సినిమాలకు సమంత గుడ్‌ బై! | Samantha Akkineni Plans to Quit Movies | Sakshi
Sakshi News home page

Jul 6 2018 11:19 AM | Updated on Jul 14 2019 4:41 PM

Samantha Akkineni Plans to Quit Movies - Sakshi

సౌత్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని సినిమాలకు గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఓ వార్త జోరుగా షికార్లు కొడుతోంది.  కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ‘సినిమాలు చేయటం ఇప్పట్లో ఆపబోనని’ స్వయంగా ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది నుంచి మాత్రం ఆమె సినిమాలకు దూరం కాబోతున్నారన్నది ఆ కథనం సారాంశం. 

అక్కినేని హీరో నాగచైతన్యతో వివాహం అయ్యాక.. కెరీర్‌ను కొనసాగిస్తున్న సామ్‌ మంచి హిట్లు అందుకున్నారు. ప్రస్తుతం తెలుగులో యూటర్న్‌ రీమేక్‌, తమిళంలో సెమ్మ రాజా, సూపర్‌ డీలక్స్‌ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. వీటితోపాటు నిన్ను కోరి ఫేమ్‌ శివ నిర్వాణ డైరెక్షన్‌లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కించబోయే ఓ ప్రాజెక్టులోనూ ఆమె నటించే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇవికాకుండా కొత్త ప్రాజెక్టులను ఆమె ఒప్పుకోవటం లేదు. దీంతో 2019 మార్చి కల్లా ఆయా ప్రాజెక్టులను పూర్తి చేసేసి.. తర్వాత ఆమె సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్నారని ఆ కథనం పేర్కొంది. అయితే అది శాశ్వతంగానా? లేక తాత్కాలికమా? అన్నది మాత్రం పేర్కొనలేదు. ఈ వార్తపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఒక్కసారి తల్లిగా మారితే...: సమంత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement