న్యూఢిల్లీ : వంట గ్యాస్ వినియోగదారులకు అమలు చేస్తున్న నగదు బదిలీ పథకం రెండో దశ దేశవ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైంది. మొత్తం 630 జిల్లాల్లో ఈ పథకం అమలు అయ్యింది. మొదటి దశలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 12 జిల్లాలను ఎంపిక చేయగా....మిగిలిన జిల్లాలను రెండో దశలో చేర్చారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో...తాజాగా ఈ పథకం అమల్లోకి వచ్చింది.
అటు ఆంధ్రప్రదేశ్ లో విశాఖ, విజయనగరం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో గురువారం నుంచి పథకం అమల్లోకి వచ్చింది. తొలి దశలో తలెత్తిన సాంకేతిక సమస్యల దృష్ట్యా....అధికారులు ఈ సారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వంట గ్యాస్ సబ్సిడిని పొందేందుకు ఆధార్ కార్డు లేదా బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోకపోతే....బహిరంగ మార్కెట్ ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
నేటి నుంచి బ్యాంక్ ఖాతాకే నగదు బదిలీ
Published Thu, Jan 1 2015 11:42 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
Advertisement
Advertisement