న్యూఢిల్లీ: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగనున్న అభ్యర్థుల తొలిజాబితాను బీజేపీ ప్రకటించిన మరుసటి రోజే రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్.హర్షవర్ధన్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పరిధిలోని చాంద్‌నీచౌక్ స్థానం నుంచి సిట్టింగ్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. శనివారం బీజేపీ విడుదలచేసిన తొలి జాబితాలో ఈయన పేరు లేదు. అందుకే ఈయన రాజకీయాలను వదిలేస్తున్నట్లు వార్తలొచ్చాయి.
ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ‘‘ 50 ఏళ్ల క్రితం కాన్పూర్‌లో ఎంబీబీఎస్‌లో చేరా. పేదలకు సేవచేశా. 30 ఏళ్ల పైబడిన రాజకీయ జీవితంలో ఐదు సార్లు శాసనసభ, రెండు సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచా. మళ్లీ ఇన్నాళ్లకు నా మూలాల్లోకి వెళ్లిపోతా’’ అన్నారు. ఢిల్లీ పరిధిలో నలుగురు సిట్టింగ్ ఎంపీలు పర్వేశ్ శర్మ, రమేశ్ బిధూరి, మీనాక్షి లేఖీ, హర్‡్షవర్ధన్‌లను కాదని కొత్త వారికి బీజేపీ అవకాశమిస్తూ వారి పేర్లను తొలి అభ్యర్థుల జాబితాల చేర్చడం తెల్సిందే.
నేను పోటీచేయలేను: పవన్ సింగ్
పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్ ఎంపీ స్థానం నుంచి తనను బీజేపీ అభ్యరి్థగా నిలబెట్టినప్పటికీ తాను మాత్రం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీ నేత పవన్ సింగ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ‘‘ నేనైతే పోటీ నుంచి వైదొలగుతున్నా. ఎందుకు పోటీ చేయట్లేను అనే కారణాలను వెల్లడించలేను’ అని భోజ్‌పురీ గాయకుడు, నటుడు అయిన పవన్ సింగ్ స్పష్టంచేశారు. అసన్‌సోల్‌లో బీజేపీ ముందే ఓడిందంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవాచేసింది.
Comments
Please login to add a commentAdd a comment