Amrita Rao and RJ Anmol Secretly Got Married in 2014? Details Inside - Sakshi
Sakshi News home page

Amrita Rao: ఆర్జేతో 'అతిథి' హీరోయిన్‌ రహస్య వివాహం

Published Wed, Mar 9 2022 6:02 PM | Last Updated on Wed, Mar 9 2022 7:25 PM

Amrita Rao and RJ Anmol Secretly Got Married in 2014? Details Inside - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ అమృత రావు, ఆర్జే అన్మోల్‌ 2014లోనే సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారట.  ఈ విషయాన్ని సెలబ్రిటీ కపుల్‌ తమ యూట్యూబ్‌ ఛానల్‌లో వెల్లడించారు. పెళ్లి చేసుకుంటే కెరీర్‌ దెబ్బతింటుందేమో అన్న ఉద్దేశ్యంతో మొదట్లో వెనుకడుగు వేశామని గుర్తు చేసుకున్నారు. పెద్ద పెద్ద సినిమా ఆఫర్లు వస్తున్న సమయంలో అన్మోల్‌ పెళ్లి చేసుకుందామని ప్రపోజల్‌ పెట్టాడట. కానీ దీనివల్ల కెరీర్‌ ప్రభావితమవుతుందేమోనని అమృత భయపడటంతో అన్మోల్‌ ఓ ప్లాన్‌ చెప్పాడు. రహస్య వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందన్నాడు. ఇద్దరూ కలిసి ఉండొచ్చు, కెరీర్‌కు కూడా ఎలాంటి ఢోకా ఉండదు కాబట్టి సరేనంది అమృత. అలా ఇద్దరూ గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారు. సీక్రెట్‌ మ్యారేజ్‌ కాబట్టి కజిన్స్‌ను కూడా పిలవలేదని చెప్పింది హీరోయిన్‌.

ఈ పెళ్లి 2014లో మే 15న జరిగిందని వెల్లడించారు. ఈ రహస్య వివాహాన్ని నాలుగైదు సంవత్సరాల కంటే ఎక్కువకాలం దాచలేమని ముందే తెలుసంటున్నాడు అన్మోల్‌.  అందుకే 2016లో తామిద్దరం దంపతులమని అధికారికంగా ప్రకటించారు. కాగా అమృతరావు.. షాహిద్‌ కపూర్‌ 'ఇష్క్‌ విష్క్‌' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 'వివాహ్‌', 'మస్తీ' వంటి పలు చిత్రాల్లో నటించిన ఈ హీరోయిన్‌ తెలుగులో 'అతిథి' సినిమాలో కథానాయికగా మెప్పించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement