సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో.. అతిథి సినిమాలో మహేశ్‌తో జోడీ కట్టిందీ హీరోయిన్. దానికి ముందు, తర్వాత హిందీ సినిమాలే చేస్తూ బాలీవుడ్లో స్థిరపడిపోయింది. అమృత తన జీవితంలో చోటు చేసుకున్న పలు సంఘటనలను కపుల్ ఆఫ్ థింగ్స్ అనే పుస్తకంలో రాసుకొచ్చింది. అందులో తన మేనేజర్ చేసిన మోసాన్ని ప్రస్తావించింది. "అప్పుడు నేను మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్నాను. షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నాను. ఒకరోజు సాయంత్రం తాజ్ బంజారా హోటల్లో బోనీ కపూర్‌తో పనిచేసిన వ్యక్తిని చూశాను. అతడు నన్ను చూడగానే హాయ్ అమృతా అంటూ దగ్గరకు వచ్చి పలకరించాడు. ఎలా ఉన్నావు అంటూ బాగోగులు అడిగి, నీకు డేట్స్ సర్దుబాటు అయ్యుంటే మాతో పాటు సల్మాన్ ఖాన్ వాంటెడ్ షూటింగ్లో ఉండేదానివి అన్నాడు. ఆ మాటకు నేను బ్లాంక్ అయ్యాను. అసలు వాంటెడ్ కోసం నన్నెప్పుడు అడిగారని తిరిగి ప్రశ్నించాను. దానికతడు 'అలా అంటావేంటి? వాంటెడ్ కోసం నిన్నే సంప్రదించాం. నీ మేనేజర్‌కు ఫోన్ చేశాం. కానీ ఆయన నీ డేట్స్ సర్దుబాటు చేయడం కష్టమని చెప్పాడు' అని తెలిపాడు. ఆ మాట విని నా గుండె ముక్కలైంది. అంత పెద్ద ఆఫర్ వచ్చిందన్న విషయం మేనేజర్ నాకు చెప్పనేలేదు. నన్ను మోసం చేశాడు. అంత మంచి ఆఫర్ నాదాకా వస్తే నేనెందుకు మిస్ చేసుకుంటాను. కచ్చితంగా డేట్స్ ఇచ్చేదాన్ని. పొమ్మనలేక పొగ బెట్టినట్లు.. తను స్వతాహాగా నా దగ్గర ఉద్యోగం మానేయడానికి బదులు నేనే అతడిని వెళ్లగొట్టేలా చేశాడు. కానీ ఇలా వాంటెడ్ ఛాన్స్ మిస్ చేసి.. మర్చిపోలేని బాధను గిఫ్ట్ ఇచ్చాడు" అని రాసుకొచ్చింది అమృత. 2006లో వచ్చిన పోకిరి సినిమాకు రీమేక్‌గా వాంటెడ్ తెరకెక్కింది. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, ఆయేషా టకియా, వినోద్ ఖన్నా, ప్రకాశ్ రాజ్, ఇందర్ కుమార్, మహేశ్ మంజ్రేకర్ తదితరులు నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సెన్సేషన్ సృష్టించింది. 2009లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. -
డేటింగ్, శారీరక సంబంధం, పెళ్లి.. కొడుకు పుట్టాక గొడవలు
అతిథి హీరోయిన్, బాలీవుడ్ బ్యూటీ అమృతరావు, నటుడు, ఆర్జే అన్మోల్లది ప్రేమ వివాహం. వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి ముచ్చట్లను, వైవాహిక జీవితంలోని కష్టసుఖాలను ఎప్పటికప్పుడు తమ యూట్యూబ్ ఛానల్ కపుల్ ఆఫ్ థింగ్స్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ఈ జంట తమ మధ్య జరిగే గొడవల గురించి మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. 'సుమారు పదేళ్లపాటు మా మధ్య గొడవల్లేవు, అభిప్రాయ బేధాలు లేవు. దాదాపు అన్ని విషయాల్లోనూ మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తాం. ఒకసారి నేను, మరోసారి తను బెటర్‌గా ఆలోచిస్తాడనిపించేది. కానీ ఎప్పుడైతే మా జీవితాల్లోకి నా కొడుకు వీర్ ఎంటర్ అయ్యాడో అప్పుడు రెండో బిడ్డను కనాలంటేనే నాకు భయమేసింది. ఎందుకంటే తను పుట్టాక మా మధ్య చాలాసార్లు అభిప్రాయబేధాలు వచ్చాయి. వాడి విషయంలో అన్ని నిర్ణయాలు అన్మోల్ తీసుకోవాలనుకుంటాడు. నేను చెప్పేవాటిని అంగీకరించేవాడు కాదు. నాకు తెలిసి అందరి ఇళ్లలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయనుకుంటా! అయినా మా 12 ఏళ్ల బంధంలో ఇవన్నీ ముఖ్యమే. నేను డేటింగ్ చేసిన వ్యక్తి నాతో ఉంటాడా? వదిలేస్తాడా? అనుకునేదాన్ని. కానీ అతడితోనే ప్రేమలో పడి ఆపై శారీరకంగానూ దగ్గరయ్యాను. చివరికి ఆ బాయ్‌ఫ్రెండే నాకు భర్తయ్యాడు' అని చెప్పుకొచ్చింది అమృత. ఇదిలా ఉంటే అమృతరావు చివరగా ఠాక్రే సినిమాలో నటించింది. చదవండి: జవాన్ కోసం రెండు సినిమాలు వదిలేసుకున్న నటుడు!? టాలీవుడ్లో విషాదం: అలనాటి హీరో కన్నుమూత -
తన భర్తనే మళ్లీ పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్..
Amrita Rao And RJ Anmol Reveals Their Wedding Photos: బాలీవుడ్ బ్యూటీ అమృత రావు సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన అతిథి సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ చిత్రంలో తన గ్లామర్, అభినయంతో బాగానే ఆకట్టుకుంది. కానీ తర్వాత మళ్లీ తెలుగు తెరపై ఆమె కనిపించలేదు. తిరిగి బాలీవుడ్‌కే వెళ్లిన అమృత మంచి స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాందించుకుంది. తాజాగా అమృత తన పెళ్లి ఫొటోలను మొట్టమొదటిసారిగా షేర్ చేసింది. అది ఎలా అంటే తన భర్తను తానే మళ్లీ పెళ్లి చేసుకుని. అవును.. అమృతకు ఆర్జే అన్మోల్తో 2014లో రహస్య వివాహం జరిగింది. అయితే ఇదివరకూ ఆర్జే అన్మోల్తో తనకు రహస్య వివాహం జరిగినట్టు ఓ వీడియో ద్వారా ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ఆర్జే అన్మోల్ను మళ్లీ చేసుకుంటూ తమ పెళ్లి నాటి ఫొటోలను ఒక వీడియో రూపంలో బయట పెట్టింది ఈ బ్యూటీ. ఈ సెలబ్రిటీ జంట యూట్యూబ్ ఛానల్ 'కపుల్ ఆఫ్ థింగ్స్'లోని కొత్త ఎపిసోడ్లో తమ వివాహ వివరాలను పంచుకున్నారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత తమ కుటుంబ సభ్యుల మధ్య ఈ జంట మళ్లీ పెళ్లి చేసుకుంది. ఈ వీడియోలో అమృత, అన్మోల్ తమ కుటుంబ సభ్యులతో కలిసి సంభాషించడం, మెమొరీ లేన్‌లో నడవడం వంటి తదితర మధురమైన క్షణాలను పంచుకుంది ఈ జంట. కాగా ఈ సెలబ్రిటీ జంట తమ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండేందుకే రహస్యంగా 2014లో మే 15న వివాహం చేసుకున్నట్లు తెలిపింది. ఈ బ్యూటీఫుల్ సెలబ్రిటీ కపుల్‌కు నవంబర్ 1, 2020న బాబు పుట్టాడు. -
అతిథి హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్, వీడియోతో వెల్లడి!
బాలీవుడ్ హీరోయిన్ అమృత రావు, ఆర్జే అన్మోల్ 2014లోనే సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారట. ఈ విషయాన్ని సెలబ్రిటీ కపుల్ తమ యూట్యూబ్ ఛానల్లో వెల్లడించారు. పెళ్లి చేసుకుంటే కెరీర్ దెబ్బతింటుందేమో అన్న ఉద్దేశ్యంతో మొదట్లో వెనుకడుగు వేశామని గుర్తు చేసుకున్నారు. పెద్ద పెద్ద సినిమా ఆఫర్లు వస్తున్న సమయంలో అన్మోల్ పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెట్టాడట. కానీ దీనివల్ల కెరీర్ ప్రభావితమవుతుందేమోనని అమృత భయపడటంతో అన్మోల్ ఓ ప్లాన్ చెప్పాడు. రహస్య వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందన్నాడు. ఇద్దరూ కలిసి ఉండొచ్చు, కెరీర్‌కు కూడా ఎలాంటి ఢోకా ఉండదు కాబట్టి సరేనంది అమృత. అలా ఇద్దరూ గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారు. సీక్రెట్ మ్యారేజ్ కాబట్టి కజిన్స్‌ను కూడా పిలవలేదని చెప్పింది హీరోయిన్. ఈ పెళ్లి 2014లో మే 15న జరిగిందని వెల్లడించారు. ఈ రహస్య వివాహాన్ని నాలుగైదు సంవత్సరాల కంటే ఎక్కువకాలం దాచలేమని ముందే తెలుసంటున్నాడు అన్మోల్. అందుకే 2016లో తామిద్దరం దంపతులమని అధికారికంగా ప్రకటించారు. కాగా అమృతరావు.. షాహిద్ కపూర్ 'ఇష్క్ విష్క్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 'వివాహ్', 'మస్తీ' వంటి పలు చిత్రాల్లో నటించిన ఈ హీరోయిన్ తెలుగులో 'అతిథి' సినిమాలో కథానాయికగా మెప్పించింది. -
'పెళ్లి చేసుకుందాం, సినిమాలు వదిలేయ్' ఏకధాటిగా ఏడ్చిన నటి!
బాలీవుడ్ జంట అమృత రావు, అన్మోల్ సూద్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కొన్నేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2016లో పెళ్లి చేసుకుంది. బయటకు ఎంతో అన్యోన్యంగా కనిపించినా అందరిలాగే వీరిమధ్య కూడా తగాదాలు వచ్చాయి. పెళ్లికి ముందే ఇద్దరూ ఒకసారి భయంకరంగా గొడవ పెట్టుకున్నారట. దీంతో అమృత సరిగా తిండి కూడా తినకుండా ఏడుస్తూ ఉండిపోయిందట! తాజాగా వారి తొలి గొడవ గురించి కపుల్ ఆఫ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చారు. '2012లో మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ అమృత ఇప్పుడేవద్దు, ముందు కెరీర్లో స్థిరపడాలని నిర్ణయించుకుంది. కుదరదు, ఇప్పుడు పెళ్లి చేసుకుందామంతే అని మొండిపట్టు పట్టాను, నాకోసం కెరీర్ మీద పెట్టుకున్న ఎన్నో ఆశలను పక్కన పెట్టి వివాహానికి అంగీకరించింది' అని అన్మోల్ చెప్పుకొచ్చాడు. 'ఒకరోజైతే ఏకంగా సినిమాలు మానేయాలని అన్మోల్ చెప్పడంతో నేను షాకయ్యాను. నటనకు ఫుల్స్టాప్ పెట్టాలని అతడు చాలా సీరియస్‌గా చెప్పాడు. అంతకుముందు అతడెప్పుడూ అలా మాట్లాడలేదు. ఎంతో బాధపడ్డాను. మా బంధం కోసం నేను ఎంతగానో ప్రేమించే నా సినిమా కెరీర్‌ను వదిలేయాలా? అని శూన్యంలోకి ఆలోచిస్తూ తీవ్ర నిరాశనిస్పృహలోకి వెళ్లిపోయాను' అని అమృత చెప్పుకొచ్చింది. ఇక అదే రోజు ఇద్దరూ రెస్టారెంట్‌కు డిన్నర్ డేట్‌కు వెళ్లగా.. అక్కడ దుఃఖం ఆపుకోలేని అమృత వెక్కివెక్కి ఏడ్చింది. ఆమె ఏకధాటిగా ఏడవటం చూసిన అన్మోల్కు గుండె పగిలినంత పనైంది. తను ఆమె మనసును ఎంతగా గాయపరుస్తున్నాడో అర్థం చేసుకున్న అన్మోల్.. రెండు రోజుల్లోనే ఆమె దగ్గరకు వెళ్లి సారీ చెప్పడం, తన కోసం కెరీర్ వదులుకోవాల్సిన అవసరం లేదని భరోసా ఇవ్వడం చకచకా జరిగిపోయింది. ఆరోజు అలా ప్రవర్తించినందుకు 12 ఏళ్లుగా తనకు సారీ చెప్తూనే ఉన్నానంటున్నాడు అన్మోల్. -
తల్లి కాబోతున్న హీరోయిన్!
ముంబై: నటి అమృతా రావు- ఆర్జే అన్మోల్ దంపతులు ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. తమ ఇంటికి బుజ్జి పాపాయిని ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో వీళ్లిద్దరికీ సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా తాము తల్లిదండ్రులం కాబోతున్న సంగతిని వీరు అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇటీవల చెకప్ నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన ఈ జంట ఫొటోగ్రాఫర్ల కెమెరా కంటికి చిక్కింది. ఈ క్రమంలో బేబీ బంప్‌తో ఉన్న అమృత, భర్తతో కలిసి హాస్పిటల్ బయట నిల్చుని ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా వివాహ్, ఇష్క్‌విష్క్, మై హూనా వంటి బాలీవుడ్ సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అమృతా రావు, సూపర్ స్టార్ మహేష్‌బాబు అతిథి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించిన సంగతి తెలిసిందే.(చదవండి: తల్లి కాబోతున్న నటి అనిత) ఇక మరాఠా నాయకుడు బాల్ ఠాక్రే జీవితం ఆధారంగా గతేడాది తెరకెక్కిన ఠాక్రే సినిమాలో ఆమె చివరిసారిగా నటించారు. విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్య మీనా పాత్రలో జీవించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై ఓ ప్రముఖ ఛానెల్లో జమ్మీన్ అనే మ్యూజిక్ షోను హోస్ట్ చేస్తున్నారు. ఇక వ్యక్తిగత విషయానికొస్తే, అమృతారావు, ఆర్జే అన్మోల్ ఏడేళ్ల పాటు ప్రేమించుకుని, 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. కాగా హంగూ, ఆర్భాటాలకు అమృత పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదని, అందుకే తన పెళ్లి గురించి గానీ, తల్లి కాబోతున్న విషయం గురించి గానీ సన్నిహితులకు తప్ప మరెవరికీ చెప్పలేదని ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు జాతీయ మీడియాతో చెప్పుకొచ్చారు. -
ఏం పర్లేదు, చెంప చెళ్లుమనిపించు
ముంబై: బాలీవుడ్ నటి అమృతా రావు తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉండాలి. అప్పుడెప్పుడో 'అతిథి' చిత్రంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు జోడీగా నటించారు. ఆ తర్వాత ఒక్క తెలుగు సినిమాలోనూ కనిపించలేరు. బాలీవుడ్లో మాత్రం స్టార్ హీరోలతో జత కడుతూ సినిమాలు చేసుకుంటూ పోయారు. అయితే ఈ మధ్య కాస్త వెనకబడ్డ అమృతా రావు తన సినీ జీవితాన్ని మలుపు తిప్పిన "ఇష్క్ విష్క్" చిత్రం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో హీరో షాహిద్ కపూర్‌ను లాగి పెట్టి కొట్టే సీన్ ఉంటుంది. ఈ సీన్ పూర్తి చేసేందుకు తల ప్రాణం తోక్కొచ్చిందంటున్నారు. మరోవైపు దర్శకుడు కెన్ ఘోష్.. షాహిద్‌ను కొట్టినట్లు అతడి మొహంలో రియాక్షన్ కనిపించాలని మరింత ఒత్తిడి తెచ్చారు. (గురుశిష్యులు) ప్రేక్షకులు ఈ సీన్లో లీనమవాలన్నారు. అయితే అంతకు ముందెన్నడూ ఎవరినీ ఒక్క దెబ్బ కూడా వేయని అమృతా రావుకు ఈ సీన్ తన వల్ల కాదేమోనని తెగ భయపడిపోయారు. సరిగ్గా అప్పుడే షాహిద్ తల్లి నీలిమ అజీమ్ కనిపించారు. ఆమే స్వయంగా తన కొడుకును ఎలా కొట్టాలో చెప్తూ ఎంకరేజ్ చేశారు. షూటింగ్ ఆన్ అవగానే ఆమె పక్కనుంచి "నువ్వు చేయగలవు, కొట్టు, గట్టిగా చెంప చెళ్లుమనిపించు" అంటూ ప్రోత్సహించింది. వెంటనే అమృత కూడా షాహిద్‌ను కోపంగా ఒక్క దెబ్బ వేసింది. స్క్రీన్‌పై అది అనుకున్నదానికన్నా బాగా రావడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. (నా సినిమాలు ఫ్లాప్.. అందుకే: నటుడు) -
ఆ హీరోయిన్‌కు సైబర్ షాక్
ముంబై : బాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు సైబర్ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచన్, షాహిద్ కపూర్, అద్నాన్ సమీల తర్వాత తాజాగా నటి అమృతా రావు తన ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని వెల్లడించారు. ప్రముఖ మీడియా సంస్ధ నుంచి వచ్చిన లింక్ ద్వారా ట్విటర్ ఖాతా హ్యాకైందని ఆమె పేర్కొన్నారు. వారం రోజుల కిందట తన ట్విటర్ అకౌంట్ హ్యాకైందని చెబుతూ ఇటీవల తనకు ఓ ప్రముఖ మీడియా సంస్థ నుంచి మెసేజ్ వచ్చిందని, తన ఇంటర్వ్యూ కోసం అనుమతి కోరుతూ వచ్చిన ఆ మెయిల్‌ను తన సోషల్ మీడియా టీమ్ క్లిక్ చేయగానే ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని అమృతా రావు చెప్పారు. దీంతో తనకు వెంటనే గతంలో అమితాబ్ బచన్ అకౌంట్ హ్యాక్ అయిన ఉదంతం గుర్తుకువచ్చిందని, పరిశ్రమకు ఇది ఒక ప్రమాదకర ధోరణిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తనకు తుషార్ కపూర్ ట్విటర్ ఖాతా నుంచి మెసేజ్ రాగా, ఆయన తన అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పారని అమృత గుర్తుచేశారు. -
విమానాశ్రయంలో హీరోయిన్ సూట్‌కేస్ చోరీ
జైపూర్: బాలీవుడ్ నటి, 'అతిథి' హీరోయిన్ అమృతారావు విలువైన సూట్‌కేస్ జైపూర్ విమానాశ్రయంలో చోరికి గురైంది. ఒక నగల యాడ్ షూటింగ్ నిమిత్తం ఆమె పింక్ సిటీకి వచ్చింది. ఈ క్రమంలో తాను తెచ్చుకున్న మూడు లగేజీ బ్యాగ్స్‌లో ఒకటి మిస్సయిన విషయాన్ని గమనించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో సుమారు లక్ష రూపాయల విలువైన వస్తువులున్నాయని తెలిపింది. మరోవైపు తమ విమానాశ్రయంలో ఇలాంటి సంఘటన ఇంతకుముందు జరగలేని ఎయిర్ పోర్ట్ అధికారులు చెప్పారు. తమ సిబ్బంది చాలా సిన్సియర్‌గా, జాగ్రత్తగా విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. దీనిపై త్వరిత గతిన విచారణ జరిపి పోయిన సూట్ కేసును ఆమెకు అందజేస్తామన్నారు. మరోవైపు పింక్ సిటీ లో షూటింగ్ అంటూ చాలా ఉత్సాహంగా ఉందని అమృతారావు పేర్కొంది. పెద్ద నగరాల్లో ఇలాంటి చిన్న చిన్న ఘటనలు మామూలేనని, విమానాశ్రయ అధికారులు తన సూట్ కేసును తిరిగి అందజేస్తారన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేసింది. తెలుగులో మహేశ్ బాబు సరసన 'అతిథి' సినిమాలో అమృత నటించిన సంగతి తెలిసిందే. -
అస్ర తంత్ర : మంచితనం శాపంగా మారితే?
నవంబర్ నెలలో ఓ రోజు రాత్రి... నటి అమృతారావ్ కారులో ముంబై రోడ్డుమీద వెళ్తోంది. ఔట్‌డోర్ షూటింగు కోసం విమానం ఎక్కడానికి ఎయిర్‌పోర్టుకు వెళ్తోందామె. కిటికీలోంచి బయటకు చూస్తోన్న ఆమెకు ఓ దృశ్యం కనబడింది. ఓ రిక్షా కార్మికుడు తన భార్యను గొడ్డును బాదినట్టు బాదుతున్నాడు. ఆమె ఏడుస్తోంది. అది చూసి చలించిపోయింది అమృత. వెంటనే కారు ఆపి దిగింది. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి ‘ఇదేం పని’ అంటూ నిలదీస్తుండగా... మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆమెను చుట్టుముట్టారు. అడ్డుకోవడానికి వచ్చిన డ్రైవర్‌ను కూడా నిలువరించారు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. పైగా రాత్రిపూట కావడంతో వారి అరుపులు ఎవరికీ వినిపించలేదు. ఎలాగో వారి నుంచి తప్పించుకుని కారెక్కింది అమృత. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లయింట్ ఇద్దామంటే ఫ్లయిట్ మిస్సవుతుందని భయం. కనీసం ఫోన్ అయినా చేద్దామంటే ఇంటి దగ్గరే ఫోన్ మర్చిపోయి వచ్చింది. దాంతో చేసేదేమీ లేక ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయింది అమృత. ఈ సంఘటన తనని వణికించిందని చెప్పిందామె. ‘‘మంచి చేయబోతే చెడు ఎదురయ్యింది, ఈ దేశంలో మంచిగా ఆలోచించడం కూడా తప్పే’’ అంటూ భయంగా చెప్పింది. ఆమె చెప్పింది నిజమే. కొన్నిసార్లు మనం మంచి అనుకున్నదే చెడు అవుతుంది. ముఖ్యంగా ఆడపిల్లల పాలిట ఆ మంచితనం కొన్నిసార్లు శాపమవుతుంది. ఎవరో ఒకసారి ఫోన్ ఇవ్వండి, అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి అంటే ఇచ్చేస్తారు. వాళ్లు ఆ నంబర్ సేవ్ చేసుకుని, తర్వాత వేధించడం మొదలెడతారు. ఎవరో అడ్రస్ కోసం వెతుకుతుంటే సాయం చేయాలనుకుంటారు. ఆ వ్యక్తి మెల్లగా మాట కలిిపి ‘మీరుండేది ఎక్కడ?’ అంటాడు. వీళ్లు అమాయకంగా చెప్పేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. ఎవరికీ సాయం చెయ్యవద్దని కాదు. చేసేముందు దానివల్ల మనకేమైనా ప్రమాదం ఉందేమో చూసుకోవాలి. అలాంటిదేమీ లేదు అనుకుంటేనే చేయాలి. మంచి మనసుండటం మంచిదే. కానీ ఆ మంచి మనకు చెడుగా మారకుండా చూసుకోవడం ఇంకా ముఖ్యం. లేదంటే అమృతలాగ మనం కూడా కొన్నిసార్లు ఆపదలో పడే ప్రమాదం లేకపోలేదు! -
ప్రేమ ఎవరినైనా ఓడిస్తుంది
ఓటమిని ఎరుగని వాడిని సైతం ఓడించే శక్తి ప్రేమకు ఉందని తెలిపే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ఫస్ట్ లవ్’. మహేంద్ర, అమితారావ్ జంటగా నటించారు. రచయిత అంబటి గోపి ఈ చిత్రానికి దర్శకుడు. మంగిలిపల్లి సత్యనారాయణ, మంగిలిపల్లి నాగరాజు నిర్మాతలు. ఈ నెలాఖరున విడుదల కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు చెబుతూ -‘‘ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి. ఆస్వాదిస్తే తప్ప దాని విలువ తెలీదు. ఈ సినిమా చూసే ప్రేక్షకుడు అలాంటి అనుభూతికే లోనవుతాడు. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘దేవి, పెదరాయుడు, అడవిలో అన్న, పెళ్లి చేసుకుందాం, సింహరాశి, సింహాద్రి తదితర చిత్రాల్లో బాలనటునిగా నటించిన మహేంద్రను ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నాం. అంబటి గోపి అద్భుతంగా చిత్రాన్ని మలిచాడు. ఇటీవల విడుదలైన పాటలకు కూడా మంచి స్పందన లభిస్తోంది. తొలికాపీ సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. జయప్రకాష్‌రెడ్డి, నాగినీడు, ప్రభాస్ శ్రీను, వేణు, కొండవలస తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాఘవ నూలేటి, సంగీతం: జీవన్ థామస్, కూర్పు: నందమూరి హరి, సమర్పణ: చరణ్, అక్షర. -
సన్నీ కండలు చూసి ముచ్చటపడిన బాలీవుడ్ తార!
ముంబై: బాలీవుడ్ వెటరన్ సన్నీ డియోల్ కండలు చూసి ఓ బాలీవుడ్ నటికి ముచ్చటేసిందట. గతంలో తన యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్స్ తో బాలీవుడ్ టాప్ హీరోగా చెలరేగిన సన్నీడియోల్ ఇటీవల కుర్ర హీరోల ధాటికి రేసులో వెనకపడ్డాడు. అయితే తాజాగా 'సింగ్ సాహెబ్ ది గ్రేట్' చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆలరించేందుకు సన్నీ సిద్ధమయ్యాడు. సన్నీ సరసన అమృతారావు జర్నలిస్టు పాత్రలో నటిస్తోంది. ఇటీవల సన్నీతో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో అమృతారావు పాల్గొన్నారు. యాక్షన్ సన్నివేశాల్ని సన్నీ అద్బుతంగా చేశారని.. యాక్షన్ సీన్లను చూడటం తనకు బోనస్.. కండల తిరిగిన చేతులను చూస్తే ముచ్చటేసింది అని అన్నారు అమృతారావు. తాను ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నానని.. ఆ పాత్ర కోసం ఉత్తర ప్రదేశ్ లో మాట్లాడే హిందీని కష్టపడి నేర్చుకున్నానని తెలిపింది. -
సాదాసీదా పాత్రలొద్దు : అమృతారావు
న్యూఢిల్లీ: నిన్నమొన్నటిదాకా పక్కింటి అమ్మాయిలా కనిపించే పాత్రలను పోషించిన అమృతారావు ఇక నుంచి అలాంటి సాదాసీదా పాత్రల్లో నటించేందుకు అంతగా ప్రాధాన్యతను ఇవ్వనని చెబుతోంది. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమృత మాట్లాడుతూ... సవాలు విసిరే పాత్రలతో ఎవరైనా ముందుకొస్తే సంతోషంగా అంగీకరిస్తానంటోంది. పకాశ్ ఝా దర్శకత్వం వహించిన ‘సత్యాగ్రహ’ చిత్రం విజయవంతం కావడంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కే చిత్రాల్లో నటించాలనే ఆసక్తి పెరిగిందని చెబుతోంది అమృత. చిత్రంలో అమితాబ్ బచ్చన్‌కు కోడలిగా నటించడం ఎంతో సంతోషంగా ఉందని చెబుతూనే ఆయనతో నటించినన్ని రోజులు ఓవైపు నటిస్తూనే మరోవైపు ఎలా నటించాలో నేర్చుకున్నానని చెప్పింది. అటువంటి చిత్రంలో తాను భాగస్వామినైనందుకు గర్వంగా ఉందని, సామాజిక చైతన్యాన్ని చాటిచెప్పే చిత్రాల్లో నటించడం ద్వారా నిజజీవితంలో కూడా ఎంతో కొంత మార్పు వస్తుందని , అది తనలో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పింది. ‘సత్యాగ్రహ’లో నటించిన తర్వాత ఎన్నో నిర్మాణ సంస్థలు తన ఇంటి తలుపును తట్టాయని, అయితే పాత్రల ఎంపికలో తొందరపడబోనని చెప్పింది. తన స్నేహితులు, సన్నిహితులు కూడా తనలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపడుతున్నారని, చాలా మంది ప్రశంసిస్తున్నారంది. ఆగస్టు 30న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే దాదాపు 60 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని, అయితే వంద కోట్ల క్లబ్లో చేరుతుందో? లేదో? అనే విషయమై చిత్ర బృందం ఎవరూ పెద్దగా ఆలోచించడంలేదని చెప్పింది. తాను మాత్రం ఈ కోట్ల క్లబ్‌పై పెద్దగా ఆసక్తి చూపనని, సదరు క్లబ్లో చేరిన సినిమాలే గొప్ప సినిమాలని చెప్పడానికి వీలు లేదంది.