Bigg Boss 7: రతిక ఎలిమినేట్.. మొత్తం ఎంత సంపాదించిందో తెలుసా? | Bigg Boss 7 Telugu Rathika Eliminated, Know About Her Remuneration Details Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Rathika Remuneration: మళ్లీ ఎలిమినేట్ అయిన రతిక.. 9 వారాలకు రెమ్యునరేషన్ అన్ని లక్షలా?

Published Sun, Nov 26 2023 10:26 PM | Last Updated on Tue, Nov 28 2023 11:35 AM

Bigg Boss 7 Telugu Rathika Eliminated And Remunaration Details - Sakshi

బిగ్‌బాస్ దత్తపుత్రిక రతిక మళ్లీ ఎలిమినేట్ అయిపోయింది. డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా రెండో వికెట్ రూపంలో హౌస్ నుంచి బయటకొచ్చేసింది. అయితే ఈ వారం నామినేట్ అయినప్పుడే ఈమె బయటకెళ్లడం కన్ఫర్మ్ అని అందరూ ఫిక్సయ్యారు. అలా అనుకున్నదే జరిగింది.అసలు రతిక రెండోసారి ఎలిమినేట్ కావడానికి కారణమేంటి? మొత్తం రెమ్యునరేషన్ రూపంలో ఎంత సంపాదించింది? 

రతిక మళ్లీ అదే తప్పు
బిగ్‌బాస్ షోలోకి వస్తున్నారంటే ఎంటర్‌టైన్ చేయాలి లేదంటే గేమ్స్ ఆడాలి. ఈ రెండు విషయాల్లోనూ రతిక ఫెయిలైంది. ఫస్ట్ ఎలిమినేట్ కావడానికి ముందు సరిగ్గా నాలుగు వారాలు హౌసులో ఉంది. అయితే వచ్చిన వెంటనే ప్రశాంత్‌ని తన చుట్టూ తిప్పుకొన్న రతిక.. అతడిపై రివర్స్ అయింది. దీంతో ఈమెపై నెగిటివిటీ పెరిగింది. పోనీ గేమ్స్ అయినా ఆడితే ఇది తగ్గేదేమో కానీ ముచ్చట్లు పెట్టడం తప్పితే ఒక్క విషయంలోనూ పెద్దగా మెప్పించలేకపోయింది. అలా నాలుగు వారాల తర్వాత హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది.

(ఇదీ చదవండి: యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందా? అసలు విషయం ఏంటంటే!)

బిగ్‌బాస్‌కి ఏం ప్రేమ పుట్టకొచ్చిందో ఏమో గానీ ఎలిమినేట్ అయిన రెండు వారాల్లోనే పిచ్చి లాజిక్స్ అని చెప్పి, రతికని తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అయినా రతిక గేమ్స్ ఆడిందా? అంటే అస్సలు లేదు. 'ఈ వారం కచ్చితంగా ఆడతా' అని హోస్ట్ నాగార్జునకు ప్రతిసారి చెప్పడమే సరిపోయింది. దానికి తోడు రీఎంట‍్రీ ఇచ్చిన తర్వాత ఒక్క గేమ్ కూడా గెలవలేకపోయింది. అలా ఈ వారం నామినేషన్స్‌లో నిలిచింది. అయితే రైతుబిడ్డ ప్రశాంత్‌తో ఈమె గొడవ పెట్టుకోవడం మైనస్ అయింది. దీంతో పాటు పలు కారణాలు కూడా రతిక పాప ఎలిమినేషన్‌కి కారణమయ్యాయి.

రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇక రెండుసార్లు కలిపి రతిక.. బిగ్‌బాస్ హౌస్‌లో 9 వారాలు ఉంది. తొలుత నాలుగు వారాలు, రీఎంట్రీ తర్వాత మరో ఐదు వారాల పాటు బండి లాక్చొచ్చేసింది. ఇక ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం రతికకి వారానికి రూ.2 లక్షలు అనుకున్నారట. అంటే ఓవరాల్‌గా దాదాపు రూ.18 లక్షల వరకు రెమ్యునరేషన్ రూపంలో సంపాదించినట్లు తెలుస్తోంది. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: లవర్‌ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement