నా మొదటి భార్య అలాంటిది.. అందుకే రెండో పెళ్లి: నటుడు | Malayalam Actor Kris Venugopal about His First Wife | Sakshi
Sakshi News home page

మొదటి భార్య నా స్వేచ్ఛను హరించింది.. అందుకే రెండో పెళ్లి!

Published Mon, Nov 4 2024 6:55 PM | Last Updated on Mon, Nov 4 2024 7:23 PM

Malayalam Actor Kris Venugopal about His First Wife

ఈ రోజుల్లో బట్టతల, బయటకు తన్నుకొచ్చిన పొట్ట కామన్‌ అయిపోయింది. కానీ పెళ్లి చేసుకునేవరకైనా ఆ రెండింటినీ అడ్డుకోవాలని లేదా కవర్‌ చేసుకోవాలని ప్రయత్నించేవాళ్లు బోలెడు. అయితే మలయాళ బుల్లితెర నటుడు క్రిస్‌ వేణుగోపాల్‌ మాత్రం నెరిసిన గడ్డం, బట్టతలతోనే పెళ్లి చేసుకున్నాడు. ముసలాడిగానే పెళ్లిపీటలపై కూర్చుని ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేశాడు. పిల్లల ఎదుటే రెండో పెళ్లి చేసుకున్నాడు.

దంపతులపై ట్రోలింగ్‌
ఇది చూసిన జనం నోరెళ్లబెట్టారు. సోషల్‌ మీడియా వేదికగా వేణుగోపాల్‌ను, నటి దివ్య శ్రీధర్‌ను తిట్టిపోస్తున్నారు. ఈ వయసులో రెండో పెళ్లేంటని విమర్శిస్తున్నారు. ఈ ట్రోలింగ్‌తో కొత్త జంట ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో దివ్య శ్రీధర్‌ స్పందిస్తూ.. తమ వయసు మరీ ఎక్కువేమి కాదని పెదవి విప్పింది. తన వయసు 40, క్రిస్‌ వయసు 49 అని పేర్కొంది. తాము శారీరక వాంఛ కోసం పెళ్లి చేసుకోలేదని, ఒకరికొకరం తోడు కోరుకున్నామని వెల్లడించింది.

కుటుంబానికి కూడా దూరం
క్రిస్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. మొదటి భార్యతో నేను సంతోషంగా లేను. నా స్వేచ్ఛను దూరం చేసింది. ఆమె నా కుటుంబంతో కూడా మాట్లాడనిచ్చేదికాదు. ఎన్నో షరతులు విధించేది. ఎవరూ మా ఇంటికి వచ్చేవారు కాదు. కనీసం ఫోన్‌లో మాట్లాడేందుకు కూడా ఒప్పుకునేది కాదు. నేను మనిషిలా కాకుండా ఒక పెంపుడు జంతువులా ఉండేవాడిని. జీవితంపైనే విరక్తి వచ్చింది. దాని నుంచి విముక్తి కోరుకున్నాను.

అందుకే రెండో పెళ్లి
2019లో విడాకులకు దరఖాస్తు చేయగా 2022లో మంజూరయ్యాయి. కానీ కొన్ని నెలలకు ఏ తోడూ లేకుండా బతకడం కష్టంగా అనిపించింది. అందుకే దివ్యను పెళ్లి చేసుకున్నాను. చాలామంది మా రెండో పెళ్లి గురించి తప్పుగా మాట్లాడుతుంటే బాధగా ఉంది అన్నాడు. కాగా క్రిస్‌ వేణుగోపాల్‌, దివ్య శ్రీధర్‌.. ఇద్దరికీ ఇది రెండో వివాహమే! క్రిస్‌ వేణుగోపాల్‌ పాతరమట్టు సీరియల్‌లో తాతగా నటించాడు. పలు సీరియల్స్‌లో యాక్ట్‌ చేసిన ఇతడు పల్లు రైజింగ్‌, తెలివు, సంబవస్తలతు నిన్నుమ్‌ వంటి చిత్రాల్లోనూ నటించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement