విమానాశ్రయంలో హీరోయిన్ సూట్కేస్ చోరీ | Amrita Rao Loses Her Luggage At Jaipur Airport | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో హీరోయిన్ సూట్కేస్ చోరీ

Published Wed, Oct 7 2015 1:06 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM

Amrita Rao Loses Her Luggage At Jaipur Airport

జైపూర్: బాలీవుడ్ నటి, 'అతిథి' హీరోయిన్ అమృతారావు విలువైన సూట్కేస్ జైపూర్ విమానాశ్రయంలో చోరికి గురైంది.  ఒక నగల యాడ్ షూటింగ్ నిమిత్తం ఆమె పింక్ సిటీకి వచ్చింది. ఈ క్రమంలో తాను  తెచ్చుకున్న మూడు లగేజీ బ్యాగ్స్లో ఒకటి మిస్సయిన విషయాన్ని గమనించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో సుమారు లక్ష రూపాయల విలువైన వస్తువులున్నాయని తెలిపింది.

మరోవైపు తమ విమానాశ్రయంలో ఇలాంటి సంఘటన ఇంతకుముందు జరగలేని ఎయిర్ పోర్ట్ అధికారులు చెప్పారు. తమ సిబ్బంది చాలా సిన్సియర్గా, జాగ్రత్తగా విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. దీనిపై త్వరిత గతిన విచారణ జరిపి పోయిన సూట్ కేసును ఆమెకు అందజేస్తామన్నారు.

మరోవైపు పింక్ సిటీ లో షూటింగ్ అంటూ చాలా ఉత్సాహంగా ఉందని అమృతారావు పేర్కొంది.  పెద్ద నగరాల్లో ఇలాంటి చిన్న చిన్న ఘటనలు మామూలేనని,  విమానాశ్రయ అధికారులు తన సూట్ కేసును తిరిగి అందజేస్తారన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేసింది. తెలుగులో మహేశ్ బాబు సరసన 'అతిథి' సినిమాలో అమృత నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement