
Amrita Rao And RJ Anmol Reveals Their Wedding Photos: బాలీవుడ్ బ్యూటీ అమృత రావు సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన అతిథి సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ చిత్రంలో తన గ్లామర్, అభినయంతో బాగానే ఆకట్టుకుంది. కానీ తర్వాత మళ్లీ తెలుగు తెరపై ఆమె కనిపించలేదు. తిరిగి బాలీవుడ్‌కే వెళ్లిన అమృత మంచి స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీ సంపాందించుకుంది. తాజాగా అమృత తన పెళ్లి ఫొటోలను మొట్టమొదటిసారిగా షేర్ చేసింది. అది ఎలా అంటే తన భర్తను తానే మళ్లీ పెళ్లి చేసుకుని. అవును.. అమృతకు ఆర్జే అన్మోల్‌తో 2014లో రహస్య వివాహం జరిగింది. అయితే ఇదివరకూ ఆర్జే అన్మోల్‌తో తనకు రహస్య వివాహం జరిగినట్టు ఓ వీడియో ద్వారా ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ఆర్జే అన్మోల్‌ను మళ్లీ చేసుకుంటూ తమ పెళ్లి నాటి ఫొటోలను ఒక వీడియో రూపంలో బయట పెట్టింది ఈ బ్యూటీ.
ఈ సెలబ్రిటీ జంట యూట్యూబ్ ఛానల్ 'కపుల్ ఆఫ్ థింగ్స్'లోని కొత్త ఎపిసోడ్‌లో తమ వివాహ వివరాలను పంచుకున్నారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత తమ కుటుంబ సభ్యుల మధ్య ఈ జంట మళ్లీ పెళ్లి చేసుకుంది. ఈ వీడియోలో అమృత, అన్మోల్ తమ కుటుంబ సభ్యులతో కలిసి సంభాషించడం, మెమొరీ లేన్‌లో నడవడం వంటి తదితర మధురమైన క్షణాలను పంచుకుంది ఈ జంట. కాగా ఈ సెలబ్రిటీ జంట తమ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండేందుకే రహస్యంగా 2014లో మే 15న వివాహం చేసుకున్నట్లు తెలిపింది. ఈ బ్యూటీఫుల్ సెలబ్రిటీ కపుల్‌కు నవంబర్ 1, 2020న బాబు పుట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment