tv actors
-
లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఈ బుల్లితెర జంట పెళ్లి వేడుక చూశారా? (ఫొటోలు)
-
రక్తం అమ్ముకుని కడుపు నింపుకున్నా: నటి
బుల్లితెరపై 'బ్రహ్మముడి సీరియల్'లో అప్పు పేరుతో గుర్తింపు తెచ్చుకుంది నటి నైనీషా రాయ్. సినిమాలంటే విపరీతమైన ఇష్టంతో బెంగాలీ నుంచి టాలీవుడ్‌కు వచ్చేసింది. ఇంటర్ మీడియట్ చదువుతున్న సమయంలోనే హైదరాబాద్ వచ్చేసింది. ఇక్కడ అనేక కష్టాలను ఎదుర్కొంటూ పలు సీరియల్స్‌లో ఆఫర్లు దక్కించుకుంది. కలిసి ఉంటే కలదు సుఖం, వంటలక్క, భాగ్య రేఖ, ఇంటిగుట్టు, హంసగీతం వంటి సీరియల్స్లలో ఆమె మెప్పించింది. శ్రీమంతుడు అనే సీరియల్లో లీడ్ రోల్లో కూడా నైమిషా రాయ్ కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నైనీషా రాయ్ బుల్లితెర గురించి పలు విషయాలు షేర్ చేసింది. ఇక్కడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో కనీసం తినడానికి కూడా తిండిలేదని నైనీషా రాయ్ వాపోయింది. ఆకలి తీర్చుకునేందుకు తన రక్తాన్ని కూడా అమ్ముకున్నట్లు ఆమె చెప్పింది. ఇలా ఎన్నో కష్టాలు పడుతున్న సమయంలో ఆఫర్లు వచ్చాయని సంతోషిస్తే నాకేంటి అంటూ తిరిగి అడిగే వారే ఎక్కువగా ఉన్నారని తెలిపింది. ఈ క్రమంలో ఏదో ఆఫర్ వచ్చింది కదా అని షూటింగ్‌కు వెళ్తే.. కమిట్మెంట్ కండీషన్ పెట్టారు. ఒకానొక సమయంలో బలవంతం కూడా పెట్టారు. ఆ సమయంలో వాళ్లను కొట్టి ఏదోలా వచ్చేశానని ఆమె గుర్తు చేసుకుంది. నిజ జీవితంలో కూడా నైనిషా చాలా కష్టాలను చూసింది. బెంగాలీ కుటుంబానికి చెందిన నైనిషా రాయ్ తండ్రి లెక్చరర్ అయితే ఆమె అమ్మగారు హౌస్ వైఫ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఆమె తెలుగు పరిశ్రమకు వచ్చింది. ఇంటర్ చదువుతున్న సమయంలోనే తాను ఇంటి నుంచి వచ్చేసినట్లు తెలిపింది. ఇక్కడ తన సొంత కష్టంతో చదువుకుంటూనే చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసింది. వచ్చిన అవకాశాన్ని తన టాలెంట్‌తో సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులకు దూరం కావడం జరిగిపోయింది. నైనిషా రాయ్ ఇండస్ట్రీ వైపు రావడం వాళ్లకి ఇష్టం లేకపోవడంతో తనే ఇంటి నుంచి వచ్చేసినట్లు తెలిపింది. కానీ తన తల్లిదండ్రులతో ఎలాంటి గొడవలు లేవని నైనిషా రాయ్ చెప్తూనే.. 'వాళ్ల ఆలోచనలో వాళ్లు కరెక్టేమో కానీ.. నాకు మాత్రం వాళ్లు చేసింది తప్పు' అని చెప్పింది. (ఇదీ చదవండి: ప్రపంచ సుందరి పోటీలు.. నా జెండా గుండెల్లో ఉంది: సినీ శెట్టి) View this post on Instagram A post shared by Nainisha (@nainisha_rai) -
Aamna Sharif: మత్తెక్కించే ఫోజులతో ఆమ్నా షరీఫ్ (ఫోటోలు)
-
బిగ్‌బాస్‌లోకి ఈ జంట ఎంట్రీ ఖాయం.. వాళ్లకు బిగ్ సపోర్ట్ ఎవరో తెలిస్తే
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆరు సీజన్స్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో.. త్వరలోనే ఏడో సీజన్‌ని ప్రారంభించబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రోమోని కూడా వదిలారు బిగ్‌బాస్ నిర్వాహకులు. షోలో పార్టీసిపెట్ చేసేందుకు చాలామంది జాబితానే వారు సిద్దం చేశారని తెలుస్తోంది. కానీ వారిలో కొందరికి మాత్రమే ఫైనల్ ఎంట్రీ అవకాశం ఉంటుందనేది అందరికీ తెలిసిందే. (ఇదీ చదవండి: ఏపీ పాలిటిక్స్‌పై పూనమ్ ట్వీట్.. ఆమెపై బూతులతో రెచ్చిపోతున్న ఆయన ఫ్యాన్స్) తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట హోస్‌లోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. బుల్లితెరలో గుర్తింపు తెచ్చుకున్న అమర్దీప్-తేజస్వినిల వివాహం డిసెంబర్ 2021న బెంగళూరులో జరిగిన విషయం తెలిసిందే. అమర్‌దీప్‌కు దగ్గరి స్నేహితులైన సయ్యద్ సోహెల్, అరియాన, ప్రియాంక సింగ్ వంటి వారు పెళ్లికి హాజరయ్యారు. 'ప్రతి సంవత్సరం, మేకర్స్ షోలో కనీసం ఒక సెలబ్రిటీ జంటను ఉంచేందుకు ప్లాన్ చేస్తారు. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ హిందీ వెర్షన్లో కూడా ఈ ట్రెండ్‌ను ఎక్కువగా అనుసరిస్తోంది. అందుకే, తెలుగు నుంచి బుల్లితెరలో పాపులర్ అయిన అమర్దీప్-తేజస్విని గౌడను స్టార్ మా సంప్రదించారని తెలుస్తోంది. 'జానకి కలగనలేదు' సీరియల్‌తో రామగా పాపులర్ అయ్యారు నటుడు అమర్దీప్. ఈ సీరియల్‌తో ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు వచ్చింది. మరోవైపు, 'కేరాఫ్ అనసూయ' సీరియల్‌తో పాపులర్ అయిన నటి తేజస్విని గౌడ. వీరిద్దరూ ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయారు. తేజస్విని కన్నడ టీవీ షోలలో కూడా నటించిడంతో అక్కడ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ జంట గత సీజన్లోనే అడుగుపెట్టబోతుందని బాగానే ప్రచారం జరగింది. కానీ ఈసారి పక్కాగా వీరిద్దరి ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఈ జంట షోలో అడుగుపెడితే సయ్యద్ సోహెల్, అరియాన సపోర్ట్ ఈ జంటకు ఖచ్చితంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. (ఇదీ చదవండి: లిప్‌లాక్,బోల్డ్ సీన్స్‌పై మా ఇంట్లో ఏమన్నారంటే: బేబీ హీరోయిన్) -
డేటింగ్, శారీరక సంబంధం, పెళ్లి.. కొడుకు పుట్టాక గొడవలు
అతిథి హీరోయిన్, బాలీవుడ్ బ్యూటీ అమృతరావు, నటుడు, ఆర్జే అన్మోల్లది ప్రేమ వివాహం. వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి ముచ్చట్లను, వైవాహిక జీవితంలోని కష్టసుఖాలను ఎప్పటికప్పుడు తమ యూట్యూబ్ ఛానల్ కపుల్ ఆఫ్ థింగ్స్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ఈ జంట తమ మధ్య జరిగే గొడవల గురించి మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. 'సుమారు పదేళ్లపాటు మా మధ్య గొడవల్లేవు, అభిప్రాయ బేధాలు లేవు. దాదాపు అన్ని విషయాల్లోనూ మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తాం. ఒకసారి నేను, మరోసారి తను బెటర్‌గా ఆలోచిస్తాడనిపించేది. కానీ ఎప్పుడైతే మా జీవితాల్లోకి నా కొడుకు వీర్ ఎంటర్ అయ్యాడో అప్పుడు రెండో బిడ్డను కనాలంటేనే నాకు భయమేసింది. ఎందుకంటే తను పుట్టాక మా మధ్య చాలాసార్లు అభిప్రాయబేధాలు వచ్చాయి. వాడి విషయంలో అన్ని నిర్ణయాలు అన్మోల్ తీసుకోవాలనుకుంటాడు. నేను చెప్పేవాటిని అంగీకరించేవాడు కాదు. నాకు తెలిసి అందరి ఇళ్లలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయనుకుంటా! అయినా మా 12 ఏళ్ల బంధంలో ఇవన్నీ ముఖ్యమే. నేను డేటింగ్ చేసిన వ్యక్తి నాతో ఉంటాడా? వదిలేస్తాడా? అనుకునేదాన్ని. కానీ అతడితోనే ప్రేమలో పడి ఆపై శారీరకంగానూ దగ్గరయ్యాను. చివరికి ఆ బాయ్‌ఫ్రెండే నాకు భర్తయ్యాడు' అని చెప్పుకొచ్చింది అమృత. ఇదిలా ఉంటే అమృతరావు చివరగా ఠాక్రే సినిమాలో నటించింది. చదవండి: జవాన్ కోసం రెండు సినిమాలు వదిలేసుకున్న నటుడు!? టాలీవుడ్లో విషాదం: అలనాటి హీరో కన్నుమూత -
విడాకులు తీసుకున్న ప్రముఖ టెలివిజన్ కపుల్
TV Actors Aamir Ali Divorce With Sanjeeda Shaik After 9 Years Of Marriage: ప్రముఖ టెలివిజన్ కపుల్ అమీర్ అలీ- సంజీదా షేక్ విడాకులు తీసుకున్నారు. తమ 9ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గత కొన్నాళ్లుగా విడిగా ఉంటున్న ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై ఇప్పటివరకు స్పందించని ఈ జంట తాజాగా విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. 2012లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 2020లో సరోగసి ద్వారా ఐరా అనే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం రెండేళ్ల వయసున్న ఐరా కస్టడీని సంజీదా తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట ప్రముఖ రియాలిటీ షో నచ్ బలియే-3లో పాల్గొని విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
టీవీ నటితో ‘సావిత్రమ్మ గారి అబ్బాయి’ హీరో పెళ్లి.. ఫోటోలు వైరల్
టీవీ నటుడు, సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ హీరో బాలు (చందన్ కుమార్), నటి కవిత గౌడలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కేవలం ఇరుకుంటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య శుక్రవారం వీరి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇటీవల వీరి నిశ్చితార్థం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో రహస్యంగా జరిగిన సంగతి తెలిసిందే. కన్నడ లక్ష్మీ బారమ్మ(2013) సీరియల్లో వీరిద్దరూ చిన్ను, చందుగా ప్రధాన పాత్రలు పోషించారు. అదే సమయంలో ప్రేమలో పడిన చందన్, కవితలు అప్పటి నుంచి డేటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న(మే 14) పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. దీంతో వీరికి సినీ ప్రముఖలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక పెళ్లి అనంతరం చందన్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ఆంక్షలు అన్ని ఎత్తివేసి, సాధారణ పరిస్థితులు రాగానే అందరిని పిలిచి గ్రాండ్‌గా రిసెప్షన్ పార్టీ నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపాడు. తమ పెళ్లిని ముందుగా అనుకున్న ముహుర్తానికే జరిపించాలని కుటుంబ సభ్యులంతా నిర్ణయించారని, దీంతో కరోనా ప్రొటోకాల్ నడుమ ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ తమ వివాహ తంతు జరిపించినట్లు చందన్ వెల్లడించాడు. అయితే మాస్క్‌తో తమ వివాహ శుభకార్యంలో పాల్గొన్న వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవి చూసిన అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతుంటే, మరికొందరూ ‘మాస్క్‌తో ఒక్కటైన జంట’ అంటూ చమత్కరిస్తున్నారు. -
ఘనంగా టీవీ సెలబ్రిటీల వివాహం
న్యూఢిల్లీ: టీవీ సెలబ్రిటీలు కరణ్ వీర్ మెహ్రా, నిధి సేత్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఆదివారం ఉదయం వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. న్యూఢిల్లీలోని గురుద్వారలో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబాలతో పాటు అతి కొద్ది మంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లికి రాలేకపోయిన బుల్లితెర సెలబ్రిటీల కోసం వధూవరూలిద్దరూ ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే జనవరి 24వ తేదీనే ఎందుకు ముహూర్తం పెట్టుకున్నారన్న విషయాన్ని కూడా నిధి సేత్ గతంలోనే మీడియాకు వెల్లడించారు. 'పెళ్లెప్పుడు? అనుకున్నప్పుడు కొన్ని డేట్స్ అనుకున్నాం. అందులో ఒకటి డిసెంబర్లో కూడా వచ్చింది. అయితే 2021 నుంచే కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నాం. అలా ఆన్లైన్లో ఏ రోజు మంచిదా? అని వెతుకులాడితే జనవరి 24 బ్రహ్మాండంగా ఉందని తెలిసింది. అందుకే ఆ రోజు షూటింగ్‌కు బ్రేక్ చెప్పేశాను. ఎందుకంటే ఆ రోజే మా పెళ్లి జరగడం ఖాయం కాబట్టి!' అని పేర్కొంది. నిన్న మరో బాలీవుడ్ జంట వరుణ్ ధావన్- నటాషా దళాల్ కూడా ఏడడుగులు నడిచిన విషయం తెలిసిందే. (చదవండి: ఆర్జీవీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘డీ కంపెనీ’ టీజర్ విడుదల) కాగా కరణ్ వీర్ మెహ్రా 2005లో 'రీమిక్స్' షోతో బుల్లితెరపై అడుగు పెట్టాడు. తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి రాగిని ఎమ్ఎమ్ఎస్ 2, మేరే డాడ్‌కీ మారుతి, బ్లడ్ మనీ, బద్మాషీయాన్, ఆమెన్ వంటి పలు చిత్రాల్లో నటించాడు. 'పవిత్ర రిష్తా' సీరియల్లో నటనకుగానూ ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు దేవిక మెహ్రాను ఇదివరకే పెళ్లి చేసుకున్నప్పటికీ మనస్పర్థల కారణంగా 2009లో విడిపోయారు. తర్వాత తన సహనటి నిధి సేత్తో ప్రేమలో పడ్డ ఆయన ఆమెను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఇక నిధి సేత్ శ్రీమద్ భగ్వత్ మహాపురాణ్, మేరే డాడ్ కీ దుల్హాన్ వంటి పలు సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. (చదవండి: అమితాబ్ సెక్సిస్ట్ కమెంట్స్ దుమారం) View this post on Instagram A post shared by KaranVeerMehra (@karanveermehra) -
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు నటులు దుర్మరణం
ముంబయి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నటులు అక్కడిక్కడే మృతిచెందారు. షూటింగ్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా బుల్లితెర నటులు గగన్ కాంగ్(38), అర్జిత్ లావానియా(30)లు ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం అహ్మదాబాద్- ముంబయి రహదారిపై పాల్ఘార్ జిల్లాలోని మనోర్ వద్ద ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 'సంకటమోచన్ మహాబలి హనుమాన్' సీరియల్లో నటిస్తున్న గగన్ కాంగ్, అర్జిత్ లావానియాలు మరో సీరియల్ 'మహాకాళీ' షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. హనుమాన్ సీరియల్ తో పాపులర్ అయిన గగన్ 'మహాకాళీ'లో ఇంద్రుడి పాత్ర పోషిస్తుండగా, అతడి సహ నటుడు అర్జిత్ లావానికియా నందిగా నటిస్తున్నాడు. శుక్రవారం ఏకధాటిగా భారీ షెడ్యూల్ షూటింగ్లో పాల్గొన్న వీరు.. శనివారం ఉదయం షూటింగ్ ముగించుకుని ముంబయి బయల్దేరినట్లు సీరియల్ యూనిట్ సభ్యులు చెప్పారు. గగన్ కాంగ్ కారు నడుపుతుండగా, అర్జిత్ అతడి పక్క సీట్లో కూర్చున్నాడు. కారు పాల్ఘార్ జిల్లాలో మనోర్ వద్దకు రాగానే ఓ కంటైనర్ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. -
సీఆర్సీలో తళుక్కుమన్న తారలు
రావులపాలెం : రావులపాలెం కాస్మోపాలిట¯ŒS రిక్రియేష¯ŒS క్లబ్లో (సీఆర్సీ) శనివారం అర్థరాత్రి వరకూ జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో బుల్లి తెర తారలు తళుక్కుమన్నారు. ప్రముఖ యాంకర్ అశ్వని, టీవీ నటీమణులు మౌనిక, కీర్తి, సింగర్ మౌనిమలు తమ ఆటపాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా వారు సాక్షితో ముచ్చటించారు. తెలుగు, తమిళం నటిస్తున్నా తెలుగుతోపాటు తమిళ సీరియల్స్‌లోను నటిస్తున్నాను. ఇంత వరకూ 12 సీరియళ్లలో నటించాను. తూర్పు పడమర, పుత్తడిబొమ్మ సీరియల్స్ ద్వారా గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఆడదేఆధారం సీరియల్లో నటిస్తున్నాను. మాతృభాష కన్నడం అయినా తెలుగు, తమిళంలలో అవకాశాలు రావడం ఆనందంగా ఉంది. – కీర్తి, టీవీనటి బాహుబలితో పేరొచ్చింది బాహుబలి సినిమాలో పాడిన శివుణి ఆన పాటతో తెలుగులో మంచి పేరు వచ్చింది. ఇంత వరకూ సైజ్‌జీరో తదితర సినిమాల్లో సుమారు 25 పాటలు పాడాను. మాది కర్ణాటకలోని బెలగాం. – మౌనిమ, గాయని యాంకరింగ్‌తో గుర్తింపు యాంకరింగ్ ద్వారా 15 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. ఏటా ఏదో ఒక సంస్థ ద్వారా ఉత్తమ యాంకర్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. 25 సినిమాల్లో బాల నటిగా నటించాను. కొడుకు, హీరో చిత్రాలకు ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్నాను. ఛత్రపతి సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. గాయనిగా ఇటీవల 108 కీర్తనలు ఆలపించడం ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు సాధించాను. మా స్వస్థలం విశాఖపట్నం. కోనసీమలోని రావులపాలెం ప్రేక్షకుల ఆదరణ మరువలేనిది. – అశ్వని, యాంకర్ ఆటోభారతితో గుర్తింపు ఎన్నో టీవీ సీరియల్స్‌లో నటించాను. ఆటో భారతి సీరియల్ ద్వారా తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. మాది హైదరాబాద్ రాధామధు సీరియల్ కూడా మంచి పేరుతెచ్చింది. ప్రసుత్తం సప్తమాత్రిక సీరియల్లో నటిస్తున్నాను. – మౌనిక, టీవీనటి -
'అందుకే ఆమె పెళ్లికి వెళ్లలేదు'
ముంబై: బుల్లితెర నటీనటులు దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియ పెళ్లికి టెలివిజన్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సన్నిహితులు హాజరయ్యారు. దివ్యాంక వివాహానికి ఆమె సహనటుడు కరణ్ పటేల్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. చాలా సీరియల్స్ లో దివ్యాంక భర్తగా నటించిన కరణ్ పెళ్లికి ఎందుకు రాలేదని అందరూ చెవులు కొరుక్కున్నారు. జూలై 8న భోపాల్ లో దివ్యాంక-వివేక్ పెళ్లి జరిగింది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగానే దివ్యాంక పెళ్లికి రాలేకపోయానని, వేరే కారణాలు ఏమీ లేవని కరణ్ తెలిపాడు. 'దివ్యాంక పెళ్లికి తప్పనిసరిగా వెళ్లాలనుకున్నాను. ఓ టీవీ షో షూటింగ్లో బిజీగా ఉండడంతో వెళ్లలేకపోయాను. నేను ప్రధానపాత్ర పోషిస్తున్నందున షూటింగ్ కు విరామం ఇవ్వడం కుదరలేద'ని కరణ్ వెల్లడించాడు. పెళ్లి హాజరుకాలేకపోయిన అతడు తన భార్య అంకిత భార్గవతో కలిసి రిసెప్షన్ కు వెళ్లాడు. పెళ్లికి వెళ్లకపోవడంతో రిసెప్షన్ తప్పనిసరిగా వెళ్లాలనుకున్నానని కరణ్ చెప్పాడు. ఈద్ పండుగ రోజున షూటింగ్ కు వచ్చేందుకు అతడు ఒప్పుకోకపోవడంతో దివ్యాంక పెళ్లికి వెళ్లేందుకు సెలవు దొరకలేదని బయట ప్రచారం జరుగుతోంది. -
డేటింగ్ చేయబోమని సంతకం చేస్తేనే ఛాన్స్..
సినిమాలు, టీవీ షోలు, సీరియళ్లలో నటించేముందు నటీనటులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తుంటారు. ఎవరికీ ఎలాంటి అవాంతరాలు, సమస్యలు రాకుండా కొన్ని నిబంధనలు ఉంటాయి. అయితే హిందీ టీవీ షో నిర్వాహకులు ఓ అడుగు ముందుకేసి ఒప్పంద పత్రంలో 'నో డేటింగ్' క్లాజ్ చేర్చడం విమర్శలకు దారితీస్తోంది. తాము ఎవరితోనూ డేటింగ్ చేయడంలేదని, సింగిల్‌గా ఉంటామని హామీ ఇస్తూ ఒప్పంద పత్రంలో నటీనటులు సంతకాలు చేయాలి. రిష్టన్ కా సౌదాగర్- బాజీగర్ అనే టీవీ సిరీస్ కోసం నటీనటులు వత్సల్ సేథ్, ఇషితా దత్తా 'నో డేటింగ్' క్లాజ్ కూడిన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సీరియల్ త్వరలో ప్రసారంకానుంది. కాగా ఒప్పంద పత్రంలో 'నో డేటింగ్' క్లాజ్‌ను చేర్చడాన్ని పలువురు నటులు వ్యతిరేకించారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమని, కుటుంబ సభ్యులకు తప్ప ఇతరులకు వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించే హక్కు లేదని అన్నారు. ప్రేమ, బంధాలకు.. ఒప్పందాలతో సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు.