Singh Sahab the Great
-
'ఘాయల్ రిటర్న్స్'కు సన్నీ డియోల్ దర్శకత్వం
ముంబై: 1990లో ఘనవిజయం సాధించిన 'ఘాయల్' చిత్ర సీక్వెల్ ను తెరకెక్కించేందుకు బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీడియోల్ సన్నద్ధమవుతున్నారు. ఘాయల్ రిటర్న్స్ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు 57 ఏళ్ల సన్నీ తెలిపాడు. ఈ చిత్రానికి రాహుల్ రావాలీ దర్శకత్వం వహిస్తాడని ముందు అనుకున్నా, కొన్ని అనివార్యకారణాల వల్ల అతను ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆ అవకాశం సన్నీ డియోల్ ను వరించింది. ఈ చిత్ర విశేషాలను సన్నీ మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం ఘాయల్ రిటర్న్స్ స్క్రిప్ట్ వర్క్‌లో నిమగ్నమైయ్యామని, ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో సెట్స్ మీదుకు తీసుకువస్తామని తెలిపాడు. తను తీయబోయే ఘాయల్ రిటర్న్స్ పాత చిత్రానికి కొనసాగింపు మాత్రం కాదని తెలిపాడు. 1983లో 'బెతాబ్' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన సన్నీ..1999లో దిల్లగీ చిత్రానికి దర్శకత్వం వహించాడు. -
టాప్ హీరోయిన్లు నాతో పని చేయడం లేదు:సన్నీడియోల్
ముంబై: టాప్ హీరోయిన్లు తనతో పని చేయడానికి ఇష్టపడటం లేదని బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీడియోల్ తెలిపాడు. బాలీవుడ్లో తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్నసన్నీ తాజాగా నటించిన 'సింగ్ సాబ్ ద గ్రేట్' త్వరలో విడుదల కానుంది. తనలోని నటుడిని బయటపెట్టిన దర్శకుడు అనిల్ శర్మతో కలిసి మరోసారి పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు. అనిల్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో 50 ఏళ్ల పైబడిన తనతో 19 ఏళ్ల ఉర్వశీ రౌతేలా జోడి కట్టిందన్న విషయాన్ని గుర్తు చేశాడు. పెద్ద హీరోయిన్లతో సినిమా చేయడానికి ఆసక్తి ఉన్నా వారు మాత్రం అయిష్టత చూపిస్తున్నారన్నాడు. తాను ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి తానేంటో నిరూపించుకున్నానని తెలిపాడు. ఇంకా తన గురించి నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. 1983లో 'బెతాబ్' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన సన్నీ..ఆపై దర్శకుడిగా కూడా మరాడు. ఈ 30 ఏళ్ల బాలీవుడ్ ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లను చూశానని తెలిపాడు.ప్రస్తుతం తాను తిరిగి ఓ సినిమాకు దర్శకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఈ క్రమంలో కొత్త నటీమణుల కోసం అన్వేషిస్తున్నానని తెలిపాడు. కొత్త వారి డేట్లు దొరకబుచ్చకోవడం కూడా పెద్ద కష్టం కాదన్నాడు. తనతో పని చేయమని చాలా మంది ప్రముఖ హీరోయిన్లు కలిశాన్నాడు. కాగా, వారు మాత్రం తనతో పనిచేయడానికి ఆసక్తి కనబరచడం లేదన్నాడు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, హృతిక్ రోషన్లతో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నాడు. -
మళ్లీ కెమెరా వెనక్కు వెళ్తా!
కెమెరా వెనక్కు వెళ్లాలనే కోరిక తనలో ఇంకా అలాగే ఉందంటున్నాడు బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్. ఇప్పటిదాకా నటుడిగా కెమెరా ముందు ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్న సన్నీ దర్శకుడిగా కూడా కొన్ని అనుభవాలను మూటగట్టుకున్నాడు. అయితే మరోసారి దర్శకత్వం వహించాలనే తన కల సాకారం కావడానికి ఒకట్రెండేళ్లు పట్టే అవ కాశముందంటున్నాడు. త్వరలో ‘సింగ్ సహాబ్ ద గ్రేట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ యాభయేడేళ్ల నటుడు 1999లో ‘దిల్లగీ’ సినిమాతో దర్శకుడిగా మారాడు. నటుడిగా కాకుండా ఇంకేదైనా చేయాలనే కోరిక తనను దర్శకత్వం వైపు లాగుతోందని, అయితే ఒకట్రెండేళ్లు ఆగుతానంటున్నాడు. సినిమాను తెరకెక్కించే మంచి అంశమేదైనా బుర్రకు తట్టగానే కెమెరా వెనక్కు వెళ్తానంటున్నాడు. తనలోని నటుడిని బయటపెట్టిన దర్శకుడు అనిల్ శర్మతో కలిసి మరోసారి పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు. గదార్-ఏక్ ప్రేమ్ కథా, ద హీరో: లవ్‌స్టోరీ ఆఫ్ ఏ స్పై, అప్నే తదితర చిత్రాలను సన్నీతో కలిసి శర్మ తెరకెక్కించినవే. దీంతో తాజాగా విడుదల కానున్న ‘సింగ్ సహాబ్ ద గ్రేట్’పై అంచనాలు కూడా భారీగానే పెరిగాయి.ఈ విషయమై సన్నీ మాట్లాడుతూ... ‘దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ సినిమాను చేస్తున్నా. ఓ రకంగా ఇది సోలో ఫిల్మ్ అని చెప్పొచ్చు. వందశాతం కష్టపడుతున్నా.. మరోసారి యాంగ్రీ-యాక్షన్ హీరోగా నిలబెడుతుందనే విశ్వాసముంది. అమృతారావు, నూతన నటి ఊర్వశీ రౌతేలాలు కథనాయికలుగా నటిస్తున్నారు. శర్మ చెప్పిన కథపై చాలా నమ్మకముంది. నాకు సరిపడే కథలతోనే ఆయన నా వద్దకు వస్తారు. అందుకే ఆయనతో కలిసి పనిచేసే ఏ అవకాశాన్ని కూడా ఇప్పటిదాకా వదలిపెట్టలేదు. సినిమాలో కొంత భాగాన్ని జైలులో చిత్రీకరించాం. అందులో ఖైదీలో ఎంతో క్రమశిక్షణతో ఉన్నార’ని కితాబునిచ్చాడు. -
సన్నీ కండలు చూసి ముచ్చటపడిన బాలీవుడ్ తార!
ముంబై: బాలీవుడ్ వెటరన్ సన్నీ డియోల్ కండలు చూసి ఓ బాలీవుడ్ నటికి ముచ్చటేసిందట. గతంలో తన యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్స్ తో బాలీవుడ్ టాప్ హీరోగా చెలరేగిన సన్నీడియోల్ ఇటీవల కుర్ర హీరోల ధాటికి రేసులో వెనకపడ్డాడు. అయితే తాజాగా 'సింగ్ సాహెబ్ ది గ్రేట్' చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆలరించేందుకు సన్నీ సిద్ధమయ్యాడు. సన్నీ సరసన అమృతారావు జర్నలిస్టు పాత్రలో నటిస్తోంది. ఇటీవల సన్నీతో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో అమృతారావు పాల్గొన్నారు. యాక్షన్ సన్నివేశాల్ని సన్నీ అద్బుతంగా చేశారని.. యాక్షన్ సీన్లను చూడటం తనకు బోనస్.. కండల తిరిగిన చేతులను చూస్తే ముచ్చటేసింది అని అన్నారు అమృతారావు. తాను ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నానని.. ఆ పాత్ర కోసం ఉత్తర ప్రదేశ్ లో మాట్లాడే హిందీని కష్టపడి నేర్చుకున్నానని తెలిపింది.