సీఆర్‌సీలో తళుక్కుమన్న తారలు
సీఆర్‌సీలో తళుక్కుమన్న తారలు
Published Sun, Jan 1 2017 10:43 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
రావులపాలెం :
రావులపాలెం కాస్మోపాలిట¯ŒS రిక్రియేష¯ŒS క్లబ్‌లో (సీఆర్‌సీ) శనివారం అర్థరాత్రి వరకూ జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో బుల్లి తెర తారలు తళుక్కుమన్నారు. ప్రముఖ యాంకర్ అశ్వని, టీవీ నటీమణులు మౌనిక, కీర్తి, సింగర్ మౌనిమలు తమ ఆటపాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా వారు సాక్షితో ముచ్చటించారు.
తెలుగు, తమిళం నటిస్తున్నా
తెలుగుతోపాటు తమిళ సీరియల్స్‌లోను నటిస్తున్నాను. ఇంత వరకూ 12 సీరియళ్లలో నటించాను. తూర్పు పడమర, పుత్తడిబొమ్మ సీరియల్స్ ద్వారా గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఆడదేఆధారం సీరియల్‌లో నటిస్తున్నాను. మాతృభాష కన్నడం అయినా తెలుగు, తమిళంలలో అవకాశాలు రావడం ఆనందంగా ఉంది.
– కీర్తి, టీవీనటి
బాహుబలితో పేరొచ్చింది
బాహుబలి సినిమాలో పాడిన శివుణి ఆన పాటతో తెలుగులో మంచి పేరు వచ్చింది. ఇంత వరకూ సైజ్‌జీరో తదితర సినిమాల్లో సుమారు 25 పాటలు పాడాను. మాది కర్ణాటకలోని బెలగాం.
– మౌనిమ, గాయని
యాంకరింగ్‌తో గుర్తింపు
యాంకరింగ్ ద్వారా 15 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. ఏటా ఏదో ఒక సంస్థ ద్వారా ఉత్తమ యాంకర్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. 25 సినిమాల్లో బాల నటిగా నటించాను. కొడుకు, హీరో చిత్రాలకు ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్నాను. ఛత్రపతి సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. గాయనిగా ఇటీవల 108 కీర్తనలు ఆలపించడం ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు సాధించాను. మా స్వస్థలం విశాఖపట్నం. కోనసీమలోని రావులపాలెం ప్రేక్షకుల ఆదరణ మరువలేనిది.
– అశ్వని, యాంకర్
ఆటోభారతితో గుర్తింపు
ఎన్నో టీవీ సీరియల్స్‌లో నటించాను. ఆటో భారతి సీరియల్ ద్వారా తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. మాది హైదరాబాద్ రాధామధు సీరియల్ కూడా మంచి పేరుతెచ్చింది. ప్రసుత్తం సప్తమాత్రిక సీరియల్‌లో నటిస్తున్నాను.
– మౌనిక, టీవీనటి
Advertisement
Advertisement