బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆరు సీజన్స్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో.. త్వరలోనే ఏడో సీజన్‌ని ప్రారంభించబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రోమోని కూడా వదిలారు బిగ్‌బాస్ నిర్వాహకులు. షోలో పార్టీసిపెట్ చేసేందుకు చాలామంది జాబితానే వారు సిద్దం చేశారని తెలుస్తోంది. కానీ వారిలో కొందరికి మాత్రమే ఫైనల్ ఎంట్రీ అవకాశం ఉంటుందనేది అందరికీ తెలిసిందే.
(ఇదీ చదవండి: ఏపీ పాలిటిక్స్‌పై పూనమ్ ట్వీట్.. ఆమెపై బూతులతో రెచ్చిపోతున్న ఆయన ఫ్యాన్స్)
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట హోస్‌లోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. బుల్లితెరలో గుర్తింపు తెచ్చుకున్న అమర్‌దీప్-తేజస్వినిల వివాహం డిసెంబర్ 2021న బెంగళూరులో జరిగిన విషయం తెలిసిందే. అమర్‌దీప్‌కు దగ్గరి స్నేహితులైన సయ్యద్ సోహెల్, అరియాన, ప్రియాంక సింగ్ వంటి వారు పెళ్లికి హాజరయ్యారు.
'ప్రతి సంవత్సరం, మేకర్స్ షోలో కనీసం ఒక సెలబ్రిటీ జంటను ఉంచేందుకు ప్లాన్ చేస్తారు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ హిందీ వెర్షన్‌లో కూడా ఈ ట్రెండ్‌ను ఎక్కువగా అనుసరిస్తోంది. అందుకే, తెలుగు నుంచి బుల్లితెరలో పాపులర్ అయిన అమర్‌దీప్-తేజస్విని గౌడను స్టార్ మా సంప్రదించారని తెలుస్తోంది.
'జానకి కలగనలేదు' సీరియల్‌తో రామగా పాపులర్ అయ్యారు నటుడు అమర్‌దీప్. ఈ సీరియల్‌తో ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు వచ్చింది. మరోవైపు, 'కేరాఫ్ అనసూయ' సీరియల్‌తో పాపులర్ అయిన నటి తేజస్విని గౌడ. వీరిద్దరూ ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయారు. తేజస్విని కన్నడ టీవీ షోలలో కూడా నటించిడంతో అక్కడ మంచి ఫ్యాన్ బేస్ ఉంది.
ఈ జంట గత సీజన్‌లోనే అడుగుపెట్టబోతుందని బాగానే ప్రచారం జరగింది. కానీ ఈసారి పక్కాగా వీరిద్దరి ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఈ జంట షోలో అడుగుపెడితే సయ్యద్ సోహెల్, అరియాన సపోర్ట్ ఈ జంటకు ఖచ్చితంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
(ఇదీ చదవండి: లిప్‌లాక్,బోల్డ్ సీన్స్‌పై మా ఇంట్లో ఏమన్నారంటే: బేబీ హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment