బిగ్‌బాస్ 12వ వారం నడుస్తోంది. గతవారం లానే ఈసారి కూడా ఏకంగా 8 మంది నామినేట్ అయ్యారు. గత వీకెండ్ లో నాగ్ చెప్పినట్లు ఈసారి డబుల్ ఎలిమినేషన్ గండం ఉంది. మరోవైపు పెద్దాయన శివాజీకి అమర్‌దీప్ వల్ల షాక్ తగిలింది. ఇంతకీ అసలేం జరుగుతోంది? నామినేషన్స్-ఓటింగ్-ఎలిమినేషన్ సంగతేంటి అనేది ఇప్పుడు చూద్దాం.
నామినేషన్స్ సంగతేంటి?
బిగ్‌బాస్ ప్రస్తుత సీజన్‌లో 11 వారాలు పూర్తయ్యాయి. పదివారాల పాటు ఒక్కో కంటెస్టెంట్ చొప్పున ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. గతవారం మాత్రం యావర్ తన ఎవిక్షన్ పాస్ తిరిగిచ్చేసిన కారణాన్ని చూపిస్తూ నో ఎలిమినేషన్ అన్నారు. ఈ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగ్ బాంబు పేల్చాడు. దీంతో ఈసారి నామినేషన్స్ అనేది కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారిపోయింది. కెప్టెన్ ప్రియాంక, శోభా తప్పితే మిగిలిన 8 మంది లిస్టులోకి చేరిపోయారు.
(ఇదీ చదవండి: కాస్ట్‌లీ కారులో మెగాహీరో రామ్ చరణ్.. దీని ధరెంతో తెలుసా?)
డేంజర్‌లో బ్యూటీస్?
అయితే ప్రతిసారి రైతుబిడ్డ, శివాజీకి ఎక్కువ ఓట్లు పడేవి. ఈ వారం మాత్రం అనుహ్యంగా అమర్‌దీప్ అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఓ రకంగా శివాజీకి దెబ్బే అని చెప్పొచ్చు. అమర్ టాప్‌లో ఉండగా, రెండు-మూడు స్థానాల్లో శివాజీ, ప్రశాంత్ ఉన్నారట. ఆ తర్వాత వరసగా యావర్, గౌతమ్, అర్జున్ ఉన్నట్లు తెలుస్తోంది. చివరి రెండు స్థానాల్లో రతిక, అశ్విని ఉన్నారట. అంటే ఆడ లేడీస్ ఇద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నట్లే.
లిస్ట్ మారే ఛాన్స్ ఉందా?
ప్రస్తుత పరిస్థితుల బట్టి ఈ వారం ఓటింగ్ విషయంలో పెద్దగా మార్పులేం ఉండకపోవచ్చని తెలుస్తోంది. అలానే అశ్విని.. ఈ వారం సెల్ఫ్ నామినేట్ చేసుకుని, అసలు బిగ్‌బాస్‌లో ఉండటానికి తనకు ఇష్టం లేదనే విషయాన్ని పరోక్షంగా చెప్పేసింది. మరోవైపు రతిక.. ఒక్కటంటే ఒక్క విషయంలోనూ ఆకట్టుకోలేకపోతుంది. దానికి తోడు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నవాళ్లతో పోలిస్తే వీళ్లిద్దరికీ ఫ్యాన్ బేస్ కూడా పెద్దగా లేదు. కాబట్టి ఓటింగ్ లిస్ట్ అనేది మారకపోవచ్చు. అంటే అమ్మాయిలిద్దరూ ఎలిమినేట్ అయిపోవడం గ్యారంటీ! శనివారం వరకు ఆగితే ఎలిమినేషన్ సంగతేంటో తేలిపోతుంది! అప్పటివరకు జస్ట్ వెయిట్ అండ్ సీ!
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్.. భర్త ఎవరంటే?)
Comments
Please login to add a commentAdd a comment