Television actors
-
విడాకులు తీసుకున్న ప్రముఖ టెలివిజన్ కపుల్
TV Actors Aamir Ali Divorce With Sanjeeda Shaik After 9 Years Of Marriage: ప్రముఖ టెలివిజన్ కపుల్ అమీర్ అలీ- సంజీదా షేక్ విడాకులు తీసుకున్నారు. తమ 9ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గత కొన్నాళ్లుగా విడిగా ఉంటున్న ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై ఇప్పటివరకు స్పందించని ఈ జంట తాజాగా విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. 2012లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 2020లో సరోగసి ద్వారా ఐరా అనే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం రెండేళ్ల వయసున్న ఐరా కస్టడీని సంజీదా తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట ప్రముఖ రియాలిటీ షో నచ్ బలియే-3లో పాల్గొని విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
బుల్లితెర నటులతో ‘పేటీఎం యూపీఐ’ ప్రచారం
హైదరాబాద్: యూపీఐ నగదు బదిలీలు, లావాదేవీలపై వినియోగదారుల్లో అవగాహన కలి్పంచేందుకు పేటీఎం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం బుల్లితెర నటులు నిరుపమ్ పరిటాల, మేఘన లోకేష్, లాస్య మంజునాథ్, అలీ రెజాతో ‘మై చాయిస్ మైపేటీఎం’ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇది కొనసాగుతుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. యూపీఐ నగదు బదిలీలు, పేటీఎం యాప్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించనున్నట్టు పేర్కొంది. వినియోగదారులు పేటీఎంలో తమ బ్యాంకు అకౌంట్‌ను ఎలా సులభంగా లింక్ చేసుకోవాలి, బ్యాంక్ బ్యాలన్స్‌ను చూసుకోవడం, బ్యాంకు ఖాతా నుంచే నేరుగా మొబైల్ నంబర్‌కు నగదు బదిలీ చేసుకోవడం ఎలా అన్నది తెలియజేయనున్నట్టు ప్రకటించింది. -
అనువాద సీరియళ్లను ఆపేయాలి
తమిళసినిమా: తమిళేతర భాషా టీవీ సీరియళ్ల ప్రచారాలను నిలిపి వేయాలంటూ బుల్లితెర నటీనటులు, ఇతర సాంకేతిక వర్గం బుధవారం షూటింగ్‌లను రద్దుచేసి చానళ్ల నిర్వాహకులకు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇటీవల పనిలేక ఆర్థిక సమస్యలతో బుల్లితెర దర్శకుడు బాలాజి యాదవ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చాలాకాలం నుంచి బుల్లితెర కళాకారుల సంఘం అనువాద సీరియళ్ల ప్రచారాన్ని వ్యతిరేకిస్తోంది. అనువాద సీరియళ్ల కారణంగా బుల్లితెర కళాకారులకు పని లేకుండా పోతోందని, చాలామంది ఆర్థిక సమస్యలకు గురవుతున్నారని టీవీ చానళ్ల యాజమాన్యానికి తమ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే వారు అనువాద సీరియళ్లను ప్రచారం చేస్తూ బుల్లితెర కళాకారుల గోడును పట్టించుకోకపోవడంతో బుధవారం బుల్లితెర నటీనటులు ఆధ్వర్యంలో ఒక రోజు షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలను రద్దు చేయాలని తీర్మానం చేశారు. ఈ సమాఖ్యకు దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య మద్దతు పలికింది. ఈ సందర్భంగా బుల్లితెర నటీనటులు, ఇతర సాంకేతిక వర్గం బుధవారం ఉదయం స్థానిక వడపళనిలోని సంగీత కళాకారుల కార్యాలయంలో సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నటి రాధిక, నళిని, పెప్సీ అధ్యక్షుడు శివ, దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, త్యాగరాజన్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు బుల్లితెర నటీనటుల సమాఖ్య టీవీ చానళ్ల కార్యాలయాలకు వెల్లి అనువాద సీరియళ్ల ప్రచారాలను నిలిపి వేయాల్సిందిగా వినతి పత్రాన్ని అందించాలని తీర్మానించింది. -
టీవీ ఆర్టిస్ట్ విజయరాణిపై కేసు నమోదు
హైదరాబాద్ : చిట్టీల పేరుతో జూనియర్ ఆర్టిస్టులను రూ.10 కోట్ల మేర నిండా ముంచిన నటి బత్తుల విజయరాణిపై సీసీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ సందర్భంగా సీసీఎస్ డీసీపీ పాలరాజు మాట్లాడుతూ విజయరాణి సుమారు రూ.5 కోట్లు వసూలు చేసినట్లు 120మంది బాధితుల నుంచి ఫిర్యాదులు అందాయని తెలిపారు. రెండు దర్యాప్తు బృందాలతో విచారణ కొసాగుతోందని ఆయన పేర్కొన్నారు. కాగా కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన బత్తుల విజయరాణి (46) టీవీ సీరియల్స్‌లో నటిస్తూ అమీర్‌పేట న్యూ శాస్త్రినగర్‌లో నివాసముంటోంది. 12 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం కూడా నడుపుతోంది. రూ. 5లక్షల నుంచి రూ. 50 లక్షల విలువైన చిట్టీల్లో సుమారు 400 మంది నటులు సభ్యులుగా చేరారు. గత నాలుగైదు నెలలుగా చిట్టీలు పాడిన వారికి ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో వారు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. రేపు మాపు అంటూ విజయరాణి వాయిదా వేస్తూ వస్తోంది. ఇది తెలిసి ఆమెకు లక్షల రూపాయల్లో బదులు ఇచ్చిన మరికొందరు కూడా తమ డబ్బులు తిరిగిచ్చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో విజయరాణి ఉన్నట్లుండి బుధవారం నుంచీ కనిపించకుండా పోయింది. దీనిపై బాధితులు జూనియర్ ఆర్టిస్టుల సంఘాన్ని ఆశ్రయించగా.. వారు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో వారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీసీపీ జి.పాలరాజును ఆశ్రయించారు. ఆ తర్వాత నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. -
చిట్టీల పేరుతో టీవీ నటి దగా
400 మంది తోటి నటులకు రూ.10 కోట్ల మేర టోపీ! హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన బాధితులు సాక్షి, హైదరాబాద్: బుల్లితెర నటులను నమ్మించి చిట్టీల పేరుతో రూ.10 కోట్ల మేర నిండా ముంచిన ఓ నటి వ్యవహారం వెలుగు చూసింది. 46 మంది బాధితులు గురువారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మను కలసి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. బత్తుల విజయరాణి(46) అనే టీవీ సీరియల్ ఆర్టిస్టు రూ. 5.35 కోట్ల రూపాయల మేర తమకు చెల్లించాల్సి ఉందని, న్యాయం చేయాలని వారు కోరారు. అయితే, బాధితుల సంఖ్య 400 మంది వరకు ఉంటుందని.. వీరందరికీ విజయరాణి చెల్లించాల్సిన మొతాన్ని లెక్కిస్తే రూ. 10కోట్ల మేర ఉంటుందని కొందరు మీడియాకు తెలిపారు. బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన బత్తుల విజయరాణి (46) టీవీ సీరియల్స్‌లో నటిస్తూ అమీర్‌పేట న్యూ శాస్త్రినగర్‌లో నివాసముంటోంది. 12 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం కూడా నడుపుతోంది. రూ. 5లక్షల నుంచి రూ. 50 లక్షల విలువైన చిట్టీల్లో సుమారు 400 మంది నటులు సభ్యులుగా చేరారు. గత నాలుగైదు నెలలుగా చిట్టీలు పాడిన వారికి ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో వారు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. రేపు మాపు అంటూ విజయరాణి వాయిదా వేస్తూ వస్తోంది. ఇది తెలిసి ఆమెకు లక్షల రూపాయల్లో బదులు ఇచ్చిన మరికొందరు కూడా తమ డబ్బులు తిరిగిచ్చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో విజయరాణి ఉన్నట్లుండి బుధవారం నుంచీ కనిపించకుండా పోయింది. దీనిపై బాధితులు జూనియర్ ఆర్టిస్టుల సంఘాన్ని ఆశ్రయించగా.. వారు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో వారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీసీపీ జి.పాలరాజును ఆశ్రయించారు. ఆ తర్వాత నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.