TV Actor Aamir Ali Divorce With Sanjeeda Shaik After 9 Years Of Marriage - Sakshi
Sakshi News home page

Aamir Ali Sanjeeda Divorce: విడాకులతో 9ఏళ్ల వివాహ బంధానికి ముగింపు..

Published Thu, Jan 6 2022 8:00 PM | Last Updated on Fri, Jan 7 2022 12:11 AM

TV Actors Aamir Ali Divorce With Sanjeeda Shaik After 9 Years Of Marriage - Sakshi

TV Actors Aamir Ali Divorce With Sanjeeda Shaik After 9 Years Of Marriage: ప్రముఖ టెలివిజన్‌ కపుల్‌ అమీర్‌ అలీ- సంజీదా షేక్‌ విడాకులు తీసుకున్నారు. తమ 9ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. గత కొన్నాళ్లుగా విడిగా ఉంటున్న ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే దీనిపై ఇప్పటివరకు స్పందించని ఈ జంట తాజాగా విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్‌ ఇచ్చారు. 2012లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 2020లో సరోగసి ద్వారా ఐరా అనే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.

ప్రస్తుతం రెండేళ్ల వయసున్న ఐరా కస్టడీని సంజీదా తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట ప్రముఖ రియాలిటీ షో నచ్‌ బలియే-3లో పాల్గొని విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement