
‘‘నా కల నెరవేరింది. ఎంతో ఉద్వేగంగా ఉంది. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేను’’ అంటున్నారు నటి నీనా గుప్తా. ఈ ఉద్వేగానికి, ఆనందానికి కారణం అమితాబ్ బచ్చన్ సరసన నటించే అవకాశం ఆమెకు దక్కడమే. తొలిసారి బచ్చన్‌తో నీనా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సినిమా ‘గుడ్ బై’. ఇందులో అమితాబ్ భార్యగా నటిస్తున్నారామె. వీరి కూతురిగా రష్మికా మందన్నా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి నీనా గుప్తా మాట్లాడుతూ – ‘‘దర్శకుడు వికాశ్ బహల్ ఈ కథ గురించి చెప్పినప్పుడు థ్రిల్ అయ్యాను. అంత అద్భుతంగా ఉంది. నా పాత్రను బాగా రాశారు.
మంచి కథ, అమితాబ్‌తో నటించాలనే నా కల నెరవేర్చిన చిత్రంగా ‘గుడ్ బై’కి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది’’ అన్నారు. ఇదిలా ఉంటే.. నీనా గుప్తా నటించిన ‘బధాయీ హో’ (2018)ని అమితాబ్ చూశారు. చూడడమే కాదు.. ‘అద్భుతంగా నటించావ్ నీనా..’ అంటూ స్వహస్తాలతో ఓ లేఖ రాసి, ఆమెకు పంపారు కూడా! బిగ్ బి ప్రశంసలు అందుకున్న నీనా చాలా ఆనందపడ్డారు. ఇప్పుడు ఆయన సరసన నటిస్తున్నందుకు డబుల్ ఆనందంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment