in ravulapalem
-
పోలీస్ దిగ్బంధంలో రావులపాలెం
భారీగా బలగాల మోహరింపు ప్రత్యేక బలగాలతో కవాతు డ్రో¯ŒS కెమెరాలతో నిఘా వాటర్‌కెనాన్, వజ్ర పోలీస్ వాహనాలు సిద్ధం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టే కాపు సత్యాగ్రహ పాదయాత్ర నేపథ్యంలో రావులపాలెం పోలీస్ దిగ్బంధంలో చిక్కుకుంది. స్థానిక కళావెంకట్రావు సెంటరులో బుధవారం ఉదయం నుంచి ముద్రగడ పాదయాత్ర ప్రారంభిస్తారని చేసిన ప్రకటనతో ఏలూరు రేంజ్ డీఐజీ పీవీ రామకృష్ణ, కృష్ణా జిల్లా ఎస్పీ విజయకుమార్, అడిషనల్ ఎస్పీలు ఏఆర్ దామోదర్, డీవీ సాగర్, శివారెడ్డి, మహిళా ఐపీఎస్ అజితతోపాటు ఆరుగురు డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, 25 మంది ఎస్ఐలు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. – రావులపాలెం (కొత్తపేట) రావులపాలెంలోనే సుమారు 500 మంది పోలీసులను మోహరించారు. అదనపు పోలీస్ బలగాలతోపాటు ఏపీఎస్పీ, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు రావులపాలెంలో బందోబస్తు చేస్తున్నారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఆందోళన కారులను చెదరగొట్టేందుకు వాటర్‌కెనాన్, వజ్ర పోలీస్ వాహనాలు రావులపా లెం సెంటరుకు తరలించారు. ప్రత్యేక బలగాల కవాతు రావులపాలెం చేరుకున్న ప్రత్యేక బలగాలతో స్థానిక కళావెంకట్రావు సెంటరు నుంచి అరటి మార్కెట్ యార్డు వరకూ అక్కడ నుంచి తిరిగి కళావెంకట్రావు సెంటరు వరకూ రింగ్‌రోడ్డు, మార్కెట్ రోడ్డు మీదుగా పోలీస్‌స్టేçÙ¯ŒS వరకూ కవాతు నిర్వహించారు. కృష్ణా జిల్లా ఎïస్పీ విజయకుమార్, అడిషనల్ ఎస్పీ ఏఆర్ దామోదర్ తదితర ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కవాతులు చేశారు. ఇదిలా ఉంటే డీఐజీ రామకృష్ణ రావులపాలెం మండల పరిషత్ కార్యాలయంలో పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితులపై చర్చించి పలు సూచనలు చేశారు. డోన్లతో పర్యవేక్షణ ముద్రగడ యాత్ర చేపడితే అణుఅణువు పరిశీలించేందుకు అధిక సంఖ్యలో డో¯ŒS కెమెరాలను సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం వీటిని ప్రయోగాత్మకంగా కళావెంకట్రావు సెంటరులో పరిశీలించారు. అడ్మిషనల్ ఎస్పీ ఏఆర్ దామోదర్, కృష్ణాజిల్లా ఎస్పీ విజయకుమార్ పర్యవేక్షణలో పలు డో¯ŒS కెమెరాలను నాలుగు వైపుల నుంచి ప్రయోగించి చూశారు. దీంతో ప్రజలు వీటని ఆసక్తిగా తిలకించారు. -
సీఆర్సీలో తళుక్కుమన్న తారలు
రావులపాలెం : రావులపాలెం కాస్మోపాలిట¯ŒS రిక్రియేష¯ŒS క్లబ్లో (సీఆర్సీ) శనివారం అర్థరాత్రి వరకూ జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో బుల్లి తెర తారలు తళుక్కుమన్నారు. ప్రముఖ యాంకర్ అశ్వని, టీవీ నటీమణులు మౌనిక, కీర్తి, సింగర్ మౌనిమలు తమ ఆటపాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా వారు సాక్షితో ముచ్చటించారు. తెలుగు, తమిళం నటిస్తున్నా తెలుగుతోపాటు తమిళ సీరియల్స్‌లోను నటిస్తున్నాను. ఇంత వరకూ 12 సీరియళ్లలో నటించాను. తూర్పు పడమర, పుత్తడిబొమ్మ సీరియల్స్ ద్వారా గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఆడదేఆధారం సీరియల్లో నటిస్తున్నాను. మాతృభాష కన్నడం అయినా తెలుగు, తమిళంలలో అవకాశాలు రావడం ఆనందంగా ఉంది. – కీర్తి, టీవీనటి బాహుబలితో పేరొచ్చింది బాహుబలి సినిమాలో పాడిన శివుణి ఆన పాటతో తెలుగులో మంచి పేరు వచ్చింది. ఇంత వరకూ సైజ్‌జీరో తదితర సినిమాల్లో సుమారు 25 పాటలు పాడాను. మాది కర్ణాటకలోని బెలగాం. – మౌనిమ, గాయని యాంకరింగ్‌తో గుర్తింపు యాంకరింగ్ ద్వారా 15 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. ఏటా ఏదో ఒక సంస్థ ద్వారా ఉత్తమ యాంకర్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. 25 సినిమాల్లో బాల నటిగా నటించాను. కొడుకు, హీరో చిత్రాలకు ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్నాను. ఛత్రపతి సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. గాయనిగా ఇటీవల 108 కీర్తనలు ఆలపించడం ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు సాధించాను. మా స్వస్థలం విశాఖపట్నం. కోనసీమలోని రావులపాలెం ప్రేక్షకుల ఆదరణ మరువలేనిది. – అశ్వని, యాంకర్ ఆటోభారతితో గుర్తింపు ఎన్నో టీవీ సీరియల్స్‌లో నటించాను. ఆటో భారతి సీరియల్ ద్వారా తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. మాది హైదరాబాద్ రాధామధు సీరియల్ కూడా మంచి పేరుతెచ్చింది. ప్రసుత్తం సప్తమాత్రిక సీరియల్లో నటిస్తున్నాను. – మౌనిక, టీవీనటి -
‘జయమ్ము నిశ్చయమ్మురా’కు అపూర్వ ఆదరణ
రావులపాలెం : ఇటీవల విడుదలైన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రానికి ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభించడంతో చిత్రం ఘనం విజయం సాధించిందని ఆ చిత్రంలో విల¯ŒSగా నటించిన రుద్రరాజు రవివర్మ తెలిపారు. స్థానిక పద్మశ్రీ థియేటర్లో ప్రదర్శితమవుతున్న భేతాళుడు చిత్రాన్ని శనివారం రాత్రి ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగులో ఇంత వరకూ సుమారు 30 చిత్రాల్లో నటించానన్నారు. వెన్నెల, రాఖీ, బొమ్మరిల్లు, రెడీ, జల్సా, క్షణం, అసుర, తదితర చిత్రాలు తనకు గుర్తింపు తెచ్చాయన్నారు. కాలింగ్ బెల్ చిత్రంలో హీరోగా నటించానన్నారు. తెలుగులో క్షణం సినిమా విజయం సాధించడంతో తమిళంలో కూడా నిర్మిస్తున్నారని, అందులో కూడా తాను అదే పాత్రలో నటిస్తున్నానన్నారు. ఆ చిత్రానికి భేతాళుడు చిత్ర దర్శకుడు ప్రదీప్‌కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారని తెలిపారు. గాజీ అనే తెలుగు, హిందీ ద్విభాషా చిత్రంలోనూ తాను నటిస్తునని, ఆ చిత్రానికి రాణా హీరో అని చెప్పారు. నెపోలియ¯ŒS అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నానని తెలిపారు. కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో సముద్ర అందాలతో తెరకెక్కిన జయమ్ము నిశ్చయమ్మురా విజయం సాధించిందని, అయితే నోట్ల రద్దు ప్రభావం కొంత మేర పడిందన్నారు. ఆ¯ŒSలై¯ŒSలో టికెట్లు విక్రయాలు జరిగిన అన్ని థియేటర్లు హౌస్‌పుల్‌గా నడుస్తున్నాయన్నారు. నోట్ల రద్దు ప్రభావం ఉంటుందని తెలిసినా కథపై నమ్మకంతో సాహసోపేతంగా చిత్రాన్ని విడుదల చేశామని, దానికి తగినట్టుగానే ప్రేక్షకుల ఆదరణ లభించిందన్నారు. కాకినాడ, రాజమండ్రి, తదితర ప్రాంతాల్లో విజయోత్సవయాత్రలో భాగంగా రావులపాలెం వచ్చానన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తనకు బంధువులు ఉన్నారని తెలిపారు. తాను ఈ కోనసీమ కుర్రోడినేనని చెప్పారు. తొలుత ఆయనకు థియేటర్ మేనేజర్ సత్తిబాబు, సిబ్బంది స్వాగతం పలికారు.