పోలీస్ దిగ్బంధంలో రావులపాలెం
-
భారీగా బలగాల మోహరింపు ప్రత్యేక బలగాలతో కవాతు
-
డ్రో¯ŒS కెమెరాలతో నిఘా
-
వాటర్‌కెనాన్, వజ్ర పోలీస్ వాహనాలు సిద్ధం
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టే కాపు సత్యాగ్రహ పాదయాత్ర నేపథ్యంలో రావులపాలెం పోలీస్ దిగ్బంధంలో చిక్కుకుంది. స్థానిక కళావెంకట్రావు సెంటరులో బుధవారం ఉదయం నుంచి ముద్రగడ పాదయాత్ర ప్రారంభిస్తారని చేసిన ప్రకటనతో ఏలూరు రేంజ్ డీఐజీ పీవీ రామకృష్ణ, కృష్ణా జిల్లా ఎస్పీ విజయకుమార్, అడిషనల్ ఎస్పీలు ఏఆర్ దామోదర్, డీవీ సాగర్, శివారెడ్డి, మహిళా ఐపీఎస్ అజితతోపాటు ఆరుగురు డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, 25 మంది
ఎస్‌ఐలు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
– రావులపాలెం (కొత్తపేట)
రావులపాలెంలోనే సుమారు 500 మంది పోలీసులను మోహరించారు. అదనపు పోలీస్ బలగాలతోపాటు ఏపీఎస్‌పీ, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు రావులపాలెంలో బందోబస్తు చేస్తున్నారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఆందోళన కారులను చెదరగొట్టేందుకు వాటర్‌కెనాన్, వజ్ర పోలీస్ వాహనాలు రావులపా లెం సెంటరుకు తరలించారు.
ప్రత్యేక బలగాల కవాతు
రావులపాలెం చేరుకున్న ప్రత్యేక బలగాలతో స్థానిక కళావెంకట్రావు సెంటరు నుంచి అరటి మార్కెట్ యార్డు వరకూ అక్కడ నుంచి తిరిగి కళావెంకట్రావు సెంటరు వరకూ రింగ్‌రోడ్డు, మార్కెట్ రోడ్డు మీదుగా పోలీస్‌స్టేçÙ¯ŒS వరకూ కవాతు నిర్వహించారు. కృష్ణా జిల్లా ఎïస్పీ విజయకుమార్, అడిషనల్ ఎస్పీ ఏఆర్ దామోదర్ తదితర ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కవాతులు చేశారు. ఇదిలా ఉంటే డీఐజీ రామకృష్ణ రావులపాలెం మండల పరిషత్ కార్యాలయంలో పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితులపై చర్చించి పలు సూచనలు చేశారు.
డోన్లతో పర్యవేక్షణ
ముద్రగడ యాత్ర చేపడితే అణుఅణువు పరిశీలించేందుకు అధిక సంఖ్యలో డో¯ŒS కెమెరాలను సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం వీటిని ప్రయోగాత్మకంగా కళావెంకట్రావు సెంటరులో పరిశీలించారు. అడ్మిషనల్ ఎస్పీ ఏఆర్ దామోదర్, కృష్ణాజిల్లా ఎస్పీ విజయకుమార్ పర్యవేక్షణలో పలు డో¯ŒS కెమెరాలను నాలుగు వైపుల నుంచి ప్రయోగించి చూశారు. దీంతో ప్రజలు వీటని ఆసక్తిగా తిలకించారు.