తెలంగాణ, ఏపీల్లో 7 సహాయ కేంద్రాలు | aadhar number registraion centers in telangana and andhra pradesh | Sakshi
Sakshi News home page

తెలంగాణ, ఏపీల్లో 7 సహాయ కేంద్రాలు

Published Mon, Dec 5 2016 4:05 AM | Last Updated on Fri, May 25 2018 6:14 PM

తెలంగాణ, ఏపీల్లో 7 సహాయ కేంద్రాలు - Sakshi

తెలంగాణ, ఏపీల్లో 7 సహాయ కేంద్రాలు

  • జేఈఈలో ఆధార్ అనుసంధానంపై ఏర్పాటు
  • సాక్షి, అమరావతి: ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులో ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీంతో విద్యా ర్థుల సౌకర్యార్థం సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఏపీలో 4, తెలంగాణలో 3 ముఖ్యపట్టణాల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జేఈఈ ఆన్‌లైన్ దరఖాస్తుల్లో అభ్యర్థులు ఆధార్ నంబర్‌ను, అభ్యర్థి పేరు, పుట్టిన తేదీలను తప్పనిసరిగా నమోదు చేయాలి.

    ఆధార్ లేని విద్యార్థులు ఆధార్ కార్డులు జారీచేసే ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యూఐ డీఏఐ.జీవోవీ.ఇన్’ వెబ్‌సైట్లో ఆధార్‌కార్డు కోసం నమోదు చేసుకో వచ్చని సూచించించింది. దీంతోపాటు సీబీ ఎస్‌ఈ తరఫున దేశవ్యాప్తంగా సహాయ కేంద్రా లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సెంటర్ల పేర్లు, ఎక్కడున్నాయో చిరునామాలతో సహా జేఈఈ మెయిన్-2017 వెబ్‌సైట్లో పొందు పరిచారు. ఆధార్ కేంద్రాలు అందుబాటులో లేని అభ్యర్థులు నమోదు కోసం సహాయకేంద్రాల్లో దరఖాస్తు అందిస్తే వారు రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తా రని, ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌ను  ఆన్‌లైన్ దరఖాస్తులో నమోదు చేయవచ్చని వివరించింది.
     
     ఆధార్ సహాయ కేంద్రాలు ఇవీ..
     ప్రాంతం                      కేంద్రం
     గుంటూరు:    డాక్టర్ కేఎల్‌పీ పబ్లిక్ స్కూల్, జేకేసీ కాలేజీ రోడ్, గుంటూరు,
     తిరుపతి:    కేంద్రీయ విద్యాలయం-1, రామ్‌నగర్ ఏరియా, చెన్నారెడ్డి కాలనీ
     విజయవాడ:  కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ స్కూల్, కానూరు
     విశాఖపట్నం:  కేంద్రీయవిద్యాలయం, ఎన్‌ఏడీ పోస్టు,
     హైదరాబాద్:  డీఏవీ పబ్లిక్ స్కూల్ సఫిల్‌గూడ, సంతోషిమా నగర్, నేరేడ్‌మెట్
     ఖమ్మం:    హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్, మమత హాస్పిటల్ దగ్గర, పాకబండ బజార్
     వరంగల్:    సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్, పాత బస్‌డిపో రోడ్డు, హన్మకొండ
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement