డేటింగ్ చేయబోమని సంతకం చేస్తేనే ఛాన్స్.. | No dating clause: TV actors sign contracts promising they’ll stay single | Sakshi
Sakshi News home page

డేటింగ్ చేయబోమని సంతకం చేస్తేనే ఛాన్స్..

Published Wed, Jun 15 2016 7:06 PM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

డేటింగ్ చేయబోమని సంతకం చేస్తేనే ఛాన్స్..

డేటింగ్ చేయబోమని సంతకం చేస్తేనే ఛాన్స్..

సినిమాలు, టీవీ షోలు, సీరియళ్లలో నటించేముందు నటీనటులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తుంటారు. ఎవరికీ ఎలాంటి అవాంతరాలు, సమస్యలు రాకుండా కొన్ని నిబంధనలు ఉంటాయి. అయితే హిందీ టీవీ షో నిర్వాహకులు ఓ అడుగు ముందుకేసి ఒప్పంద పత్రంలో 'నో డేటింగ్' క్లాజ్ చేర్చడం విమర్శలకు దారితీస్తోంది. తాము ఎవరితోనూ డేటింగ్ చేయడంలేదని, సింగిల్గా ఉంటామని హామీ ఇస్తూ ఒప్పంద పత్రంలో నటీనటులు సంతకాలు చేయాలి.

రిష్టన్ కా సౌదాగర్- బాజీగర్ అనే టీవీ సిరీస్ కోసం నటీనటులు వత్సల్ సేథ్, ఇషితా దత్తా 'నో డేటింగ్' క్లాజ్ కూడిన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సీరియల్ త్వరలో ప్రసారంకానుంది. కాగా ఒప్పంద పత్రంలో 'నో డేటింగ్' క్లాజ్ను చేర్చడాన్ని పలువురు నటులు వ్యతిరేకించారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమని, కుటుంబ సభ్యులకు తప్ప ఇతరులకు వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించే హక్కు లేదని అన్నారు. ప్రేమ, బంధాలకు.. ఒప్పందాలతో సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement