
యంగ్ హీరోలతో పోటీపడి నటిస్తున్న సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్. వయసు మీద పడుతున్నా ఏమాత్రం హుషారు తగ్గకుండా రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తూనే ఉన్నారు. 80వ పడిలో అడుగుపెట్టినా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నారు. నేడు (అక్టోబర్ 11న) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా గుడ్ బై చిత్రయూనిట్ అమితాబ్‌కు స్పెషల్ విషెస్ తెలియజేస్తూ హ్యాపీ బర్త్‌డే సాంగ్ రిలీజ్ చేసింది.
సినిమాలో బిగ్‌బీ బర్త్‌డే విజువల్స్ చూపించడంతో పాటు సెట్స్‌లో అతడితో కేక్ కట్ చేయించిన క్లిప్పింగ్‌ను కూడా ఇందులో యాడ్ చేశారు. ఈ వీడియోలో నటీనటులతో పాటు దర్శకుడు వికాస్ కూడా ఉన్నాడు. కాగా గుడ్ బై సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. నీనా గుప్తా, సునీల్ గ్రోవర్, పవైల్ గులాటి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్టోబర్ 7న విడుదలైంది.
చదవండి: ఆస్కార్ ఎంట్రీకి ఆర్‌ఆర్‌ఆర్.. నెటిజన్ ట్వీట్‌పై మంచు విష్ణు రియాక్షన్
లైంగిక ఆరోపణలు.. అలాంటి వ్యక్తిని అప్పుడు చూపిస్తారా?
Comments
Please login to add a commentAdd a comment