ఛలో సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. చేసింది కొన్ని సినిమాలే అయినా ఈ అమ్మడి పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. బాలీవుడ్‌లో డెబ్యూ కోసం హీరోయిన్లు తహతహలాడుతుంటే..రష్మిక మాత్రం ఏకకాలంలో బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేసేస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్నులో నటిస్తూనే, బిగ్‌బి అమితాబ్‌తో కలిసి గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. అమితాబ్ బచ్చన్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని చెబితే తన పేరేంట్స్ తనను నమ్మలేదని చెప్పింది. తన తల్లిదండ్రులిద్దరూ బిగ్‌బికి పెద్ద ఫ్యాన్స్ అని, ఆయన సినిమాలన్నీ తప్పకుండా చూస్తారని చెప్పుకొచ్చింది. ఇటీవలె గుడ్ బై సెట్లో బర్త్‌డే సెలబబ్రేట్ చేసుకున్న రష్మిక..ఇది ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్న సంగతి తెలిసిందే. వికాశ్ బల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ కూతురిగా రష్మిక కనిపించనుంది. ఇక కోలీవుడ్‌లో ఆమె నటించిన డెబ్యూ చిత్రం సుల్తాన్ ఇటీవలె విడుదలయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పాన్‌ఇండియా మూవీ పుష్పలో నటిస్తుంది.
చదవండి : రష్మిక కోరిక త్వరలోనే నెరవేరుస్తానన్న బన్నీ
డిజప్పాయింట్ అయిన రష్మిక.. ఎందుకిలా?
Comments
Please login to add a commentAdd a comment