బిగ్‌ బాస్‌ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక? | Bigg Boss Telugu 7 Contestant Rathika Rose To Make Re-Entry | Sakshi
Sakshi News home page

బిగ్‌ బాస్‌ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక?

Published Thu, Oct 5 2023 11:10 AM | Last Updated on Thu, Oct 5 2023 12:42 PM

Bigg Boss Rathika Rose Reentry - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-7 టైటిల్ ఫేవరెట్‌గా రతిక రోజ్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ కేవలం నాలుగో వారంలో ఆమె ఇంటిబాట పట్టింది. మొదట వరుసగా మహిళా కంటెస్టెంట్లను బిగ్‌బాస్‌ తప్పించేశాడు. అదేనండి ప్రజల ఓటింగ్‌ మేరకే.. వారిలో వరుసగా షకీలా ఫస్ట్ ఔట్‌ ఆ తర్వాత కిరణ్ రాథోడ్‌, సింగర్ దామిని, రతిక రోజ్‌ ఇలా ఎలిమినేట్‌ అయ్యారు. హౌజ్‌లోకి 14 మంది ఎంట్రీ ఇస్తే అందులో ఏడుగురు మహిళలు,ఏడుగురు పురుషులు ఉన్నారు.

(ఇదీ చదవండి: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌ ‘800’ ప్రివ్యూ రివ్యూ)

ప్రస్తుతం హౌజ్‌లో ముగ్గురు మాత్రమే మహిళా కంటెస్టెంట్లు ఉన్నారు. దాంతో బిగ్‌ బాస్‌ ఇంట్లో బ్యాలెన్స్ తప్పింది అని చెప్పవచ్చు. ఈ సీజన్‌ చాలా బిన్నంగా ఉంటుందని, ఉల్టా పుల్టా అని ఏవేవో కథలు చెప్పారు బిగ్‌బాస్‌. కానీ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదని చెప్పవచ్చు.  గత సీజన్‌లాగే ఈ సీజన్ కూడా తేలిపోయిందని కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం హౌజ్‌లో సభ్యుల సంఖ్య తక్కువగా ఉండటంతో గేమ్‌ చప్పగా నడుస్తుంది. సభ్యులు నిండుగా ఉన్నప్పుడూ అంతే.. దీంతో వచ్చే వారంలో మరో ఏడుగురు కంటెస్టెంట్లుగా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టబోతున్నారని ప్రచారం జరుగుతుంది. వీరిలో రతిక కూడా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.  

(ఇదీ చదవండి; సినిమాల కోసం రాజీనామా చేసిన IAS.. గతంలో ఈ కలెక్టర్‌ చరిత్ర ఇదే)

రతికకు రీ ఎంట్రీ అవకాశం బిగ్‌ బాస్‌ ఇవ్వాలని సోషల్‌ మీడియాలో ఆమె ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.  బిగ్‌బాస్‌ సీజన్‌- 2 సమయంలో నూతన్‌ నాయుడుకు రీ ఎంట్రీ అవకాశం కల్పించిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అదే విధంగా రతికకు కూడా మరో అవకాశం ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్‌ కోరుతున్నారు.. రీ ఎంట్రీ అనేది బిగ్‌ బాస్‌ అనుకుంటే జరగడం ఖాయం.. ఎందుకంటే ఉల్టా పుల్టా అని ముందే చెప్పారు కదా.. సో ఈ లెక్కన హౌజ్‌లో రోజ్‌ గ్లామర్‌ నింపేందుకు రతికను తీసుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement