'అందుకే ఆమె పెళ్లికి వెళ్లలేదు' | What stopped Karan Patel from attending Divyanka Tripathi’s wedding | Sakshi
Sakshi News home page

'అందుకే ఆమె పెళ్లికి వెళ్లలేదు'

Published Fri, Jul 15 2016 1:56 PM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

'అందుకే ఆమె పెళ్లికి వెళ్లలేదు'

'అందుకే ఆమె పెళ్లికి వెళ్లలేదు'

ముంబై: బుల్లితెర నటీనటులు దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియ పెళ్లికి టెలివిజన్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సన్నిహితులు హాజరయ్యారు. దివ్యాంక వివాహానికి ఆమె సహనటుడు కరణ్ పటేల్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. చాలా సీరియల్స్ లో దివ్యాంక భర్తగా నటించిన కరణ్ పెళ్లికి ఎందుకు రాలేదని అందరూ చెవులు కొరుక్కున్నారు. జూలై 8న భోపాల్ లో దివ్యాంక-వివేక్‌ పెళ్లి జరిగింది.

అయితే బిజీ షెడ్యూల్ కారణంగానే దివ్యాంక పెళ్లికి రాలేకపోయానని, వేరే కారణాలు ఏమీ లేవని కరణ్‌ తెలిపాడు. 'దివ్యాంక పెళ్లికి తప్పనిసరిగా వెళ్లాలనుకున్నాను. ఓ టీవీ షో షూటింగ్లో బిజీగా ఉండడంతో వెళ్లలేకపోయాను. నేను ప్రధానపాత్ర పోషిస్తున్నందున షూటింగ్ కు విరామం ఇవ్వడం కుదరలేద'ని కరణ్ వెల్లడించాడు.

పెళ్లి హాజరుకాలేకపోయిన అతడు తన భార్య అంకిత భార్గవతో కలిసి రిసెప్షన్ కు వెళ్లాడు. పెళ్లికి వెళ్లకపోవడంతో రిసెప్షన్ తప్పనిసరిగా వెళ్లాలనుకున్నానని కరణ్ చెప్పాడు. ఈద్ పండుగ రోజున షూటింగ్ కు వచ్చేందుకు అతడు ఒప్పుకోకపోవడంతో దివ్యాంక పెళ్లికి వెళ్లేందుకు సెలవు దొరకలేదని బయట ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement