బిగ్‌ బాస్‌లోకి ఆ స్టార్‌ హీరో, హీరోయిన్‌.. ఆఖరి క్షణంలో అదిరిపోయే ట్విస్ట్‌ | Bigg Boss 7 Telugu: Unexpected Contestants Abbas And Farzana Entering Into The BB House, Buzz Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: బిగ్‌ బాస్‌లోకి ఎవరూ ఊహించలేని ఆ హీరో, హీరోయిన్‌ ఎంట్రీ

Published Wed, Aug 23 2023 9:07 AM | Last Updated on Sat, Sep 2 2023 2:11 PM

Bigg Boss Telugu 7 Unexpected Contestants Abbas And Farzana - Sakshi

బిగ్‌బాస్‌ 7 సీజన్‌ షో ప్రారంభానికి కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సెప్టెంబర్‌ 3న గ్రాండ్‌గా ఈ షోను ప్రారంభించేందకు మేకర్స్‌ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కంటెస్టెంట్ల ఎంపిక సరిగా లేకపోవడం వల్ల గత సీజన్లు కొన్ని అంతగా మెప్పించలేదనే చెప్పవచ్చు. కానీ ఈసారి ఆ తప్పులు జరగకుండా బిగ్‌బాస్‌ టీమ్‌ పలు జాగ్రత్తలే తీసుకుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు చాలమంది కంటెస్టెంట్లను ప్రేక్షకులకు బాగా తెలిసినవారినే ఎంపిక చేశారని తెలుస్తోంది. అందులో భాగంగా ఎవరూ ఊహించని ఇద్దరి పేర్లు తాజాగా తెరపైకి వచ్చాయి.

ఇదీ చదవండి: (అనుష్కతో హగ్ ఎలా ఉంటుందంటే.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నవీన్‌)

హీరో అబ్బాస్‌, హీరోయిన్‌ ఫర్జానా ఇద్దరూ కూడా బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్తున్నట్లు సమాచారం. ప్రేమదేశం సినిమాతో తెలుగువారికి పరిచయం అయిన అబ్బాస్‌కు ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ కొన్ని సినిమాల తర్వాత తన నటనకు గుడ్‌బై చెప్పి ఫ్యామిలీతో న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. తాజాగా కుటుంబంతో సహా ఆయన ఇండియాకు తిరిగొచ్చాడు. మళ్లీ సినిమా అవకాశాలు వస్తే నటిస్తానని పలు ఇంటర్వ్యల్లో కూడా ఓపెన్‌గా చెప్పాడు. అందులో భాగంగానే ఆయన బిగ్‌బాస్‌కు వెళ్లాలని ఫిక్స్‌ అయ్యాడట.

ఇప్పటికే పలు తెలుగు యూట్యూబ్‌ ఛానల్స్‌కు ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులకు మళ్లీ దగ్గరవుతున్నాడు. ఆయనతో పాటు హీరోయిన్‌ ఫర్జానా ఎంట్రీ కూడా దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది ఈ ముంబయ్‌ బ్యూటీ. సీమ శాస్త్రి, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్,1977, కుబేరులు వంటి చిత్రాల్లో నటించింది. 2009 తర్వాత నుంచి ఆమె టాలీవుడ్‌కు దూరంగా ఉంది. తాజాగా ఆమె బిగ్‌బాస్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే ప్లాన్‌లో ఉందట.

(ఇదీ చదవండి: బిగ్‌ బాస్‌లోకి భర్త.. వద్దని వార్నింగ్‌ ఇచ్చిన టాప్‌ డైరెక్టర్‌ కూతురు)

ఫర్జానాలో ఉన్న మరో టాలెంట్‌ డ్యాన్స్‌. బాలీవుడ్‌లో పలు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌కు కొరియోగ్రాఫర్‌గా కూడా పనిచేసింది. హీరో హోండా, సన్ సుయ్, గోద్రెజ్ హెయిర్ కేర్, బిగ్ బజార్ వంటి ప్రముఖ సంస్థలకు ఆమె ప్రచారకర్తగా కూడా పనిచేసింది. ఇప్పుడు వీరిద్దరూ అనూహ్యంగా బిగ్‌బాస్‌ లిస్ట్‌లోకి వచ్చేశారని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement