సన్నీ కండలు చూసి ముచ్చటపడిన బాలీవుడ్ తార!
బాలీవుడ్ వెటరన్ సన్నీ డియోల్ కండలు చూసి ఓ బాలీవుడ్ నటికి ముచ్చటేసిందట.
ముంబై:
బాలీవుడ్ వెటరన్ సన్నీ డియోల్ కండలు చూసి ఓ బాలీవుడ్ నటికి ముచ్చటేసిందట. గతంలో తన యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్స్ తో బాలీవుడ్ టాప్ హీరోగా చెలరేగిన సన్నీడియోల్ ఇటీవల కుర్ర హీరోల ధాటికి రేసులో వెనకపడ్డాడు. అయితే తాజాగా 'సింగ్ సాహెబ్ ది గ్రేట్' చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆలరించేందుకు సన్నీ సిద్ధమయ్యాడు. సన్నీ సరసన అమృతారావు జర్నలిస్టు పాత్రలో నటిస్తోంది.
ఇటీవల సన్నీతో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో అమృతారావు పాల్గొన్నారు. యాక్షన్ సన్నివేశాల్ని సన్నీ అద్బుతంగా చేశారని.. యాక్షన్ సీన్లను చూడటం తనకు బోనస్.. కండల తిరిగిన చేతులను చూస్తే ముచ్చటేసింది అని అన్నారు అమృతారావు. తాను ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నానని.. ఆ పాత్ర కోసం ఉత్తర ప్రదేశ్ లో మాట్లాడే హిందీని కష్టపడి నేర్చుకున్నానని తెలిపింది.