cash transfers
-
బుల్లితెర నటులతో ‘పేటీఎం యూపీఐ’ ప్రచారం
హైదరాబాద్: యూపీఐ నగదు బదిలీలు, లావాదేవీలపై వినియోగదారుల్లో అవగాహన కలి్పంచేందుకు పేటీఎం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం బుల్లితెర నటులు నిరుపమ్ పరిటాల, మేఘన లోకేష్, లాస్య మంజునాథ్, అలీ రెజాతో ‘మై చాయిస్ మైపేటీఎం’ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇది కొనసాగుతుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. యూపీఐ నగదు బదిలీలు, పేటీఎం యాప్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించనున్నట్టు పేర్కొంది. వినియోగదారులు పేటీఎంలో తమ బ్యాంకు అకౌంట్‌ను ఎలా సులభంగా లింక్ చేసుకోవాలి, బ్యాంక్ బ్యాలన్స్‌ను చూసుకోవడం, బ్యాంకు ఖాతా నుంచే నేరుగా మొబైల్ నంబర్‌కు నగదు బదిలీ చేసుకోవడం ఎలా అన్నది తెలియజేయనున్నట్టు ప్రకటించింది. -
నేటి నుంచి బ్యాంక్ ఖాతాకే నగదు బదిలీ
న్యూఢిల్లీ : వంట గ్యాస్ వినియోగదారులకు అమలు చేస్తున్న నగదు బదిలీ పథకం రెండో దశ దేశవ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైంది. మొత్తం 630 జిల్లాల్లో ఈ పథకం అమలు అయ్యింది. మొదటి దశలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 12 జిల్లాలను ఎంపిక చేయగా....మిగిలిన జిల్లాలను రెండో దశలో చేర్చారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో...తాజాగా ఈ పథకం అమల్లోకి వచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్ లో విశాఖ, విజయనగరం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో గురువారం నుంచి పథకం అమల్లోకి వచ్చింది. తొలి దశలో తలెత్తిన సాంకేతిక సమస్యల దృష్ట్యా....అధికారులు ఈ సారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వంట గ్యాస్ సబ్సిడిని పొందేందుకు ఆధార్ కార్డు లేదా బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోకపోతే....బహిరంగ మార్కెట్ ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
7జిల్లాల్లో నగదు బదలీ పధకం
-
అక్టోబర్ నుంచి నగదు బదిలీ
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: జిల్లాలో నగదు బదిలీ పథకం అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుందని పౌరసరఫరాల జిల్లా అధికారి ఎం.గౌరీశంకర్ తెలిపారు. అశ్వరావుపేట తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 85శాతం ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తయిందన్నారు. నగదు బదిలీని అక్టోబర్ నెలలో జిల్లాలో ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. గ్యాస్ వినియోగదారులు అక్టోబర్ కల్లా ఆధార్ నంబరును ఎల్పీజీ డీలర్‌కు, బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయించుకోవాలన్నారు. ఆధార్ సంఖ్యను నమోదు చేయించుకోకున్నా మూడు నెలలపాటు సబ్సిడీ అందుతుందని, ఆతర్వాత బహిరంగ మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సిందేనని అన్నారు. రచ్చబండ రెండో దశలో వచ్చి రేషన్‌కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయిందన్నారు. రేషన్‌కార్డుల నంబర్లు జారీ అయ్యాయని, లబ్ధిదారుల ఫొటోలు సేకరించి వెబ్సైట్లో అప్లోడ్ చేయగానే కార్డులు జారీ చేస్తామని తెలిపారు. రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారు తహశీల్దార్ కార్యాలయాల్లోని జాబితాను చూసుకోవాలన్నారు. కార్డు మంజూరైన వారు ఫొటోలను కార్యాలయంలో అందించాలని సూచించారు. జిల్లాలో 29,800 కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. అశ్వారావుపేట మండలంలో 261 కార్డులు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఫొటోలను ఆన్లైన్లో పొందుపర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని వీర్వోలను ఆదేశించామన్నారు. దీపం పథకం ద్వారా 34 వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. 9,331 కనెక్షన్లకు ప్రతిపాదనలు రావాల్సి ఉందని, 13,189 కనెక్షన్లకు పంపిణీ ప్రక్రియ పూర్తయిందని వివరించారు. విలేకరుల సమావేశంలో తహశీల్దార్ వెంకారెడ్డి పాల్గొన్నారు.