హైదరాబాద్: యూపీఐ నగదు బదిలీలు, లావాదేవీలపై వినియోగదారుల్లో అవగాహన కలి్పంచేందుకు పేటీఎం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం బుల్లితెర నటులు నిరుపమ్ పరిటాల, మేఘన లోకేష్, లాస్య మంజునాథ్, అలీ రెజాతో ‘మై చాయిస్ మైపేటీఎం’ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇది కొనసాగుతుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. యూపీఐ నగదు బదిలీలు, పేటీఎం యాప్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించనున్నట్టు పేర్కొంది. వినియోగదారులు పేటీఎంలో తమ బ్యాంకు అకౌంట్‌ను ఎలా సులభంగా లింక్ చేసుకోవాలి, బ్యాంక్ బ్యాలన్స్‌ను చూసుకోవడం, బ్యాంకు ఖాతా నుంచే నేరుగా మొబైల్ నంబర్‌కు నగదు బదిలీ చేసుకోవడం ఎలా అన్నది తెలియజేయనున్నట్టు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment