Amrita Rao Reveals That She Having Differences With Husband RJ Anmol - Sakshi
Sakshi News home page

Amrita Rao: డేటింగ్‌ చేసిన వ్యక్తే భర్తగా.. రెండోసారి పిల్లల్ని కనాలంటేనే భయం..

Published Sun, Aug 28 2022 7:39 PM | Last Updated on Mon, Aug 29 2022 10:28 AM

Amrita Rao Reveals That She having Differences With Husband RJ Anmol - Sakshi

అతిథి హీరోయిన్‌, బాలీవుడ్‌ బ్యూటీ అమృతరావు, నటుడు, ఆర్జే అన్మోల్‌లది ప్రేమ వివాహం. వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి ముచ్చట్లను, వైవాహిక జీవితంలోని కష్టసుఖాలను ఎప్పటికప్పుడు తమ యూట్యూబ్‌ ఛానల్‌ కపుల్‌ ఆఫ్‌ థింగ్స్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంటున్నారు. తాజాగా ఈ జంట తమ మధ్య జరిగే గొడవల గురించి మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్‌ చేసింది.

'సుమారు పదేళ్లపాటు మా మధ్య గొడవల్లేవు, అభిప్రాయ బేధాలు లేవు. దాదాపు అన్ని విషయాల్లోనూ మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తాం. ఒకసారి నేను, మరోసారి తను బెటర్‌గా ఆలోచిస్తాడనిపించేది. కానీ ఎప్పుడైతే మా జీవితాల్లోకి నా కొడుకు వీర్‌ ఎంటర్‌ అయ్యాడో అప్పుడు రెండో బిడ్డను కనాలంటేనే నాకు భయమేసింది. ఎందుకంటే తను పుట్టాక మా మధ్య చాలాసార్లు అభిప్రాయబేధాలు వచ్చాయి. వాడి విషయంలో అన్ని నిర్ణయాలు అన్మోల్‌ తీసుకోవాలనుకుంటాడు.

నేను చెప్పేవాటిని అంగీకరించేవాడు కాదు. నాకు తెలిసి అందరి ఇళ్లలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయనుకుంటా! అయినా మా 12 ఏళ్ల బంధంలో ఇవన్నీ ముఖ్యమే. నేను డేటింగ్‌ చేసిన వ్యక్తి నాతో ఉంటాడా? వదిలేస్తాడా? అనుకునేదాన్ని. కానీ అతడితోనే ప్రేమలో పడి ఆపై శారీరకంగానూ దగ్గరయ్యాను. చివరికి ఆ బాయ్‌ఫ్రెండే నాకు భర్తయ్యాడు' అని చెప్పుకొచ్చింది అమృత. ఇదిలా ఉంటే అమృతరావు చివరగా ఠాక్రే సినిమాలో నటించింది.

చదవండి: జవాన్‌ కోసం రెండు సినిమాలు వదిలేసుకున్న నటుడు!?
టాలీవుడ్‌లో విషాదం: అలనాటి హీరో కన్నుమూత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement